Sunday, 18 November 2012

సినిమా స్క్రిప్ట్ రాయడం ఎలా?


ఈ మధ్య నేను చాలా సార్లు ఆన్ లైన్ లో కొత్త స్క్రిప్ట్ రైటర్స్ కోసం యాడ్స్ పెట్టాను...

కొత్త రచయితల దగ్గర కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది కదా .. వాటిల్లో నిజంగా ఏదయినా చాలా బాగా వర్కవుట్ అవుతుందనుకునే లైన్ ఏదయినా దొరికితే, ప్రస్తుతం నేను ప్లాన్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ కోసం తీసుకుందామన్నది నా ఆలోచన.

అలాగే, ఒక కొత్త రైటర్ కు అవకాశమిచ్చి పరిచయం చేసినట్టు కూడా ఉంటుందని నా ఉద్దేశ్యం. కనీసం ఒక నలుగురు అయినా నాకు అవసరమయిన రేంజ్ లో దొరుకుతారనుకున్నాను.

బాధాకరమయిన విషయమేంటంటే - కనీసం ఒక్కరు కూడా దొరకలేదు.

నా యాడ్ చూసి - సుమారు ఒక పదిమంది వరకు సింపుల్ గా ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ చదవటం తోనే వాళ్లకు స్క్రిప్ట్ రైటింగ్ గురించి తెలియదు అనేది అర్థమైపోతుంది.

నోటితో ఏదో కథ చెప్పటం వేరు.. సినిమా స్క్రిప్ట్ రాయటం వేరు అన్న విషయం చాలా మంది రచయితలకు ఇంకా తెలియదంటే  కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది.

ఇక, ఆల్ రెడీ ఇండస్ట్రీ తో పరిచయం ఉన్న పాతవాళ్లు మాత్రం ఓ ఇద్దరు కాంటాక్ట్ లోకి వచ్చారు. వాళ్లల్లో ఒక రచయిత 'అసలు మీకు ఏం కావాలి?" అని అడిగాడు!

ఏం చెప్పాలి??

"ఓ పది లక్షలు కావాలి" అన్నాను. తన కొశ్చన్ కీ, నా జవాబుకీ సింక్ అవక ఫోన్ పెట్టేశాడా రచయిత.

2 comments:

  1. సర్ మీకు కొత్త రచయితలు వారి కథలు అవసరం,నాకు తెలుగు సినీపరిశ్రమలోకి ప్రవేశించడం అవసరం.
    నాకొచ్చే ఐడియాలతో సినిమా కథలు రాయాలనే పిచ్చి కాని నాకు కథ రాసే విధానం నిజంగా తెలియదు.
    చాలా సంవత్సరాలుగా ఇంటర్నెట్ లో వెతుకుతూ వెతుకుతూ ప్రస్తుతం 'సినిమా రచన ఎలా చేయాలి'? అనే ప్రాథమిక అంశాలు నేర్చుకోగలిగాను.

    మీరు నాకొక అవకాశం ఇస్తే నన్ను నేను రుజువు చేసుకుంటాను.

    ఈమధ్యే వచ్చిన మహానటిలో ఓ డైలాగ్
    'ప్రతిభ ఇంటిపట్టునే వుంటే ప్రపంచానికి పుట్టగతులుండవు'

    అవును నేను ఇంటిపట్టునే వుంటే మన తెలుగు సినిమా నన్ను చూసే అవకాశం కోల్పోతుంది.

    ReplyDelete

Thanks for your time!
- Manohar Chimmani