సినీ
ఫీల్డుకు సంబంధించి ఈ మధ్య రెండు
ఆసక్తికరమైన వార్తలు చదివాను, చూశాను. ఈ రెండు వార్తలూ
ఫీల్డులో హైరేంజ్ లో ఉన్న దర్శక
నిర్మాతలకు సంబంధించింది కావటం మరింత ఆసక్తికరం.
ఇలాంటి వార్తలు, ఇంత ఓపెన్ గా
బయటికి రావటం ఫీల్డులో బహుశా
ఇదే మొదటిసారి. వార్తలే అనుకుంటే, ఆ వార్తల్లోని అంకెలు
కూడా కొంచెం ఎక్స్ ట్రార్డినరీ గానే
ఉన్నాయి.
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి సంబంధించి నిర్మాత నుంచి తనకు ఇంకా 4.5 కోట్లు రెమ్యూనరేషన్ రావాలంటూ ఆ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ యూనియన్లో ఫిర్యాదు చేశాడు. రావల్సిన బ్యాలెన్సే నాలుగున్నర కోట్లు అంటే, మరి పూరి మొత్తం రెమ్యూనరేషన్ ఎంతయి ఉంటుంది? ఇది కనీసం కోటి రూపాయల ప్రశ్న!
మరోవైపు, దర్శకుడు పూరి బడ్జెట్ ను బాగా పెంచేశాడనీ, అందువల్ల హీరోతో పాటు దర్శకుడు కూడా ఈ విషయంలో సర్దుకోక తప్పదని ఆ చిత్ర నిర్మాత అంటున్నాడు. చానెల్స్ లో, పత్రికల్లో ఈ వార్త ఇలా నలుగుతుండగానే, ఆ దర్శక నిర్మాతలిద్దరూ కల్సి సం యుక్తంగా ప్రెస్స్ మీట్ లో కూర్చుని తమ చిత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించటం విశేషం. బహుశా ఇష్యూ సెటిల్ అయిపోయి ఉంటుంది.
ఇదిలా ఉంటే - మరోవైపు, వర్సటైల్ జీనియస్ రాఘవేంద్ర లారెన్స్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ‘రెబెల్’ చిత్రం కూల్ గా నడుస్తోంది. కాకపోతే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పూరి జగన్నాథ్ నిర్మాత మీద కంప్లయింట్ ఇస్తే, రెబెల్ నిర్మాత ఆ చిత్ర దర్శకుడు లారెన్స్ మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కంప్లయింట్ ఇచ్చాడు. మొత్తం 22.5 కోట్లలోనే చిత్రం పూర్తి చేస్తానని చెప్పిన లారెన్స్ బడ్జెట్ ని 40 కోట్లకు పెంచేశాడని ఆ నిర్మాత గోల!
దీనికి రిటార్ట్ గా, ప్రొడ్యూసర్ తనకు చెప్పకుండా డబ్బింగ్, రీమేక్ రైట్స్ అమ్ముకున్నాడని లారెన్స్ ఎదురు కంప్లయింట్ ఇచ్చ్చాడు నిర్మాత మీద. ముందే అనుకున్న ఒప్పందం ప్రకారం డబ్బింగ్ రైట్స్ నిర్మాత లారెన్స్ కు ఇవ్వాలట! అదీ విషయం. ఈ వివాదం ఇంకా పరిష్కారం అయినట్టులేదు.
పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా - ఏదో ఒక విషయంలో, ఏదో ఒక రూపంలో గొడవలూ సమస్యలూ సినీ ఫీల్డులో సర్వ సాధారణం అనీ, అవి లేకుండా ఏ సినిమా పూర్తి కాదనీ తాజాగా ఈ రెండు వార్తల ద్వారా కూడా మనం గమనించవచ్చు.
పై వార్తలతో ఎలాంటి సంబంధం లేని ఒక జ్ఞాపకం ఏంటంటే - లారెన్స్ మంచి స్నేహశీలి. రాజా హీరో గా నా తొలి చిత్రం 'కల’ లో వేటూరి సుందర రామ మూర్తి గారు రాసిన ‘తకిట తకిట ధిమిరే’ అనే ఒక పాటలో రెమ్యూనరేషన్ ఏమీ తీసుకోకుండా స్పెషల్ అపియరెన్స్ ఇచ్చి, తన డాన్స్ తో ఆ పాటను ఒక ఊపు ఊపాడు లారెన్స్.
పద్మాలయ స్టూడియోలో షూటింగ్ జరిగిన ఆ రాత్రి నాకు ఇప్పటికీ గుర్తుంది ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani