"అంతే సర్... ఫిలిం ఓపెనింగ్ ఈవెంట్ మనం దస్పల్లాలోనే చేద్దాం. ఇన్వెస్టర్స్ అందర్నీ అక్కడికి పిలుద్దాం. ఫైవ్ క్రోర్స్ ఏంటి సార్... టెన్ వచ్చినా చెప్పలేం!"
చాలా కాన్‌ఫిడెంట్‌గా ఒక్కో టీమ్ మెంబర్ తన జేబులో ఉన్న ఇన్వెస్టర్స్ లిస్ట్, తను పెట్టించే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోట్లల్లోనే చెప్పారు... "తగ్గేదేలే" అన్నట్టుగా.
వాళ్ళు చెప్పినదాంట్లో ఒక పది శాతం జరిగినా చాలు అనుకున్నాడతను.
కోర్ టీమ్‌లో ప్రతి ఒక్కరు మాంచి ఊపులో ఉన్నారు. ఇంతలో మధుర్ స్వీట్స్ నుంచి మాంచి కలాకంద్, ఖారా వచ్చింది. తినేశారంతా. చివర్లో మేనేజర్ తెచ్చిన టీతో కోర్ టీమ్ మీటింగ్ సంపూర్ణమైంది.
కోర్ టీమ్‌లో ప్రతి ఒక్కరు మాంచి ఊపులో ఉన్నారు. ఇంతలో మధుర్ స్వీట్స్ నుంచి మాంచి కలాకంద్, ఖారా వచ్చింది. తినేశారంతా. చివర్లో మేనేజర్ తెచ్చిన టీతో కోర్ టీమ్ మీటింగ్ సంపూర్ణమైంది.
కట్ చేస్తే -
ఒక పది పన్నెండు లక్షల ఖర్చుతో దస్పల్లాలో ఫిలిం ఓపెనింగ్ యమ గ్రాండ్‌గా జరిగింది.
చుట్టాల పెళ్ళికి వచ్చినట్టు వచ్చిన కోర్ టీమ్ మెంబర్స్, అదే మూడ్‌లో, ఫంక్షన్ బాగానే ఎంజాయ్ చేశారు. ఎక్కడివాళ్లక్కడ వెళ్ళిపోయారు.
కట్ చేస్తే -
ఇంకో ఆరు నెలలు గడిచింది.
'స్టాప్ బ్లాక్' ఎఫెక్ట్‌లో కోర్ టీమ్‌లో మెంబర్స్ అంతా అదృశ్యమైపోయారు.
నో కమ్యూనికేషన్. నో కాల్స్. నో కోట్లు.
చూసీ చూసీ... అతడు కాల్ చేస్తేనే అటునుంచి కాల్. అతడు మెసేజ్ పెడితేనే అటునుంచి మేసేజ్.
వాళ్ళ తప్పేం లేదు. ఏదేదో అనుకున్నారు. అవలేదు. అంతే కదా?
వాళ్ళ తప్పేం లేదు. ఏదేదో అనుకున్నారు. అవలేదు. అంతే కదా?
ఫండ్స్ రాకపోతే పోయింది. ఫ్రెండ్‌షిప్ ఏమైంది? కర్టెసీ?
వాట్ నెక్స్‌ట్ అనేది చర్చించుకోడానికయినా కనిపించాలి కదా? కలుస్తుండాలి కదా?
నో.
వాళ్లేం బచ్చాలు కాదు. మాటలు కోటలు దాటుతాయి. చేతలే గడప కూడా దాటలేకపోయాయి.
ఇవన్నీ అనుభవం మీద తెలుస్తాయి. ఎవరో చెప్తే అర్థం కాదు.
ఇవన్నీ అనుభవం మీద తెలుస్తాయి. ఎవరో చెప్తే అర్థం కాదు.
ఓవర్.
ఓవర్ టూ గ్రౌండ్ జీరో.
ఇంత పవర్‌ఫుల్ కోర్ టీమ్ మాటలు, ప్రామిస్‌ల మీద నమ్మకంతోనే ప్రొడక్షన్ హౌజ్ ప్లానింగ్స్, అడ్వాన్స్ పేమెంట్స్, కొత్త ఆఫీస్ సెటప్, రెంట్లు, మెయింటెనెన్స్‌లు, శాలరీలు... అదీ ఇదీ అన్నీ కలిపి సింపుల్‌గా ఒక అరకోటి హారతి కర్పూరం అయిపోయింది.
అప్పటికే రెండుమూడు సినిమాలు చేసి, సినిమా అంటే ఎంతో కొంత తెలిసిన అతడే ఇంత సినిమా చూడటం నిజంగా పెద్ద మ్యాజిక్.
కట్ చేస్తే -
కోర్ టీమ్ మాటల మాండ్రెక్స్ మత్తులోంచి అతడు పూర్తిగా బయటికివచ్చాడు.
"యస్", "నో" అని రెండు చీటీలు రాసి చుట్టచుట్టి టేబుల్ మీదకి విసిరాడు. వాటిల్లోంచి ఒకటి తీసి చూసుకున్నాడు. "యస్" వచ్చింది.
జీన్స్ వెనక జేబులో ఉన్న వాలెట్‌లో జాగ్రత్తగా పెట్టుకొన్న ఒక కాయిన్ తీసి, చిత్తూ బొత్తూ వేశాడు. బొత్తు పడింది. "యస్" అన్నమాట!
ఐఫోన్ తీసుకొని ఒక కాల్ చేశాడు.
రిస్కీ కాల్.
తప్పదు.
"అన్నా, రేపు పొద్దున ఫస్ట్ అవర్‌లో వస్తున్నా. అప్పుడు నేను వద్దన్న డీల్ ఇప్పుడు సెట్ చేసుకుందాం. నాకు ఓకే. డీల్ సైనింగ్ నాడే నువ్వు చెప్పినట్టు సినిమా ఎనౌన్స్‌మెంట్. పదిహేనురోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేద్దాం."
ఏంటా డీల్?
నిజంగా సెట్ అవుతుందా?
అప్పుడెందుకు వద్దన్నాడు, ఇప్పుడెందుకు ఓకే అన్నాడు?
టెంప్లేట్స్ వేరేగా ఉండొచ్చు. కాని, చాలావరకు జరిగేది ఇదే.
అప్పులు, కమిట్‌మెంట్స్, డెడ్‌లైన్స్, టెన్షన్స్, స్ట్రెస్... అన్నిటినీ తన దినచర్యలో ఒక మామూలు రొటీన్‌గా చేసుకొని పరిగెడుతున్న మారథన్ అతను.
చిమ్ముతున్న వాల్కనో శిఖరాగ్రం మీద తాండవ నృత్యం చేస్తున్నా, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కూల్ గై అతను.
కాసనోవా ఇన్ ఏ కాసినో.
కాసనోవా ఇన్ ఏ కాసినో.
అతడు... ఒక ఫిలిం డైరెక్టర్.
ఒక హిట్ ఇచ్చేదాకా ఎవ్వరికీ తెలీదు అతనెవరో.
అప్పటిదాకా అతనికే తెలీదు అతనెవరో.
అదే సినిమా.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 76/100.
Short story by Manohar Chimmani.
(మాటల సందర్భంలో "నీ కథల్లో ఎప్పుడూ రొమాన్సే ఎందుకు, ఇంకేం లేవా రాయడానికి?" అని ఒక ఫ్రెండ్ అడిగిన ప్రశ్నకి ఇదొక క్విక్ ఆన్సర్.) 😎 👆
100 Days, 100 Posts. 76/100.
Short story by Manohar Chimmani.
(మాటల సందర్భంలో "నీ కథల్లో ఎప్పుడూ రొమాన్సే ఎందుకు, ఇంకేం లేవా రాయడానికి?" అని ఒక ఫ్రెండ్ అడిగిన ప్రశ్నకి ఇదొక క్విక్ ఆన్సర్.) 😎 👆