రియల్ ఎస్టేట్ కంపెనీలో యం డి పొజిషన్ కంటిన్యూ అయింది. ఫ్రీలాన్సర్‌గా, ఘోస్ట్ రైటర్‌గా బాగానే రాశాను. బాగానే సంపాదించాను.
కట్ చేస్తే -
కొవ్వు ఎక్కువై, ఒకరిద్దరి మాటల మీద గుడ్డి నమ్మకంతో మరోసారి సినిమాలవైపు ఇంకో అడుగు వేశాను, ఎప్పట్లాగే.
అందరూ హాండిచ్చారు. ఎప్పట్లాగే నన్ను పీకల్లోతుకి దింపి, చేతులెత్తేశారు. తప్పుకున్నారు. ఇలాంటి అనుభవాలు నాకు ఇంతకుముందే కొన్ని ఉన్నా, మళ్ళీ అదే నమ్మకం, అవే చెత్త నిర్ణయాలు, మళ్ళీ అవే ముగింపులు.
అయినాసరే, నేనిప్పుడు ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు నాకు పూర్తి ఫ్రీడం ఉంది. నా టీమ్‌లో నేను పూర్తిగా నమ్మకం పెట్టుకోగలిగిన ఒకరిద్దరున్నారు. ఇంకొకరిద్దరు మంచి ఇన్వెస్టర్లను నేనే క్రియేట్ చేసుకున్నాను.
కట్ చేస్తే -
మొన్న అక్టోబర్ 28 నాడు డైరెక్టర్‌గా నా కొత్త సినిమా (Yo!: 10 ప్రేమకథలు) జూబ్లీ హిల్స్ దస్పల్లా హోటల్లో ప్రారంభించాను.
దాని ప్రి-ప్రొడక్షన్ బిజీలోనే, మొన్న డిసెంబర్ 28 నాడు నా రెండో కొత్త సినిమా (ఎర్ర గులాబి) ప్రారంభించాను.
జనవరి 28 నుంచి షూటింగ్ ప్రారంభించభిస్తున్నాం.
చూస్తుంటే, ఈ 28వ తేదీ ఏదో మంచి సెంటిమెంట్ అయ్యేలా ఉంది నాకు!
దాని ప్రి-ప్రొడక్షన్ బిజీలోనే, మొన్న డిసెంబర్ 28 నాడు నా రెండో కొత్త సినిమా (ఎర్ర గులాబి) ప్రారంభించాను.
జనవరి 28 నుంచి షూటింగ్ ప్రారంభించభిస్తున్నాం.
చూస్తుంటే, ఈ 28వ తేదీ ఏదో మంచి సెంటిమెంట్ అయ్యేలా ఉంది నాకు!
మరోవైపు, నా 'తొలి ప్రేయసి' రచనా వ్యాసంగాన్ని, నా ఇంకో ప్యాషన్ పెయింటింగ్‌ను కూడా 2024లోనే తిరిగి ప్రారంభించాను... ఈసారి చాలా సీరియస్‌గా, ఖచ్చితమైన లక్ష్యాలతో.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani