ఫీల్డు గురించి తెలియని కొత్తవారికీ, ఫీల్డులోనే వుండీ ఇంకా భ్రమల్లోనే బ్రతుకుతున్న పాతవారికీ ఈ నిజాలు కొంతయినా ఉపయోగపడాలనీ నా ఉద్దేశ్యం.
'నగ్నచిత్రం' టైటిల్ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఉంటుంది, నాకు తెలుసు. కాని, నా ఉద్దేశ్యంలో ఈ టైటిలే ఈ బ్లాగ్ కు సరిగ్గా సరిపోతుంది. అఫ్కోర్స్ , కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. అంతే తప్ప మీరు అనుకొనే 'నగ్నం' ఏదీ ఇందులో ఉండదు. అలాగే .. అనవసరమైన సుత్తి, పేజీలకు పేజీల రాతలు కూడా ఇందులో ఉండవు. అంత టైం ఎవరికీ లేదు అన్న నిజం నాకు బాగా తెలుసు.
ఫీల్డుకు సంబంధించిన వివిధ శాఖల్లో పనిచేసిన, ఇంకా చేస్తున్న కొంతమంది ప్రముఖుల ఇంటర్వ్యూలు కూడా ఈ బ్లాగులో ఉంటాయి. రెగ్యులర్ గా కాదు, అప్పుడప్పుడూ. ప్రముఖులు కానివారి ఇంటర్వ్యూలు కూడా ఉండొచ్చు. ఉండే అవకాశం చాలా ఉంది.
మరొక విషయం. ఈ బ్లాగులో రాసే రాతలు ఎవరినీ ఉద్దేశించి రాసేవి కావు. అలా రాయటం నా ఉద్దేశ్యం కాదు కూడా. ఫీల్డులో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పటమే నా ఉద్దేశ్యం.
సో, సినీ ప్రేమికులందరికీ ఇదే నా ఆహ్వానం. ఆప్పుడప్పుడూ విజిట్ చేయండి. నచ్చిన పోస్టులను మీకు నచ్చినచోట లింక్ చేయండి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్ !...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani