రచయితలు, కవుల నోటివెంట తరచూ ఒక మాట వింటుంటాం.
"మూడ్ లేదు!"
ఈ మూడ్ మరిదేనికో కాదు. రాయడం కోసం! దీన్నే ఇంగ్లిష్‌లో "రైటర్స్ బ్లాక్" అంటారు. నిజానికి అసలు ఈ రైటర్స్ బ్లాక్ అనేది లేనే లేదు. ఒక భ్రమ. ఆ ప్రత్యేక సమయంలోని ఒక నెగెటివ్ మైండ్ సెట్. అంతే.
ఏదో మూడ్.. ఎక్కడ్నించో రావాలని ఎదురు చూస్తూ కూర్చుంటే రాదు. దేనికోసమైతే మనకు మూడ్ అవసరమో, నేరుగా విషయంలోకి దిగితే మూడ్ దానంతట అదే వస్తుంది. అంతేగాని, మూడ్ అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. ముఖ్యంగా ప్రొఫెషల్ రైటర్స్, ఇతర క్రియేటివ్ పీపుల్ విషయంలోనయితే సింపుల్‌గా ఇదొక సాకు. అంతే.
ప్రఖ్యాత అమెరికన్ రచయిత, జర్నలిస్టు, నోబెల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ హెమింగ్వే ఈ విషయంలో ఒక చిన్న చిట్కా చెప్పాడు. అదేంటంటే -
"నీకు తెలిసిన ఏదయినా ఒక వాస్తవం గురించి ముందుగా ఒక వాక్యం రాయి. తర్వాత ఇంకో వాక్యం. ఆ తర్వాత ఇంకో వాక్యం. తర్వాత ఇంకోటి. ఆ తర్వాత ఆ "ఫ్లో" దానికదే అలా ముందుకు సాగిపోతుంది. నువ్వు రాయాలనుకున్నది రాస్తావు. బాగా రాస్తావు. అంతే కాదు, చాలా ఈజీగా కూడా రాయగలుగుతావు!"
అవును. నిజాలు రాయడానికి ఆలోచించే అవసరం ఉండదు. ఆ ఫ్లో అలా దానికదే వెళ్లిపోతుంది. ఒక ప్రవాహంలా.
ఈ హెమింగ్వే టెక్నిక్‌ను కేవలం రాయడం కోసమే కాదు. ఇంక దేనికయినా కూడా అప్లై చేయవచ్చు.
ఒక నిర్ణయం. ఒక భయం. ఒక సందిగ్ధం. ఏదయినా కావొచ్చు. "మనం ఆగిపోతున్నాం.. లేదా, ఎక్కడో ఏదో బ్రేక్ పడుతోంది" అనుకున్న సందర్భాల్లో, మనకి మనం, మనకు సంబంధించిన ఒక్క నిజం చెప్పుకోవాలి. లేదా, గుర్తు చేసుకోవాలి. తర్వాత ఇంకో నిజం. తర్వాత దానికే సంబంధించిన ఇంకో నిజం. ఇంకొకటి...
మబ్బులు చెదిరిపోతాయి. ఒక స్పష్టత వచ్చేస్తుంది. మనం ఎదుర్కొంటున్న సందిగ్ధత తొలగిపోతుంది. మనం దేని గురించయితే భయపడుతున్నామో అందులో అంత సీన్ లేదని తెల్సిపోతుంది. మనల్ని తెగ ఊగిసలాడిస్తున్న ఆ నిర్ణయం ఏదో ఠక్కున తీసేసుకుంటాం.
చివరగా ఒక నిజం -
ఇప్పటిదాకా మీరు చదివిన ఈ బ్లాగ్ పోస్ట్ హెమింగ్వే టెక్నిక్‌ని ఉపయోగించి రాసిందే!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani