Friday, 14 December 2012

ఒక నెల, 3699!

3699 ... నిజంగా ఈ అంకె నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. సరిగ్గా ఒక నెల క్రితం, నేను కొత్తగా ఈ "Toatal Page Views” సైట్ మీటర్ ని నా బ్లాగ్ కి తగిలించాను. ఇవాళ అంతా ఒకసారి రివ్యూ చేస్తున్నపుడు ఈ అంకె నాకెందుకో ఆకర్షణీయంగా కనిపించింది.   నా దృష్టిలో ఇది అంత పెద్ద అంకేమీ కాదు. కాని, కొంతవరకు "చెప్పుకోదగ్గ" అంకెనే!

నిజానికి ఈ బ్లాగ్ ని ప్రారంభించింది ఆగస్ట్ లో అయినప్పటికీ - అప్పుడు దీన్ని క్రియేట్ చేసిన ఉద్దేశ్యం వేరు. తర్వాత, రకరకాల ట్విస్ట్ ల అనంతరం - దీన్నే నా ప్రధానమయిన పర్సనల్ బ్లాగ్ గా చేసుకున్నాను. నాకు రాయాలనిపించిన ప్రతీదీ ఇందులో రాయటం ప్రారంభించాను. అలా డిసైడ్ అయ్యాకే ఈ సైట్ మీటర్ ని ఈ మధ్యే యాడ్ చేశాను.

నాకున్న రకరకాల రొటీన్ టెన్షన్లూ, వ్యాపకాలూ, స్వల్ప అనారోగ్యం మధ్య - ఈ నెల రోజుల్లో సుమారు ఒక డజన్ బ్లాగ్ పోస్టులు రాసి ఉంటాను. (మొత్తం 42, ఇవాల్టికి!) ఈ 12 పోస్టులకే ఒక నెలలో 3699 పేజ్ వ్యూస్ అంటే... రోజుకి సగటున ఓ 123 పేజ్ వ్యూస్ అన్నమాట! ఫరవాలేదు... 

నా కొత్త సినిమా ప్రాజెక్టుకోసం ఆఫీస్ ఓపెన్ చేశాక, నా ఈ బ్లాగింగ్ మరింత పుంజుకుంటుంది. మరింత అట్రాక్టివ్ గా కూడా ఉంటుంది. సినిమాలు, ఆర్టిస్టులు, స్క్రీన్ టెస్టులు, షూటింగులు, ఫ్రెండ్స్, ప్యాషన్స్, టెన్షన్స్, హిపోక్రసీలు, మాస్కులు, నిర్భయమైన నిజాలు... అన్నీ మీరు ఈ బ్లాగ్ లో చదువుతారు. 

అలా, ఇంకో ఆరు నెలల్లోనే ఈ బ్లాగ్ పైన 100,000 పేజ్ వ్యూస్ అంకెను చూడాలన్నది నా కోరిక...



No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani