ఈ ఘర్షణ లేకుండా, ఇప్పటివరకు ఒక్క బ్లాగ్ కూడా పోస్ట్ చేయలేదట - నా ఫేవరేట్ బ్లాగర్స్‌లో ఒకరు, James Altucher!
జేమ్స్ ఒక బెస్ట్ సెల్లర్ రైటర్. దాదాపు డజన్ బుక్స్ రాశాడు. భారీ ఫినాన్షియల్ ఎక్స్‌పర్ట్ కూడా. పొద్దున లేస్తే మిలియన్లు, బిలియన్లు ఇన్వెస్ట్ చేసేవాళ్లతోనే అతని పని. స్వయంగా జేమ్స్ కూడా ఒక పెద్ద సీరియల్ ఎంట్రప్రెన్యూర్.
కట్ చేస్తే -
మిషన్ అంటే దానికొక ఖచ్చితమైన టార్గెట్ ఉంటుంది. దాన్ని పూర్తిచెయ్యడానికో డెడ్‌లైన్ ఉంటుంది. ప్రస్తుతం నేనూ అలాంటి ఒక వెరీ సీరియస్ షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను.
అందులో భాగంగా - ఇకనుంచీ నా బ్లాగ్‌లో, సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసే 'స్టఫ్' అంతా సినిమాలు, ఫ్రీలాన్స్ రైటింగ్, కోచింగ్, కన్సల్టింగ్, క్రియేటివిటీకి సంబంధించిన అంశాలపైనే ఉంటుంది.
కొన్ని పోస్టుల్లో సొంత డబ్బా, కొన్నిట్లో అగ్రెసివ్ మార్కెటింగ్ ఉండొచ్చు. ఉంటాయి.
నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న కొంతమందికి ఇవి నచ్చకపోవచ్చు. చికాకు తెప్పించవచ్చు. బోర్ కొట్టొచ్చు. సహజం.
అన్నీ అందరికీ నచ్చాలని రూలేం లేదు. అది అసాధ్యం కూడా.
అన్నీ అందరికీ నచ్చాలని రూలేం లేదు. అది అసాధ్యం కూడా.
ఈ స్టఫ్ నచ్చని మిత్రులు, పెద్దలు నిర్మొహమాటంగా నన్ను బ్లాక్ చెయ్యొచ్చు, అన్‌ఫ్రెండ్ చెయ్యొచ్చు, అన్‌ఫాలో కావచ్చు... అని నా సవినయ మనవి.
ఎంజాయ్ చేసే మిత్రులకు, పెద్దలకు ఛీర్స్!
రోజూ ఎన్నో బిలియన్ల ఫండ్స్ డీల్ చేసే జేమ్స్ ఆల్టుచరే - తాను పోస్ట్ చేసే ప్రతి పోస్ట్‌కూ "పోస్ట్ చెయ్యాలా వద్దా?" అని తన్నుకుచస్తాడట. ఆఫ్టర్ ఆల్... నేనెంత?
సో, నో వర్రీస్. నేను జేమ్స్ అంత కూడా ఆలోచించను. ఆ టెన్షన్‌లో పడిపోకముందే పోస్ట్ చేసేస్తాను.
"అవతల ఎవరో ఏమనుకుంటారో అని ఆలోచించటం వృధా. వాళ్లంతా వచ్చి మన బిల్స్ కట్టరు" అన్నాడొక పెద్దాయన.
సో - మన పనులు, మన బాధ్యతలు, మన టార్గెట్స్, మన ఫ్రీడమ్ మనకు చాలా ముఖ్యం.
థాంక్యూ సో మచ్...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani