Sunday, 18 November 2018

డైనమిజమ్ అన్‌లిమిటెడ్!

కేసీఆర్ గారికి వచ్చిన #ET "బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్" అవార్డును, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా, కేసీఆర్ తరపున మంత్రి కేటీఆర్ నిన్న అందుకున్నారు.

కట్ చేస్తే - 

అవార్డు అందుకున్న తర్వాత, అక్కడ నాలుగు మాటల్లో కృతజ్ఞతలు చెప్పే ఆ కొద్ది సమయాన్ని కూడా మన డైనమిక్ మంత్రి కేటీఆర్ వదులుకోలేదు.

వందలాదిమంది పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మాగ్నెట్స్ అలా ఎప్పుడో ఒకసారి తప్ప, ఒక్కచోట దొరకరు!

కేసీఆర్‌కు ఈ అవార్డు రావడానికి ముఖ్యకారణమైన "టిఎస్ ఐపాస్" గురించి చకచకా నాలుగుముక్కల్లో చెప్పేశారు.

"తెలంగాణలో ఎవ్వరైనా ఏ ఫ్యాక్టరీగానీ, పరిశ్రమగానీ పెట్టాలనుకొనేవాళ్లకు అంతా సెల్ఫ్ డిక్లరేషనే. అనుమతులన్నీ మంజూరు చేసి, కేవలం 15 రోజుల్లో మీ బిజినెస్ ప్రారంభించుకోడానికి సర్టిఫికేట్ ఇస్తాం.

ఒకవేళ 15 రోజుల్లో మీకు సర్టిఫికేట్ రాలేదంటే, ఆటొమాటిగ్గా మీకు సర్టిఫికేట్ వచ్చినట్టే లెక్క!

ఇదంతా ఒక్క మా తెలంగాణలోనే సాధ్యం. ఏ మహారాష్ట్రలో గానీ, ఆఖరుకు గుజరాత్‌లోగానీ లేదు" .. అంటూ చమత్కరిస్తూ తన 2 నిమిషాల థాంక్సోపన్యాసాన్ని ముగించారు కేటీఆర్.

దటీజ్ డైనమిజమ్.

With that said -

రాష్ట్రస్థాయిలోనే కాదు, జాతీయస్థాయిలో కూడా తన ఊహే హద్దుగా ఎంత ఎత్తుకయినా ఎదిగే  అవకాశాలు కేటీఆర్‌కు పుష్కలంగా ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

అవసరమైనప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వెనుక కేసీఆర్ ఎలాగూ ఉన్నారు.    

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani