సినిమా పనుల్లో, సొంత పనుల్లో - ఒక కాన్సెప్ట్‌తో - ముందుకెళ్తున్నాను. సుమారు ఒక 90 రోజుల తర్వాత, నవంబర్ చివరలో మళ్ళీ ఇక్కడ కలుస్తాను. అప్పటిదాకా పెద్దగా ఇటువైపు రాకపోవచ్చు.
బ్లాగింగ్ వదిలెయ్యలేను. చిన్న గ్యాప్ అంతే.
కట్ చేస్తే -
నిన్న మా ఆఫీసులో ప్రదీప్, నేను కలిసి చాలా విషయాలు చర్చించుకున్నాం. వాటిలో నాకు బాగా నచ్చిన టాపిక్ - వాట్సాప్‌ను వదిలెయ్యడం! అవసరమైతే ఈమెయిల్ ఉండనే ఉంది. ఈమెయిల్లో ప్రతి కంటెంట్ భద్రంగా ఉంటుంది. సెర్చ్ చెయ్యడం కూడా ఈజీ.
ఇంకొకటి - నా ఫేవరేట్ నోకియా 3360 కొనుక్కొని తిరిగి ఆ డిస్ట్రాక్షన్ లేని రోజుల్లోకి వెళ్ళిపోవడం!
ఈ స్మార్ట్ ఫోన్స్ చేసే పనులన్నిటి కోసం మనకు ల్యాప్‌టాప్స్ ఎలాగూ ఉన్నాయి.
ఇలాంటివి ఇంక చాలా ఉన్నాయి... మన జీవితాల్ని మనం ఎంజాయ్ చెయ్యకుండా, మంచి జ్ఞాపకాలను మిగుల్చుకోకుండా మింగేస్తున్నవి...
Catch you later.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani