ఈ
సంవత్సరం ప్రారంభంలో నాకు యాక్సిడెంట్ కాకుండా
ఉన్నట్టయితే, ఇప్పటికి నా కుటుంబంతో సహా
నేను వైజాగ్ లో ఉండేవాణ్ణి. యాక్సిడెంట్
వల్ల కొలాప్స్ అయిన ఎన్నో ముఖ్యమైన
విషయాల్లో ఇదీ ఒకటి.
అంతకు
ముందు నా ఇతర పనుల
కోసం - ఎక్కువగా పాండిచ్చేరి వెళ్లేవాణ్ణి. అక్కడ ఆరోవిల్ బీచ్,
ఇంకా కొన్ని ప్రైవేట్ బీచ్ లు నన్ను
బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, ఆరోవిల్ టౌన్ షిప్, సుమారు
40 దేశాల ఫారినర్స్ తో కూడిన అక్కడి
ఒక డిఫరెంట్ కల్చర్ నన్ను బాగా ఆకట్టుకుంది.
నిజానికి ఏమీ ఉండదు పెద్దగా
చెప్పుకోడానికి. కానీ, ఆరోవిల్ చుట్టుపక్కలా,
పాండిచ్చేరి టౌన్లోనూ, ఏదో ఒక ప్రత్యేకమైన
ఫీలింగ్. బహుశా, అదంతా - అరబిందో "ఆరా" అనుకుంటాను.
యూనివర్సిటీ నుంచి విహారయాత్రలకు వెళ్లినపుడు చూసిన బీచ్ ల్లో నాకు అప్పట్లో ఎక్కువగా నచ్చింది ఒరిస్సాలోని కోణార్క్ బీచ్. ఆ తర్వాత గోవాలోని కొన్ని బీచ్ లు కూడా బాగా నచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే - కార్వార్ లోని "లేడీస్ ఫింగర్" బీచ్ నన్ను ఆకట్టుకున్నంతగా ఇప్పటివరకూ ఏదీ ఆకట్టుకోలేదు. నా ‘ఆల్ ఇండియా రేడియో’ కొలీగ్, మిత్రుడు డిసౌజా చూపించాడా బీచ్. సముద్రపు అలల నిజమైన అందం అక్కడ చూసినంతగా నేను ఎక్కడా చూళ్లేదు. మారిషస్ లో కూడా!
బీచ్ లేని హైదరాబాద్ అంటే నాకంత ఇష్టం లేదు. వివిధ కారణాల వల్ల ఆ అయిష్టత ఈ మధ్య మరింతగా పెరిగిపోయింది. నెలలో కొద్ది రోజులు హైద్రాబాద్ లోను, కొద్ది రోజులు మరేదయినా బీచ్ ఉన్న ఊళ్లోనూ ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. బాగా ఆలోచించాక - వైజాగ్ కు ఫిక్స్ అయిపోయాను.

వైజాగ్
అనగానే నాకు భీమిలీ గుర్తుకొస్తుంది. 1926 ప్రాంతంలో చలం రాసిన అద్భుతమయిన
నవలలు, ఇతర సాహిత్యం గుర్తుకొస్తుంది.
నేను చూసిన భీమిలీ - చలం
తన రచనల్లో వర్ణించినంత గొప్పగా లేదు. ఇప్పుడు ఎలా
ఉందో నాకు తెలియదు. కానీ,
నా ఊహల్లో మాత్రం, చలం వర్ణించిన ఆ
భీమిలీనే ఇంకా ఉంది. ఎప్పుడూ
ఉంటుంది.
ఒక
రెండు నెలల తర్వాత నుంచీ - నా సినిమాల పని మీదో, ఫిలిం స్కూల్ పని మీదో - ప్రతి నెలా నేను వైజాగ్
వెళ్లినప్పుడల్లా, చలం అద్భుత సృజనకి
స్పూర్తినిచ్చిన ఆ భీమిలీని మళ్లీ మళ్లీ చూడబోతున్నానంటే .. అసలు ఆ
ఫీలింగే ఎంతో బాగుంది.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani