ఒకప్పుడు... ఏదో ఒకటిరెండు పనులు సీరియస్‌గా చేస్తుంటే "ఇంక టైమ్ లేదు, సరిపోదు, పిచ్చి బిజీ" అని అనిపించేది.
ఇప్పుడు అంతకంటే సీరియస్‌గా... ఒక్కసారే అరడజన్‌కు పైగా పనుల్ని రెగ్యులర్‌గా, ఎలాంటి పొరపాటు లేకుండా, పంక్చువల్‌గా చేస్తున్నాను. వీటితోపాటు, ఇంకో 2 ముఖ్యమైన పనుల్ని రేపటినుంచీ చేపట్టబోతున్నాను.
అయినా సరే - టైమ్‌కు సంబంధించి ఎలాంటి టెన్షన్ లేదు.
ఫుల్ ప్యాక్‌డ్‌గా, టైమ్‌బౌండ్ టార్గెట్‌తో రకరకాల ఫ్రీలాన్స్ పనుల్లో మునిగి ఉన్న ఇలాంటి సమయంలోనే - నాకు అతిదగ్గరి బంధువులబ్బాయి పెళ్ళికి సంబంధించిన ఒక బాధ్యతను కూడా ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ఈమధ్యే.
మామూలు పరిస్థితుల్లో అయితే పెళ్ళికి సంబంధిన ఏ చిన్న పని అయినా "నో" అని తప్పించుకొనేవాణ్ణి. కాని ఇప్పుడలా కాదు. నా అవసరం అక్కడుంది. నేను మాత్రమే సరైన విధంగా పనిపూర్తి చేయగలను అని నాకు తెలుసు. అలాంటప్పుడు, ఇప్పటి నా నేపథ్యాన్ని సాకుగా పెట్టుకొని, తప్పించుకోలేకపోయాను.
కట్ చేస్తే -
ఇలాంటి విషయాల్లో - నేను ఎప్పుడూ మాట్లాడని విధంగా, నిర్మొహమాటంగా, కాన్‌ఫిడెంట్‌గా, కళ్లల్లోకి చూస్తూ - నా ఉద్దేశ్యాన్ని, నా ఆలోచనల్ని నాకిప్పటివరకూ అసలు పరిచయంలేనివాళ్లతో కూడా చెప్పగలుగుతున్నాను.
నిజానికి, ఇలాంటి పెళ్ళి టాపిక్స్ నాకు తెలిసి ఇంతకుముందు నేనెప్పుడూ మాట్లాళ్లేదు... నా పెళ్ళి విషయంలో కూడా.
నిజానికి, ఇలాంటి పెళ్ళి టాపిక్స్ నాకు తెలిసి ఇంతకుముందు నేనెప్పుడూ మాట్లాళ్లేదు... నా పెళ్ళి విషయంలో కూడా.
పెళ్ళి అనేది ఒక పెద్ద రిస్కీ గేమ్!
దాన్ని అంత ఈజీగా తీసుకొని, అప్పటికప్పుడు ఏవో నిర్ణయాలు తీసుకోవడం కరెక్టు కాదు. తర్వాత జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది.
నా తర్వాతి జనరేషన్‌లో, నాకు తెలిసిన ఎవ్వరి జీవితంలో అయినా - పెళ్ళి విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరగొద్దు. ఎవ్వరూ బాధపడొద్దు.

అదే నా తపన. అందుకే ఎన్నడూ లేని ఈ చొరవ.
అందుకే ఎన్నడూలేని విధంగా - ఇలా నేను ఈ పెళ్ళి బాధ్యత నా భుజాలమీదకెత్తుకోవడం...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani