"25 వస్తే ఎక్కువ టీఆరెస్‌కు!"
ఏదో పనిమీద మొన్న మా ఆఫీసుకొచ్చిన ఒక అడ్వొకేట్ ఉవాచ అది.
"ఈసారి కేసీఆర్ రాడు సార్!"
అదే రోజు సాయంత్రం మా ఆఫీసు బయట కలిసిన ఒక టీవీ ఛానెల్ రిపోర్టర్ అలా తేల్చేశాడు. కేసీఆర్ ఎందుకు రాడో ఆయన దగ్గర మొత్తం సమాచారముందట.
"ముందస్తు ఎన్నికలకు పోయినవాళ్లెవరూ గెలిచిన దాఖలాలు లేవు. ఇదే రేపు కేసీఆర్‌కు జరగబోతోంది!"
ఒక సీనియర్ సూడో రాజకీయ విశ్లేషకుని జోస్యం.
ఇదంతా టైమ్ పాస్ బఠానీ సెక్షన్. 'రివ్యూలు చదివి, సినిమా చూసిన ఆనందం పొందేవాళ్ళ' లాగన్నమాట!
తెల్లారిలేస్తే రివ్యూలు చదివేటోళ్లు అసలు సినిమాలకు పోరు. వీళ్ళతో టికెట్లు తెగవ్. ఎగబడి సినిమాలకు పోయేటోళ్లు అసలు రివ్యూలు చదవరు. టికెట్లు తెగేది వీళ్లతోనే. కోట్లు వచ్చేది వీళ్లతోనే.
సో, మన టైమ్ పాస్ బఠానీ సెక్షన్ కూడా అట్లాంటిదే. వీళ్ళల్లో ఎంతమంది రేపు పోలింగ్ బూత్ కు పోయి ఓట్లేస్తరో ఆ వేములవాడ రాజన్నకే తెలవాలి.
కట్ చేస్తే -
ఏ గ్రామానికైనా వెళ్లండి. ఏ ఊరికైనా వెళ్ళండి. చిన్న టౌన్ లు, పెద్ద సిటీలు కూడా అంతే.
టీఆరెస్ .. టీఆరెస్.
కేసీఆర్ .. కేసీఆర్.
అంతా గులాబీమయం!
ఒక్క విషయం పైన అందరికీ చాలా స్పష్టమైన అవగాహన ఉంది:
తెలంగాణకు ముందు పరిస్థితి ఏంటి, తెలంగాణ తర్వాత ఏంటి?
దేశం మొత్తంలో, అతి తక్కువ సమయంలో, అద్భుత ఫలితాలను, ఊహించని మార్పులను అత్యంత వేగంగా చూపించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణలోని తెరాస ప్రభుత్వం ఒక్కటే.
అలాంటి పనిచేసే ప్రభుత్వం మాత్రమే మళ్లీ రావాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు.
కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నారు.
రేపు ఎన్నికల్లో అదే జరగబోతోంది.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani