Saturday, 16 October 2021

మార్కెటింగ్ లైఫ్!

మొన్న సెప్టెంబర్ 29 నుంచీ నా ప్రొఫెషనల్ మార్కెటింగ్ యాక్టివిటీని చాలా అగ్రెసివ్‌గా ముందుకు తీసుకెళ్తున్నాను.

మొట్టమొదటిసారిగా, ఒక మల్టి ప్యాషనేట్ క్రియేటివ్‌ప్రెన్యూర్‌గా... నా సర్విసెస్, నా రిక్వయిర్‌మెంట్స్...  ఒకదాని వెనుక ఇంకోటి అన్నీ నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను. 

నా ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగ్, నా 'ఫిలింనగర్ డైరీస్' పాడ్‌కాస్ట్... అన్నీ ఇప్పుడు... అయితే సినిమా, లేదంటే క్రియేటివిటీకి సంబంధించిన కంటెంట్ తో నిండిపోతున్నాయి.

నా మొత్తం క్రియేటివిటీ యాక్టివిటీకి "మార్కెటింగ్ స్పేస్"గా మారిపోతున్నాయి.    

ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా - ఖచ్చితమైన టైమ్‌బౌండ్ టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి అసలు బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. 

నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న కవులు, రచయితలు, ఇతర మేధావి మిత్రులు, సీనియర్స్... ఈ స్టఫ్ అంతా చూసి ఇబ్బంది పడే అవకాశం చాలావుంది. సరదాగా ఎంజాయ్ చేయండి. లేదా, హాయిగా నన్ను "అన్‌ఫాలో" చేసెయ్యండి! 😊

ఏదో ఒక సినిమా ప్రాజెక్టు అని కాకుండా, నా అన్ని క్రియేటివ్ వింగ్స్‌లోనూ చేతినిండా పనితో చాలా చాలా బిజీ అయిపోవాలన్నది సంకల్పం. ఆ బిజీ ఈ దసరా నుంచే పుంజుకోవాలనీ, ఊపిరి సలపనివ్వని వర్క్‌లోడ్‌తో పనిచేస్తూ, ఈ సంవత్సరం ఆఖరుకల్లా కొన్ని విషయాల్లో నేను పూర్తిగా 'ఫ్రీ అయిపోవాలని' కూడా గట్టిగా అనుకున్నాను.

ఆ దిశలో నా పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా స్పీడప్ చేస్తున్నాను.  

పని చేస్తూవుంటేనే అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి. 'అనుకోకుండా జరుగుతాయని మనం అనుకొనే  మిరాకిల్స్' కూడా మనం పని చేస్తూవుంటేనే జరుగుతాయని నా నమ్మకం, నా అనుభవం. 

అదృష్టం ఎక్కడో ఆకాశం నుంచో, మన తారల నుంచో జారిపడదు. మనం ఎంత కష్టపడితే అంతగా మనల్ని ఇష్టపడుతుంది, మన వెంటపడి వస్తుంది. ఇలాంటి అదృష్టాన్ని మాత్రం నేను బాగా నమ్ముతాను. ఎంత కష్టమైనా పడతాను. 

ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు. అందరికీ నా వినమ్ర వందనం. 🙏

Peace, Progress and Prosperity to All of Us...   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani