అది ఫుట్ బాల్ టోర్నమెంట్ కాదు, క్రికెట్ వరల్డ్ కప్ కాదు.
ప్రపంచ తెలుగు మహాసభలు ...
అయినా, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మన లాల్ బహదూర్ స్టేడియం కిక్కిరిసిపోయింది!
బాల్ కోసం కాదు, భాష కోసం!
నిస్సందేహంగా నూటికి నూరు శాతం ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే.
42 దేశాల నుంచి, దేశంలోని 19 రాష్ట్రాలనుంచి, వేలాదిమంది ప్రతినిధులు పాల్గొన్న ఈ తెలుగు మహాసభలు నభూతో నభవిష్యతి!
ఇది చదవడానికి, వినడానికి ఒక మామూలు అతిశయోక్తిలా అనిపించవచ్చు. కానీ, ఎంతమాత్రం కాదు.
అయితే, 'నభూతో నభవిష్యతి' అన్న మాట నేనిక్కడ ఉపయోగించడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి రెండు అంశాల గురించి మాత్రమే ఇక్కడ మీతో పంచుకోవాలని ఈ చిన్న బ్లాగ్ పోస్టు రాస్తున్నాను.
ఇంతవరకూ తెలంగాణ ప్రజలు కేసీఆర్ లో ఒక ఉద్యమ నాయకున్ని చూశారు. ఒక అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రిని చూశారు. బంగారు తెలంగాణ కోసం అహరహం తపించే ఒక స్వాప్నికుణ్ణి చూశారు. బంగారు తెలంగాణ అనేది కేవలం మాటలే కాదు, చేతల్లో కూడా సాధ్యమే అని ఒక్కొక్కటిగా అద్భుతాలు ఆవిష్కరిస్తున్న ఒక దార్శనికుణ్ణి చూశారు. పరిపాలన అంటే ఎప్పుడూ రాజకీయమే కాదు, మానవీయకోణంలో కూడా ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవచ్చు అని నిరూపించిన ఒక మనవతామూర్తిని చూశారు. తెలంగాణ గడ్డ మునుపెన్నడూ చూడని ఒక రాజకీయ చాణక్యుణ్ణి కూడా చూశారు.
ఇప్పుడు, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిపిన ఈ మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభల పుణ్యమా అని, మొట్టమొదటిసారిగా, కేసీఆర్ లో ఒక నిలువెత్తు సాహిత్యమూర్తిని కూడా చూశారు.
ఇది కదా అసలు అద్భుతం!
ఆ భాష, భాష మీద ఆ మమకారం, ఆ వ్యక్తీకరణ ... సాహిత్యం మీద, సాహిత్య చరిత్ర మీద, భాషా చరిత్ర మీద అంత పట్టు ... వందలాది పద్యాలు కంఠతా ఉండటం, ఆ పద్యాల్ని పద్యాల్లా అలవోగ్గా ఆలపించడం ...
ఎప్పుడైనా, ఏ ముఖ్యమంత్రిలోనయినా ఇన్ని అద్భుత పార్శ్వాలు మనం చూశామా?
బహుశా ఇకముందు కూడా మనం చూడం.
నిజమే. మనకిష్టం లేనివి కూడా ఈ సభల్లో కొన్ని జరిగి ఉండవచ్చు. కానీ, వేలాదిమంది పాల్గొనే సభల్లో ప్రతి ఒక్క అంశాన్ని కూడా కేసీఆర్ ఒక్కడే చూసుకోవాలంటే అది నిజంగా అయ్యేపని కాదు.
ఇంత భారీ కార్యక్రమంలో, ఆయా విభాగాలకు నియమించిన ప్రధాన వ్యక్తుల నిర్ణయాల కారణంగా, కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. అర్థం చేసుకోగలిగితే అది సహజం. తప్పులే పట్టుకోవాలని నిత్యం రంధ్రాన్వేషణ చేసేవారికి మాత్రం అది కోతికి కొబ్బరి చిప్పే.
రాజకీయ అవసరమో, చాణక్యమో .. ఈ సభల్లో మన మనస్సుని చివుక్కుమనిపించే ఒకానొక సినీతారల సన్మాన కార్యక్రమంలో కూడా ఒక పాజిటివ్ కోణాన్ని మనం చూడవచ్చు.
అంతకుముందు తెలంగాణను వ్యతిరేకించినవారిచేత, తెలంగాణను ద్వేషించినవారిచేత, తెలంగాణను యూ టీ చేయాలన్నవారిచేత కూడా .. అదే వేదిక మీదనుంచి .. అదే తెలంగాణను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ రచయితలు, కవులను నోరారా పొగిడేలా చేయగలిగిన సత్తా కేవలం కేసీఅర్ దే!
అంతే కాదు. మహాసభల ముగింపు రోజున తన ఉపన్యాసాన్ని కేసీఆర్ ఒక నవ్వుల పద్యంతో ముగించడం విశేషం.
ఇక, సభల ముగింపు సంబురాలు ఏదో అల్లాటప్పాగా జరగలేదు. అద్భుతమైన లేజర్ షో, భారీ టపాసులతో దేదీప్యమానంగా, ఒక అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఈవెంట్ ముగింపు వేడుకల్లాగా జరపడం అనేది కేసీఆర్ ఈ మహాసభలకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుపుతుంది. తెలుగు భాష పట్ల ఆయనకున్న మమకారాన్ని తెలుపుతుంది.
హైద్రాబాద్ లో విజయవంతంగా జరిపిన తెలుగు మహాసభల ప్రకంపనలు మన పక్క రాష్ట్రంలో వెంటనే మొదలయ్యాయి. 'భీమవరంలో ఆంధ్ర మహాసభలు' అంటున్నారు అప్పుడే!
పోటీగా చేసినా, ఇంకే ఉద్దేశ్యంతో చేసినా, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరగడం వల్ల తెలుగు భాష మరింత ప్రాధాన్యతను సంతరించుకొంటుంది. మరింతగా విలసిల్లుతుంది.
కనీసం ఈ దిశలో ప్రయత్నాలయినా ఎప్పుడూ కొనసాగుతుంటాయి.
మాతృ భాషకు బ్రహ్మరథం పట్టాలన్న కేసీఆర్ ఆశయ సాఫల్యానికి ఇది ఆరంభం మాత్రమే. ఇక ప్రతియేటా డిసెంబర్ మొదటివారంలో తెలంగాణలో తెలుగు మహాసభలు జరుపుతామని కూడా కేసీఆర్ చెప్పారు.
కట్ టూ సంస్కారదీప్తి -
తెలుగు మహాసభల ప్రారంభం రోజున జాతీయగీతాలాపన అయినవెంటనే, తొట్టతొలిగా తన ముఖ్యమంత్రి ప్రోటోకాల్ లాంటివన్నీ పక్కనపెట్టి, కేసీఆర్ తన గురువుగారైన మృత్యుంజయశర్మ గారిని వేదికపైన సత్కరించి, సాష్టాంగ ప్రణామం చేయడం ఎవరూ ఊహించని గొప్ప విషయం.
ఒక వ్యక్తి విజయపరంపర వెనుక అతని కృషి, పట్టుదల, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే స్థితప్రజ్ఞత వంటివి ఎన్నో తప్పక ఉంటాయి. వీటన్నింటికి తోడు అతని వ్యక్తిత్వం, అతనిలోని అత్యున్నత సంస్కారం కూడా ఈ విషయంలో ప్రధానపాత్ర వహిస్తాయన్న నిజానికి నిలువెత్తు నిదర్శనం మన కేసీఆర్.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani