డిసెంబర్ 27, 2016.
సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు మధ్యాహ్నం మా అమ్మ ఫోన్‌లో ఆమెతో నేను ఒక పది నిమిషాలపాటు మాట్లాడాను.
అదే మా అమ్మ మాట్లాడిన చివరి కాల్. అదే నేను మా అమ్మతో మాట్లాడిన చివరి కాల్.
వరంగల్లో, అక్కడే ఉన్న మా తమ్ముడు మా అమ్మ ఆరోగ్యం గురించి ఏదో అంటే నేను పట్టించుకోలేదు. మామూలుగా 70 ప్లస్ వయస్సులో వచ్చే ఏదో చిన్న అనారోగ్యం అనుకున్నాను.
కానీ, ఆ తర్వాత ఒక గంటకే నేను ఊహించని కాల్ రానే వచ్చింది.
మా అమ్మ చనిపోయింది.
కట్ టూ 27 డిసెంబర్ 2017 -
సరిగా ఇప్పుడు ఈ బ్లాగ్ రాస్తున్న ఈ సమయానికి .. సంవత్సరం క్రితం, వరంగల్లో, మా అమ్మకు అంతిమ సంస్కారం చేస్తున్నాం.
అంతా అయిపోయింది.
చూస్తుండగానే, మా అమ్మ లేకుండానే, 365 రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి.
ఒక నాలుగు రోజుల్లో 2017 పూర్తికాబోతోంది.
2018 రాబోతోంది.
అన్నీ మామూలుగానే జరిగిపోతున్నాయి.
అమ్మ లేకుండానే ...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani