ఆద్యంతం ప్రేక్షకులకు బోర్ కొట్టించని సన్నివేశాలతో, ముఖ్యంగా యూత్ వాళ్లని వాళ్లు ఐడెంటిఫై చేసుకొనే విధంగా కథ, కథనం ఉంటాయి.
పాటలతోసహా, మొత్తం షూటింగ్‌ను సుమారు 20 రోజుల్లోపే పూర్తి చేయాలనుకుంటున్నాను.
హీరోహీరోయిన్లతోసహా, దాదాపు అంతా కొత్త/అప్‌కమింగ్ ఆర్టిస్టులతోనే రూపొందిస్తున్న ఈ సినిమాకు సంగీతం ప్రదీప్‌చంద్ర అందిస్తున్నాడు. నా ఆత్మీయమిత్రుడు, ప్రముఖ కెమెరామన్ వీరేంద్రలలిత్ (ముంబై) దీనికి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నాడు.
మొన్నటి సెప్టెంబర్ 11 కు రిలీజైన నా లేటెస్ట్ సినిమా స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ డేట్‌ను 40 రోజులముందే ప్రకటించి, అదే డేట్‌కు రిలీజ్ చేయగలిగిన విషయం ఇండస్ట్రీ మిత్రులందరికీ తెలిసిందే.
కట్ చేస్తే -
ఇప్పుడు నా తాజా సినిమా ఓపెనింగ్ రోజునే, ఆ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ఎనౌన్స్ చేయబోతున్నాను. ఈ సినిమాను కేవలం 45 రోజుల్లోనే పూర్తిచేసి రిలీజ్ చేయాలన్నది మా టీమ్ సంకల్పం!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani