సినీ
ఫీల్డులో ఇప్పుడు ఏదీ సీక్రెట్ కాదు.
అది ప్రొడక్షన్ కావొచ్చు, బిసినెస్ కావొచ్చు, ఫీల్డుకు సంబంధించింది ఇంకేదయినా కావొచ్చు.
ఇదివరకులాగా కాకుండా - ఇప్పుడు ప్రతీదీ, సంపూర్ణ సమాచారంతో, అందరికీ అందుబాటులో ఉంది.
గుడ్డిగా ఎవరినో నమ్మి మోసపోవాల్సిన అవసరం ఇప్పుడు ఎవ్వరికీ లేదు. బడ్జెట్ లో కూడా ఎక్కడ ఎవరెవరు ఎంత నొక్కేస్తున్నారన్నది కూడా అతి సులభంగా కనుక్కోవచ్చు. అయితే, మనం ఎంత జాగ్రత్త పడ్డా, తినటమే వృత్తి అయిన కొన్ని ప్రాణులుంటాయి. ఆ ప్రాణుల్ని యూనియన్ రూల్స్ ప్రకారం తీసుకోక తప్పదు. వీళ్ల విషయంలో మనం చేయగలిగింది ఒక్కటే - ఏ ప్రాణి తక్కువ తింటుందో స్టడీ చేసి, కొంచెం తక్కువ తినే ప్రాణిని తీసుకోవాలి.
ఈ మాత్రం దానికి - "ఇండస్ట్రీలో మేం ఇన్నాళ్లు ఉన్నాం, ఇది పొడుస్తాం, అది పొడుస్తాం.." అని చెప్పే కథల్ని విని మోసపోవాల్సిన అవసరం ఇప్పుడు అసలు లేదు.

నా
తొలి మూడు సినిమాల విషయం
లోనూ ఇదే జరిగింది. నా
మొదటి సినిమాలో నేనే ఎంతో మందిని
ఇంట్రొడ్యూస్ చేశాను. ఎంతోమంది టెక్నీషియన్స్ కి వారి జీవితం
లో అప్పటి వరకు వారు తీసుకోని
పారితోషికాన్నీ, అందుకోని గౌరవాన్నీ అందించాను. తర్వాతి రెండు సినిమాల విషయంలో
గాలి బుడగల్లాంటి బూటకపు హామీలను నమ్మి కొందరి వల్ల దారుణంగా మోసపోయాను.
అవతలి వాళ్ల టార్గెట్స్ వేరే
ఉంటాయి అన్న నిజం చాలా
ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇలాంటి వారివల్ల నేను నష్టపోయిన డబ్బు
గురించి నాకు అంత బాధ
లేదు. కానీ - నమ్మకానికి, మాటకు విలువ ఇవ్వని
ఇలాంటి వ్యక్తులతో సహచర్యం చేసి,
ఎంతో విలువయిన నా సమయాన్ని నష్టపోయానన్నదే
నా బాధ.
ఫినిషింగ్ టచ్ ఏంటంటే -
ఫినిషింగ్ టచ్ ఏంటంటే -
ఇలాంటి
పేరసైట్స్ అంతా ఒక ప్రచారం
చేస్తుంటారు. వాళ్లేదో నాకు సహాయం చేస్తే
నేనేదో అయిపోయినట్టు! నిజానికి నాకు యెవ్వరూ ఎలాంటి
సహాయం చెయ్యలేదు. నేను లేకపోతే అసలు
ఈ మూడు సినిమాలూ లేవు.
నేను ముందుండి రిస్క్ తీసుకొని ప్రారంభిస్తేనే ఈ మూడు సినిమాలు ప్రారంభమయ్యాయి.
నా వల్లనే వీళ్లంతా వివిధ స్థాయిల్లో లాభపడ్డారు.
కొందరు ఇండస్ట్రీలో నిలబడ్డారు. అసలు నేనే అవకాశం ఇవ్వకపోతే
- వీరిలో చాలామంది పరిస్థితి ఇప్పటికీ క్రిష్ణా నగర్ రోడ్లు, గణపతి
కాంప్లెక్స్ గల్లీలే అన్న నిజం వాళ్ల అంతరాత్మలకి తెలుసు.
నీటి బుడగల్లాంటి వీరి హామీలను, ప్రామిస్ లను నమ్మటం ద్వారా నాకు జరిగిన నష్టం నుంచి కోలుకోవటం కోసం - ప్లస్ - ఇలాంటి వాళ్ల పుణ్యమా అని, నేను కోల్పోయిన నా క్రియేటివ్ ఫ్రీడం ని వెనక్కి తెచ్చుకోవటం కోసం ... ఈ రెండు కారణాలతోనే, ఇప్పుడు మళ్లీ నేను సినిమాలు చేయటం తప్ప, నిజానికి నాకా అవసరం లేదు. ఇప్పుడింక నాకు ఎక్కడా ఎలాంటి కాంప్రమైజ్ అవసరం లేదు. ఇలాంటి ఆషాఢభూతుల అవసరం అసలు లేదు.
చివరిగా నాకు నేను చెప్పుకొనేదేంటంటే - తప్పు నాది, (ఇలాంటి వాళ్లని నమ్మి) నేను తీసుకొన్న నా నిర్ణయాలది.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani