జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రముఖ హీరో ఇంట్లో కాల్పులు జరిగాయి. ఒక పెద్ద ప్రొడ్యూసర్, మరొక ప్రముఖ సినిమా సిధ్ధాంతి ఆ కాల్పుల్లో దారుణంగా గాయపడి, చావుబతుకుల మధ్య హాస్పిటల్‌కు తరలించబడ్డారు.
ఆ అగ్ర హీరో పేరు నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. ఆ ప్రొడ్యూసర్ పేరు బెల్లంకొండ సురేష్. ముందే చెప్పినట్టు, ఆ రాత్రి జరిగిన ఆ సంఘటన ఇండస్ట్రీకి ఓ పెద్ద షాక్!
కట్ చేస్తే -
జూన్ 4, శుక్రవారం ఉదయం నారాయణగూడలోని వెంకటేష్ థియేటర్లో రాజా హీరోగా నటించిన నా తొలి చిత్రం "కల" విడుదలైంది. నేనీ బ్లాగ్ రాస్తున్న సమయానికి (ఉదయం 9 గంటలు), ఆ రోజు, నా ప్రొడ్యూసర్ మిత్రుడు రామచంద్రారెడ్డి "కల" సినిమా ఫిలిం రీళ్లను చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ, సంప్రదాయబధ్ధంగా, సినిమా విజయాన్ని కాంక్షిస్తూ పూజ చేయించాక, ఆ రీళ్లని వెంకటేష థియేటర్లో ప్రదర్శనకి తీసుకొచ్చాడు. సినిమా ఫ్లాపయింది.
ఫెయిల్యూర్‌కి వంద రీజన్స్ ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకుని, నన్ను నేను సమర్ధించుకునే ప్రయత్నం చేయటం కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. అంతిమ ఫలితమే నాకు ముఖ్యం.
రికార్డ్ స్థాయిలో - ఇప్పటివరకు - జెమిని, తేజ చానెల్స్‌లో సుమారు వందసార్లు టెలికాస్ట్ అయిన నా తొలి చిత్రం "కల" అంతిమ ఫలితం కమర్షియల్ ఫెయిల్యూర్. అది మాత్రమే నాకు గుర్తుంటుంది. దాన్ని నేనెప్పుడూ మర్చిపోను.
***
("కల" trivia .. తర్వాతి బ్లాగ్‌లో!)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani