అసలు షకీలా కథే వేరు.
ఈ ఒక్క వాక్యం చాలు అనుకుంటాను తను ఎంత బోల్డో చెప్పడానికి!
నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాలెం నుంచి వచ్చిన షకీలా కూడా, సిల్క్ స్మిత లాగే, "ఏదో ఒక పని చేసుకుందాం, బ్రతుకుదాం" అన్న ఉద్దేశ్యంతోనే ముందుగా సినిమాల్లోకి ఎంటరయ్యింది. తర్వాత షరా మామూలే.
సినీ ఫీల్డులోని అన్ని ఆకర్షణలు, గ్లామర్ బాగా నచ్చాయి. అంత సులభంగా ఎక్కడా రానంత డబ్బూ కనిపించింది. అంతే, ఫిక్స్ అయిపోయింది. ఇక సినీ ఫీల్డే తన ఫీల్డనుకుంది.
తమిళంలో "ప్లేగర్ల్స్" అనే 'సాఫ్ట్‌కోర్' మూవీతో తన సినీ ప్రయాణం మొదలెట్టింది షకీలా. ఈ సినిమాలో సిల్క్ స్మిత మెయిన్ హీరోయిన్ కావడం విశేషం. తర్వాత "కిన్నెర తుంబికర్" అనే ఓ మళయాళం మూవీతో మొదటిసారిగా పాప్యులర్ అయింది. ఇంక అంతే.
తర్వాతంతా షకీలా చరిత్రే!
ఇప్పటివరకు సుమారు 110 సినిమాల్లో నటించిన షకీలా - ఎక్కువగా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ హిందీ సినిమాల్లో నటించింది. షకీలా నటించిన ఈ సినిమాలన్నీ దాదాపు "బి" గ్రేడ్ 'సాఫ్ట్‌కోర్' సినిమాలుగానే చెప్తారు. ఒక టైమ్‌లో - "షకీలా సినిమా" అన్న పదాన్ని "సాఫ్ట్ పోర్న్" సినిమాకు పర్యాయపదంగా వాడేవారు!
షకీలా సినిమాల పాప్యులారిటీ ఒక దశలో మన ఇరుగుపొరుగు విదేశీ భాషల్లోకి కూడా విస్తరించింది. షకీలా సాఫ్ట్‌కోర్ సినిమాలన్నీ నేపాలీ, చైనీస్, సిం హళ భాషల్లోకి కూడా డబ్ చేసి మార్కెట్ చేయబడ్డాయి!
కట్ టూ రియల్ షకీలా -
సినిమాలో షకీలా వేరు. బయట వేరు. చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతుంది. చాలా చక్కటి గౌరవమర్యాదల్ని పాటిస్తుంది.
నేను తనని మొదటిసారిగా అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో షూటింగ్ జరుగుతుండగా ఒకసారి, పద్మాలయా స్టూడియోలో పాట షూటింగ్ జరుగుతుండగా మరొకసారి కలిశాను. అలా కలిసినప్పుడు, షాట్ గ్యాప్‌లో బాగానే సిగరెట్లు కాలుస్తూ కనిపించింది షకీలా.
షూటింగ్‌లో తాను ధరించే కాస్ట్యూమ్‌లన్నీ కాస్త ఎక్స్‌పోజింగ్‌గానే ఉంటాయి కాబట్టి - షాట్ గ్యాప్‌లో, పైన ఒక నైటీలాంటి దాన్ని కిందనుంచి మీది వరకూ వేసేది షకీలా. సిగరెట్ మామూలే.
ఆ షూటింగ్‌లోనే, షాట్ గ్యాప్‌లో నేను తనతో మాట్లాడుతూ ఉండగా, చేతిలో క్లాప్‌బోర్డుతో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి "మేడం! షాట్ రెడీ!!" అన్నాడు ఉత్సాహంగా.
"ఏంటి షాట్?" అడిగింది షకీలా.
"పెద్ద షాటేం కాదు మేడమ్.. చిన్న బిట్టే!" అన్నాడా అసిస్టెంట్.
"లేదమ్మా.. ఇప్పుడు నేను "బిట్" లు చేయటంలేదు." అంది షకీలా.
ఇక్కడ "బిట్" అంటే అర్థం ఏదో ఎక్స్‌పోజింగ్ సీనో, ఎక్స్‌పోజింగ్ షాటో అన్నమాట! అప్పటికి నిజంగానే తన 'మార్కు' సాఫ్ట్‌కోర్ సినిమాల్ని మానేసి - కేవలం తెలుగు, తమిళ భాషల్లో మామూలు కేరెక్టర్ రోల్స్ చేస్తోంది షకీలా. అది బహుశా 2003.
అసలు 'తన మార్కు' షకీలా సినిమాలని షకీలా ఉన్నట్టుండి ఎందుకు మానేసినట్టు? మళయాళంలో ఎందుకు దాదాపుగా నటించడం తగ్గించినట్టు?
ఈ ప్రశ్నల వెనక పెద్ద కథే ఉంది.
షకీలా సినిమా రిలీజ్ రోజున, మరే భారీ హీరో సినిమా రిలీజయినా సరే, అటువైపు ఒక్కరూ కన్నెత్తి చూసేవారుకాదు! షకీలా సినిమా హౌజ్ ఫుల్స్. భారీ హీరోల సినిమాలు నిల్స్!
షకీలా స్టఫ్‌కి ఉన్న క్రేజ్ అదీ.
పేర్లు రాయటం లేదు కానీ, పెద్ద పెద్ద మళయాళం హీరోలు కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూ ఇచ్చిన మెమోరాండం మీద సంతకాలు చేసినట్టు సమాచారం. అన్ని పేపర్లలో ఈ న్యూస్ వచ్చింది కూడా.
చివరికి ప్రభుత్వం మళయాళంలో "బి గ్రేడ్" (!?) సినిమాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. షకీలా ఇంక అక్కడి నుంచి జెండా ఎత్తెయ్యక తప్పలేదు. అలా 2003 నుంచీ షకీలా మామూలు కేరెక్టర్ రోల్సే వేస్తోంది.
నా మొదటి చిత్రం "కల"లో వేణుమాధవ్, అల్లరి సుభాషిణి కాంబినేషన్లో షకీలా ఒక కామెడీ ఎపిసోడ్‌లో అద్భుతంగా నటించింది. షకీలా మంచి డిసిప్లిన్ ఉన్న నటి. యాక్టింగ్‌లో దాదాపు అన్నీ సింగిల్ టేక్ లోనే అలవోగ్గా చేసేస్తుంది.
కట్ టూ షకీలా లేటెస్ట్ -
ఉన్నట్టుండి ఇప్పుడు మళ్లీ మళయాళంలో బిజీ అయింది షకీలా. ఈ సారి డైరెక్టర్ అవతారమెత్తింది. ఆ చిత్రంలో తనే హీరోయిన్ కూడా! గ్రేటే కదా?
ఇదిలా ఉంటే - ప్రస్తుతం షకీలా తన ఆటోబయోగ్రఫీ రాస్తున్నట్టు ఇటీవల చెప్పింది. సినీ ఫీల్డులో తన అనుభవాలు, జ్ఞాపకాలతో పాటు - తనకు ఇండస్ట్రీలోనూ, బయటా ఎవరెవరితో ఎలాంటి పరిచయాలూ, అనుభవాలున్నాయో పాఠకులతో అందులో పంచుకోబోతున్నట్టు కూడా చెప్పింది. ఇంకేం కావాలి? ఈ వార్త షకీలా ఫేన్స్ అందరికీ పండగే.
ఒక వ్యాంప్, సాఫ్ట్‌కార్న్ హీరోయిన్‌గా ఒక ఇండస్ట్రీనే గడగడలాడించింది. తన సినిమాల రిలీజ్‌తో బడా బడా హీరోలను కూడా మళయాళంలో హడలెత్తించింది. చివరికి ఇండస్ట్రీ యావత్తూ గవర్నమెంటుకి మొరపెట్టుకొనేలా చేసింది. తెలుగులో ఎన్నో టౌన్స్‌లో, తన సినిమాలతో థియేటర్లను హౌజ్ ఫుల్స్ చేస్తూ, నష్టాల్లో ఉన్న ఎందరో థియేటర్ యజమానుల పాలిట దేవత అయింది. ఇప్పుడు డైరెక్టర్ కూడా అయింది. తన ఆటోబయోగ్రఫీ కూడా రాస్తోంది.
షకీలా ఏం సాధించలేదు?

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani