చెత్తని ఊడ్చివేసే సఫాయీ వాళ్లంటే నాకెంతో గౌరవం. మనమందరం చేయలేని పనిని చేస్తూ, మనకు మంచి పరిశుభ్రమయిన వాతావరణాన్ని అందిస్తారు వాళ్లు.
అది మనకు కనిపించే చెత్త.
కాగా, మన కళ్లకు "కనిపించని చెత్త" కూడా మన చుట్టూరా, మన పక్కనే ఉంటుందన్న విషయం మీకు తెలుసా? ఈ బ్లాగ్ చదవండి. మీకే తెలుస్తుంది.
ఒక లోక్ సభ స్పీకర్‌తో కలిసి టిఫిన్ చేశాను, భోజనం చేశాను. మాట్లాడాను. రవీంద్రభారతిలో ఆయన చేతులమీదుగా సన్మానం అందుకున్నాను. ఒక కేంద్రమంత్రితో కలిసి పని చేశాను. ఆయన ఎన్నోసార్లు నన్ను మెచ్చుకున్నారు. ఒక ఫంక్షన్‌లో స్వయంగా ఆయనే నాకు వడ్డించారు. ఒక రాష్ట్ర మంత్రి, ఒక జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత నాకు సన్మానం చేశారు. ఇంక.. ఐ ఏ ఎస్ ఆఫీసర్లు, ఐ ఆర్ ఎస్ ఆఫీసర్లతో నయితే నాకున్న మంచి అనుభవాలు, కమ్యూనికేషన్ విషయం చెప్పాల్సిన పని లేదు. నార్త్‌లో, ఒక హైకోర్టు డిప్యూటీ అడ్వొకేట్ జనరల్ నాకు చాలా దగ్గరి ఫ్రెండు. ఒక అంతర్జాతీయ స్థాయి బెస్ట్ సెల్లర్ రైటర్ నాకు కనీసం ఒక "హాయ్" చెప్పకుండా ఒక్కరోజు ఉండలేదు. ఇలా.. ఇంకా ఎన్నో చెప్పగలను.
ఇదంతా నేనేదో గొప్పవాడినని చెప్పడానికి కాదు..
పైన చెప్పిన వారందరికీ, అంతంత పెద్ద హోదాల్లో, స్థాయిల్లో, బాధ్యతల్లో ఉన్నా కమ్యూనికేషన్‌కి టైమ్ ఉంది. అయితే ఫోన్‌లో మాట్లాడతారు. మెసేజ్ లు పెడతారు. షెడ్యూల్ మరీ టైట్ గా ఉన్నప్పుడు అదే విషయం ఒక ఈమెయిల్ అయినా పెడతారు. లేదంటే, వేరేవాళ్లతోనయినా విషయాన్ని చేరవేస్తారు. కమ్యూనికేషన్‌కు, మాటకు అంత విలువ, ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టే వాళ్లు ఆయా రంగాల్లోకి వెళ్లగలిగారు. ఆ స్థాయికి చేరుకోగలిగారు.
కట్ టూ పాయింట్ -
మనం ఒక పని అనుకున్నాం. ఆ పనికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ విషయం ఇద్దరికీ తెలుసు. దానికి ఒక డెడ్‌లైన్ కూడా ఉంది.
అలాంటప్పుడు కమ్యూనికేషన్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? ఆ పని ఆలస్యం అవుతుంది అనుకున్నా, అసలు "ఇంక మా వల్ల కాదు.. మేం ఉట్టి చేతకాని వాళ్లం" అని డిసైడ్ అయిపోయినా.. ఆ విషయం మనం అవతలివాళ్లకు చెప్పాలి. చెప్పడానికి అహం అడ్డొస్తే .. ఒక మెసేజ్ పెట్టాలి. ఒక ఈమెయిల్ పెట్టాలి. లేదా ఇంకొకరి ద్వారానయినా ఆ విషయం తెలియజేయాలి. మినిమమ్ మేనర్స్ పాటించాలి. అప్పుడు అవతలి వాళ్లు వారి జాగ్రత్తలు వాళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది.
అలా కాకుండా, ఎప్పుడో ఒకసారి.. "నేను కొంచెం బిజీగా ఉన్నాను.. నాకు టైమ్ లేదు.. చిన్న ప్రాబ్లం వచ్చింది.. రాత్రికి కాల్ చేస్త.." వంటి సొల్లు కాల్స్ లేదా మెసేజ్‌లతో రోజులు, వారాలు, నెలలు గడిపే వాళ్లని ఏమనాలి?
కమ్యూనికేషన్ కోసం, అంతంత పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్లకు ఉండే సమయం వీరికి లేదా? అసలు ఎదుటివాళ్లని ఇలాంటి వాళ్లు ఏమనుకుంటారు? దానికంటే ముందు.. అసలు వీళ్లగురించి వీళ్లు ఏమనుకుంటారు?
ఈ టాపిక్‌ని ఇంకో బ్లాగ్‌లో కంటిన్యూ చేద్దాం.
నిజానికి ఇలాంటి వాళ్లగురించి నేను బ్లాగ్ రాయటం, మీరు చదవటం.. మనం ఇంత టైం వేస్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. కానీ, ఇలాంటి వాళ్ల ద్వారా మరొకళ్లు నష్టపోకుండా ఉండటం కోసమే నా ఈ ప్రయత్నం.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani