నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికల్లో పోటీచేయడానికి కాంగ్రెస్ పార్తీ దరఖాస్తులు ఆహ్వానిస్తే, ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్, టీఆరెస్‌ల మీద ఎగిరెగిరిపడి అరచిన నోళ్లు ఇప్పుడు పూర్తిగా మూతబడ్డాయి. మొన్నటిదాకా కాంగ్రెస్‌లో అతిరథమహారథులనుకొన్నవారంతా ఇప్పుడు ఒక్క సీటులో పోటీచేయడానికి ముందుకురాలేకపోవడం అనేది ఆ పార్టీ ఇప్పుడున్న అత్యంత దయనీయ పరిస్థితిని తెలుపుతోంది.
'రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం' అని గప్పాలు కొట్టిన బీజేపీకి పోటీ చేయడానికి అసలు క్యాండిడేట్స్ లేరు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం లేకపోయినా అంతో ఇంతో కామెడీగా శబ్దం చేసిన కోదండరాం పార్టీ అసలు పత్తా లేదు.
ఇక తెలుగుదేశం అనేది తెలంగాణలో ఒక ఒడిశిన కథ.
ఇదీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పరిస్థితి.
దేశంలోని ప్రతి సర్వే ఇదే చెబుతోంది.
మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కుట్రపూరితంగా ఒక చెత్త సర్వే ఇచ్చి అత్యంత దారుణంగా ఎగతాళి కాబడ్ద లగటపాటి, ఇక్కడి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన తన విలువైన సర్వే ఇంకా విడుదల చెయ్యలేదు.
కట్ చేస్తే -
మిత్రపక్షమైన ఎం ఐ ఎం ఒక స్థానం పోగా, మిగిలిన 16 లోక్‌సభ స్థానాల్లో టీఆరెస్‌కు అసలు పోటీలేదు.
ఎంత మెజారిటీ ఎక్కువ సాధించాలి అన్నదే ఇప్పుడు టీఆరెస్ ముందున్న లక్ష్యం.
మరొక గమ్మత్తైన విషయం ఏంటంటే - టీఆరెస్ రేపు సునాయాసంగా గెలవబోతున్న ఈ 16 స్థానాల్లో ప్రతి ఒక్కరు, తాము ఎంత ఎక్కువ మెజారిటీతో గెలుస్తామా, దానికోసం ఏం చెయ్యాలా అన్నదానిమీదే ఫోకస్ చేసి, ఆ దిశలో కృషి చేస్తుండటం!
బహుశా ఇలాంటి వన్‌సైడ్ వార్ ఇంతకు ముందెప్పుడూ దేశంలో జరిగి ఉండదు.
క్రెడిట్ గోస్ టూ కేసీఆర్.
కేటీఆర్ ఇప్పుడు సర్వసైన్యాధిపతి. ఎన్నికల సన్నాహక సభలలో, ఇతర దిశానిర్దేశ సమావేశాల్లో కార్యకర్తలకు ఉత్సాహం ఇస్తూ, వైరి పక్షాలను ఒక ఆట ఆడుకుంటున్నారు.
మన పని 11 ఏప్రిల్‌నాడు వోటు వేయడం, ముందే తెలిసిన ఫలితాలను 23 మేనాడు మీడియాద్వారా తెలుసుకోవడం.
దాదాపు ప్రతిపక్షం అనేది లేకుండా పోయి, ఈ వార్ ఇంత చప్పగా, నల్లేరుమీద నడకలా ఉండటం కూడా కేసీఆర్ వ్యూహరచనంలో ఒక భాగం అని నా ఉద్దేశ్యం.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani