ఈ బ్లాగ్ రాయడం పూర్తిచేసి, పోస్ట్ చేసేటప్పటికి మా అపార్ట్‌మెంట్స్ ముందు ఈ అర్థరాత్రిపూట మస్త్ అల్లరి ఉంటుంది.
మా చిన్నబ్బాయి ప్రియతమ్ పుట్టినరోజు రేపు.
వాడి క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్ అంతా వచ్చి వాన్ని కిందకు తీసుకెళ్తారు.
ఇప్పటి ట్రెండ్ ప్రకారం ఈ అర్థరాత్రి "బర్త్‌డే బంప్స్" పేరుతో వాడి వీపు విమానం మోత మోగించటం వగైరా అంతా తెలిసిందే.
కట్ చేస్తే -
మా ఇద్దరబ్బాయిల్లో ప్రియతమ్ చిన్నోడు.
ఈసారి వాడి బర్త్‌డే రోజు నేను గుంటూరులో ఉన్నాను. ఈ బర్త్‌డేకు వాడికి ప్రామిస్ చేసినవాటిని సమయానికి సమకూర్చలేకపోయాను.
ఇందాకే ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాను, "ఫైన్ కింద డబల్" ఇస్తానని.
సరే అన్నాడు.
సుమారు ఏడేళ్ళక్రితం ఒక యాక్సిడెంట్లో నేను తీవ్రంగా గాయపడ్డాను. ఒక ఎనిమిది నెలలపాటు బెడ్ పైనే రెస్ట్ తీసుకోవాల్సివచ్చింది.
ఫిజియోథెరపిస్ట్ ఇంటికొచ్చి సర్జరీ అయిన నా కాలుని వంచడానికి కొన్ని ఎక్సర్‌సైజులు చేయించేవాడు. ఆ ఫిజియోథెరపిస్ట్ చెప్పినట్టుగా ప్రియతమ్ మిగిలిన రెండుపూటలూ చాలా ఓపిగ్గా నాచేత ఎక్సర్‌సైజులు చేయించేవాడు.
అప్పుడు వాడి వయసు పన్నెండేళ్లే.
చిన్నప్పటినుంచీ నేనంటే వాడికి చాలా కన్సర్న్.
ఇప్పుడు పంతొమ్మిది దాటి, ఇరవైలోకి ప్రవేశిస్తున్నా వాడిలో నాపట్ల అదే కన్సర్న్, అదే ప్రేమ.
ఏం మారలేదు.
బహుశా దూరంగా ఉన్నాననేమో, వాడికి సంబంధించిన ఇంకెన్నో విషయాలతోపాటు, వాడి బర్త్‌డే రోజు, అప్పటి ఈ జ్ఞాపకం కూడా నెమరేసుకొంటున్నాను.
బర్త్‌డే గిఫ్ట్‌గా, ప్రియతమ్ కోసం ఈరోజే ఆన్‌లైన్‌లో నేనొక యాక్టివిటీ ప్రారంభించాను. దాన్ని పూర్తిస్థాయిలో సెటప్ చేసేసి, ఈ నెలాఖరుకి వాడికి అప్పగిస్తాను.
ఇంకో 90 రోజుల తర్వాతనుంచి నేను వాడికి పాకెట్ మనీ ఇవ్వాల్సిన పనుండదు. అవసరమైతే వాడే నాకెప్పుడయినా అడ్జస్ట్ చేయొచ్చు.
వాడి చదువుకి ఇది ఏమాత్రం అడ్దంకి కాదు. మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వారానికో నాలుగు గంటల సమయం దీనికి కెటాయిస్తే చాలు.
తన ఇరవయ్యవ పుట్టినరోజునాటికే మా ప్రియతమ్ ఒక "ఇన్‌ఫొప్రెన్యూర్" అవుతుండటం నాకు ఆనందంగా ఉంది.
హాపీ బర్త్‌డే చిన్నూ...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani