ప్రముఖ
ఫ్రీలాన్స్ రైటర్ శోభా డే
రాసిన రచనలన్నీ చదివాన్నేను. కాని, చలం పుస్తకాల్లా
చాలా మందికి ఆమె రాతలు అసలు
నచ్చవు. అది వేరే విషయం.
శోభాడే
సాహిత్యం పాశ్చాత్య దేశాల్లోని కొన్ని యూనివర్సిటీల్లో పాఠ్యాంశాలుగా చేర్చబడ్డాయి. ఎందరో విదేశీ విశ్వవిద్యాలయాల
విద్యార్థులు ఆమె రచనల మీద
రిసెర్చ్ చేశారు. అయినా మన వాళ్లకి ఆమె రచనలు నచ్చవు. ఎందుకో
వాళ్లకే తెలియాలి!
పత్రికల్లో నిర్మొహమాటంగా శోభా డే రాసే 'కాలమ్' లన్నా, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా తను రాయాలనుకున్నది రాసే తన బ్లాగ్ అన్నా నాకు మరీ ఇష్టం. భౌతికంగా ఆమె వయసు అరవై దాటింది. అస్సలు అలా కనిపించదు. జీవితం పట్ల, జీవన శైలి పట్ల మమకారం ఉన్నవారెవరూ అంత తొందరగా వృధ్ధులు కాలేరని చెప్పడానికి శోభా డే నే మంచి ఉదాహరణ.
అయినా ఇక్కడ ఆమె వయసుని చర్చించడం, గ్లామర్ని చర్చించడం నా ఉద్దేశ్యం కాదు. అరవై దాటినా ఆమె రచనలు, అలోచనలు ఇంకా నవ యవ్వనంగా, ఫేసినేటింగ్ గా ఉంటాయన్న నిజాన్ని చెప్పటమే నా ఉద్దేశ్యం.

శోభా
డే రాసిన ఫిక్షన్ అంతా
ఒక ఎత్తు అయితే, నన్ను
అమితంగా ప్రభావితం చేసిన ఆమె జీవిత
చరిత్ర "సెలెక్టివ్ మెమొరీ" ఒక్కటే ఒక ఎత్తు. అసలా
టైటిల్ చూడండి.. సెలెక్టివ్ మెమొరీ! తన జీవితంలోని ఎన్నెన్నో
జ్ఞాపకాల్లో కొన్నిటిని మాత్రమే ఆమె ఎన్నిక చేసుకొంది.
వాటినే తన పాఠకులతో షేర్
చేసుకోవాలనుకొంది. వాటినే ఒక అందమైన ప్యాక్
లో అందించింది. వెరీ ఇన్స్ పైరింగ్
బుక్.
నేను ‘సెలెక్టివ్ మెమొరీ’ ని బహుశా పదేళ్ల క్రితం చదివి ఉంటాను. ఈ పదేళ్లలొ కనీసం ఒక నాలుగు అయిదు సార్లయినా మళ్లీ తిరగేసి ఉంటాను. పెంగ్విన్ పబ్లిష్ చేసిన ఈ పుస్తకాన్ని ఇవాళ మళ్లీ ఒకసారి అలా అలా తిరగేశాను…
ఒక దశాబ్ద కాలం .. అందులోనూ జీవితంలోని అత్యంత కీలకమైన దశలో.. ఎన్నో ఢక్కా మొక్కీలు తిన్నాను. ఈ దశాబ్ద కాలంలో నేను కలలో కూడా ఊహించని, ఆశించని తీయటి అనుభూతులున్నాయి. అత్యంత చేదు అనుభవాలున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో - ఇవాళ నేను మళ్లీ తిరగేసిన శోభా డే పుస్తకం ‘సెలెక్టివ్ మెమొరీ’ నాకు మరింత ఆనందాన్నిచ్చింది.

నేను
కోల్పోయిందేమిటో నాకు తెలిపింది. ఇప్పుడిప్పుడే
నేను అలవర్చుకుంటున్న ఈ స్థితప్రజ్ఞత నాకెంత అవసరమో చెప్పింది. ఎప్పుడయినా గానీ, నేను “నేను"
గానే కరెక్టు అని ధైర్యం చెబుతూ
నా భుజం తట్టింది.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani