ఈ మధ్యకాలంలో అంత సింపుల్ అందాన్ని తెరపైన చూడలేదు. ఫోటోల్లో కూడా.
ఆ అందం పేరు శ్రీదివ్య.
సుమారు మూడేళ్ల వయస్సులోనే బాలనటిగా తెరంగేట్రం చేసిన శ్రీదివ్య పుట్టింది హైదరాబాద్‌లోనే. తను కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్ అని కూడా ఇందాకే తెలుసుకున్నాను. అన్నట్టు, శ్రీదివ్య సోదరి శ్రీరమ్య కూడా తెలుగు తమిళ సినిమాల్లో నటిస్తోంది.
బాలనటిగా శ్రీదివ్య నటించిన తొలిచిత్రం 2000లో వచ్చిన "హనుమాన్ జంక్షన్". హీరోయిన్‌గా శ్రీదివ్య నటించిన తొలి చిత్రం "బస్టాప్" అనుకున్నాను. కాదు. హీరోయిన్‌గా శ్రీదివ్య నటించిన మొదటి సినిమా రవిబాబు దర్శకత్వం వహించిన "మనసారా".
"మనసారా" నేను చూడలేదు. మారుతి "బస్టాప్"లో మాత్రం శ్రీదివ్య లుక్ సోసోగానే అనిపించింది. శ్రీదివ్యలోని యాక్టింగ్ స్కిల్స్‌తో పాటు, తనలోని నేచురల్ బ్యూటీని కాటన్ చీరల్లోనే అద్భుతంగా చూపించిన క్రెడిట్ ఒక్కరికే చెందుతుంది. అతను రామరాజు. "మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు" దర్శకుడు.
"మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు" చిత్రం కమర్షియల్‌గా ఎంత విజయవంతమయిందో నాకు తెలియదు. దర్శకుడు రామరాజుకి ఎంత పేరు తెచ్చిందో కూడా నాకు తెలియదు. శ్రీదివ్యకి మాత్రం చాలా గుర్తింపు వచ్చింది.
కట్ టూ అసలు పాయింట్ -
"బస్టాప్" సినిమా కమర్షియల్‌గా మంచి హిట్. ఆ తర్వాతే వచ్చిన "మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు" చిత్రం కూడా శ్రీదివ్యకి మంచి పాపులారిటీ తెచ్చింది. అయినా - టాలీవుడ్ నుంచి శ్రీదివ్యకి ఏమంతగా ఆఫర్లు వచ్చినట్టులేవు. అదే ఆశ్చర్యం!
మన పక్కనున్న తమిళ ఇండస్ట్రీ మాత్రం ఈ కాటన్ చీరెల కనువిందుని ఠక్కున పట్టేసింది. శ్రీదివ్య హీరోయిన్‌గా నటించిన (శివకార్తికేయన్ హీరో) తమిళ చిత్రం "వరుతపడాద వాలిబర్ సంఘం" అక్కడ మంచి బాక్సాఫీస్ హిట్ కొట్టింది. ఇంకో రెండు తమిళ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి!
తమిళ ఇండస్ట్రీకి నచ్చిన శ్రీదివ్య మనవాళ్లకి అంతగా ఆనకపోవడంలో ఆశ్చర్యంలేదు. కథ, కాకరకాయ ఎలా ఉన్నా, అందాలన్నీ ఆరబోస్తేనే తెలుగులో కుదురుతుంది. నిండా కప్పేస్తే ఇంక సినిమా ఎందుకు? బహుశా, మనవాళ్ల పాయింటాఫ్ వ్యూ అదే అయ్యుంటుంది ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani