Thursday, 19 December 2024

మళ్ళీ సినిమా మూడ్ లోకి...


ఇవ్వాళ ఉదయం 5.48 కే, 
ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగ్ నుంచి కాల్. 

"పది నిమిషాలో నేను బయల్దేరుతున్నా సర్" అంటూ. 

కట్ చేస్తే -

ఇలాంటిది జరిగి దాదాపు ఒక దశాబ్దం అయింది. పూర్తిగా సినిమా మూడ్‌లోకి వచ్చేశాం. ఒక వారంలోపే వర్క్ షాప్, షూటింగ్ ప్రారంభమవుతున్నాయి. 

టీమ్‌లో ముఖ్యమైనవాళ్లమంతా కలిసి లొకేషన్ స్కౌటింగ్‌కి బయలేదేరాం. 

ఒక పెద్ద గ్యాప్ తర్వాత, కొత్తగా నా మొదటి సినిమా. 

సస్పెన్స్ థ్రిల్లర్-రోడ్ డ్రామా. 

రెడ్ రోజ్. 

ఎర్రగులాబి.

- మనోహర్ చిమ్మని   

Thursday, 5 December 2024

2024లో నేనేం సాధించాను?


రియల్ ఎస్టేట్ కంపెనీలో యం డి పొజిషన్ కంటిన్యూ అయింది. ఫ్రీలాన్సర్‌గా, ఘోస్ట్ రైటర్‌గా బాగానే రాశాను. బాగానే సంపాదించాను.  

కట్ చేస్తే - 

కొవ్వు ఎక్కువై, ఒకరిద్దరి మాటల మీద గుడ్డి నమ్మకంతో మరోసారి సినిమాలవైపు ఇంకో అడుగు వేశాను, ఎప్పట్లాగే. 

అందరూ హాండిచ్చారు. ఎప్పట్లాగే నన్ను పీకల్లోతుకి దింపి, చేతులెత్తేశారు. తప్పుకున్నారు. ఇలాంటి అనుభవాలు నాకు ఇంతకుముందే కొన్ని ఉన్నా, మళ్ళీ అదే నమ్మకం, అవే చెత్త నిర్ణయాలు, మళ్ళీ అవే ముగింపులు. 

అయినాసరే, నేనిప్పుడు ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు నాకు పూర్తి ఫ్రీడం ఉంది. నా టీమ్‌లో నేను పూర్తిగా నమ్మకం పెట్టుకోగలిగిన ఒకరిద్దరున్నారు. ఇంకొకరిద్దరు మంచి ఇన్వెస్టర్లను నేనే క్రియేట్ చేసుకున్నాను. 

కట్ చేస్తే - 

మొన్న అక్టోబర్ 28 నాడు డైరెక్టర్‌గా నా కొత్త సినిమా (Yo!: 10 ప్రేమకథలు) జూబ్లీ హిల్స్ దస్పల్లా హోటల్లో ప్రారంభించాను.

దాని ప్రి-ప్రొడక్షన్ బిజీలోనే, మొన్న డిసెంబర్ 28 నాడు నా రెండో కొత్త సినిమా (ఎర్ర గులాబి) ప్రారంభించాను.

జనవరి 28 నుంచి షూటింగ్ ప్రారంభించభిస్తున్నాం.  

చూస్తుంటే, ఈ 28వ తేదీ ఏదో మంచి సెంటిమెంట్ అయ్యేలా ఉంది నాకు!   

మరోవైపు, నా 'తొలి ప్రేయసి' రచనా వ్యాసంగాన్ని, నా ఇంకో ప్యాషన్ పెయింటింగ్‌ను కూడా 2024లోనే తిరిగి ప్రారంభించాను... ఈసారి చాలా సీరియస్‌గా, ఖచ్చితమైన లక్ష్యాలతో. 

- మనోహర్ చిమ్మని               

2024 మీకేమిచ్చింది?


ఇలా కూడా అనుకోవచ్చు... 2024కు మీరేమిచ్చారు?
 
కట్ చేస్తే -

ఇంకో 26 రోజుల్లో 2024 ముగుస్తోంది. మళ్ళీ న్యూ ఇయర్, న్యూ రిజొల్యూషన్స్ వగైరా మామూలే. 

అయితే - ఆ రొటీన్ హడావిడి కంటే ముందు ఒక్క 20 నిమిషాల సమయం తీసుకొని - ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఒక చోట కూర్చొని - మొబైల్ స్విచ్చాఫ్ చేసి - మనకి మనం ఒక చిన్న రివ్యూ చేసుకోవచ్చు.  

నిజంగా పెన్నూ, పేపర్ పట్టుకొని కూర్చుంటే 10 నిమిషాలైనా సరిపోతుంది.  
2024లో, ఈ రోజువరకు, (1) పర్సనల్‌గా - (2) ప్రొఫెషనల్‌గా - (3) సోషల్‌గా... మనం ఏం సాధించాం? 

అవి భారీ విజయాలే కానక్కర లేదు. మనకు సంతోషాన్నిచ్చే ఏ చిన్న అంశమైనా కూడా కావచ్చు. 

మన జీవితంలోని ఈ మూడు ముఖ్యమైన విభాగాల్లో - మనం గుర్తుపెట్టుకొనే స్థాయి వున్న, మనకు ఆనందాన్నిచ్చిన, మన పర్సనల్ గ్రోత్‌కి ఉపయోగపడిన విజయం... కనీసం ఒక్కొక్కటి వున్నా ఫరవాలేదు. 

ఖచ్చితంగా వుంటాయి. 

అలాగే ఏవైనా బాధాకరమైన అంశాలు కూడా ఉండొచ్చు. వాటి గురించి కూడా రివ్యూ చేసుకోవడం అవసరం.

ఈ రివ్యూ ఉంటే రేపు 2025 ఆటొమాటిగ్గా బ్రహ్మాండంగా వుంటుంది. 
చలో, టైమర్ సెట్ చేసుకొని, మొబైల్ స్విచ్చాఫ్ చెయ్యండి... జస్ట్ 20 నిమిషాలు.  

ఆల్ ది బెస్ట్!   

- మనోహర్ చిమ్మని 

Tuesday, 3 December 2024

Casting Call: New LEAD ACTRESS Needed for an Exciting Crime Thriller!


Are you a 'stunningly classic-looking actress', ready to shine as the 'solo lead heroine' in a groundbreaking feature film?  

About the Role:  
We’re seeking a FEMALE LEAD for a 'character-driven, inspiring story':  
- Highly educated and ambitious, with big career aspirations.  
- A positive thinker, eager to take on challenges.  
- A role model who inspires fellow-youth to achieve their dreams.  
- A brave individual who confronts an 'unbelievably big problem', overcomes it, and triumphantly reaches her goal.  

About the Film: 
- Genre: Crime Thriller  
- Style: Mainstream Commercial Film  
- Director: From a Nandi Award-Winning Writer & Filmmaker  
- Production: Independent, crowdfunded full-length feature designed to create nationwide buzz.  

Requirements:  
- 21-28 age, dynamic acting talents, and must know car & bike driving. 
- Call Sheets: 20-25 days of shooting, includes 2 songs.   

This is your chance to be part of a bold, inspiring, and high-impact project that will make waves across the country!  

Apply Now: Share your portfolio, headshots, and past work with us at email: mchimmani10x@gmail.com; WhatsApp: 9963866298. 

Take the leap and become the face of an unforgettable cinematic journey!