ఓయూ .. ఒక మధురస్మృతుల మాలిక. ఒక ఉద్వేగం. ఒక ఆనందం.
ఫ్రేమ్ బై ఫ్రేమ్ .. ఎన్నో జ్ఞాపకాలు చక చకా అలా నా కళ్లముందు కదిలిపోతుంటాయి.
ఫోటో తీసుకున్నప్పుడల్లా ఒక కొత్త అందంతో కనిపించే ఆర్ట్స్ కాలేజి. అందులో నేను చదివిన ఎం ఏ, ఎం ఎల్ ఐ ఎస్సీ. సాధించిన రెండు గోల్డ్ మెడల్స్ ..
పార్ట్ టైమ్‌గా అదే ఆర్ట్స్ కాలేజ్‌లో నేను ఎంతో ఇష్టంగా చదివిన మూడేళ్ల రష్యన్ డిప్లొమా. అందులోనూ నేనే యూనివర్సిటీ టాపర్ కావడం ..
ఎమ్మేలో నా గురువులు నాయని కృష్ణకుమారి, కులశేఖరరావు, గోపాలకృష్ణారావు, ఎస్వీ రామారావు, కసిరెడ్డి వెంకటరెడ్డి, ఎల్లూరి శివారెడ్డి, సుమతీ నరేంద్ర, గోపి గార్లు ..
టైపిస్ట్ శశికళ, అటెండర్ ఫక్రుద్దిన్ ..
లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్‌లో నా గురువులు ఎ ఎ ఎన్ రాజు, వేణుగోపాల్, లక్ష్మణ్ రావు, జనార్ధన్ రెడ్డి, జగన్ మోహన్, సుదర్శన్‌రావు గార్లు ..
రష్యన్ డిప్లొమాలో నా గురువులు మురుంకర్, కల్పన, ప్రమీలాదేవి గార్లు ..
నా క్లాస్‌మేట్స్, నా ఫ్రెండ్స్ ..
రష్యన్ డిప్లొమాలో తెలుగు మాట్లాడని నార్తిండియన్ సిటీ అమ్మాయిలు ..
నేనున్న ఏ హాస్టల్, మంజీరా హాస్టళ్లు ..
ఏ హాస్టల్లో రూమ్ నంబర్ 6, రూమ్ నంబర్ 55 ..
నా ఆత్మీయ మిత్రులు "బిగ్ ఫైవ్", మా యాకూబ్, మా గుడిపాటి, మా కాముడు ..
ఏ హాస్టల్ మెస్, పుల్లయ్య, పొద్దున చపాతీలు, ఆమ్‌లెట్, మధ్యహ్నం భోజనంలో అన్ని కూరలతోపాటు చిన్న ప్లేట్‌లో మటన్ ముక్కలు, సండే స్పెషల్, సంవత్సరానికోసారి 'మెస్ డే' రోజు కోడికి కోడి తినడాలు .. చివర్లో స్వీట్ పాన్‌లు ..
క్యాంపస్‌లో మెయిన్ క్యాంటీన్, ఆర్ట్స్ కాలేజ్ వెనుక చెట్లకింది క్యాంటీన్ ..
రాత్రిళ్లు హాస్టల్ వెనకాల బండలమీద నర్సిమ్మ తడికల క్యాంటీన్‌లో ఆమ్‌లెట్ తిని చాయ్‌లు తాగడం, అర్థరాత్రి దాటేదాకా అవే బండలమీద కూర్చొని సిగరెట్లమీద సిగరెట్లు కాలుస్తూ కవిత్వాలూ, కబుర్లూ, చర్చలూ, కొట్లాటలు, తిట్టుకోడాలు ..
గంటలకొద్దీ కూర్చొని గడిపిన ఆర్ట్స్ కాలేజ్ లాన్స్, మెయిన్ లైబ్రరీ మెట్లు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్ చెట్లనీడలు ..
టాగోర్ ఆడిటోరియంలో ఫంక్షన్లు, సినిమాలు ..
ఆడిటోరియం వెళ్లేదారిలో సన్నని గోడపైన సర్కస్ చేస్తూ నడిచిన రాత్రులు ..
క్యాంపస్ గోడ దూకి వెనకే వున్న ఆరాధన థియేటర్లో వారం వారం సినిమాలు, ఈలలు, పెడబొబ్బలు ..
తెరమీద "అచ్చా అచ్చా .. బచ్చా బచ్చా" పాట వస్తున్నప్పుడు రెచ్చిపోయి లేచి ఎగరడాలు ..
టికెట్ దొరకనప్పుడు మేనేజర్ రూమ్‌లోకి వెళ్లి గొడవపడటాలు ..
స్టుడెంట్ యూనియన్‌ల మీటింగులు, గొడవలు, తలలు పగిలి రక్తాలు కారే కొట్లాటలు, తపంచాలతో కాల్పులు ..
ఒరిస్సా, వైజాగ్, అరకు, బెంగుళూరు, మైసూరు, ఊటీ, కొలనుపాక .. విహార యాత్రలు ..
కోర్సులు పూర్తయ్యాక, ఒక్కో మిత్రుని వీడ్కోలు అప్పుడు ఆగని కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడ్వటాలు ..
ఇంకా ఎన్నో .. ఎన్నెన్నో .. అన్నీ .. ఈరాత్రి గుర్తుకొస్తున్నాయి.
మిత్రులారా నేనిక్కడ. మరి .. మీరెక్కడ?

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani