వరల్డ్ #10 సింధుకి, రియో ఒలంపిక్స్ గోల్డ్ మెడల్‌కు మధ్యనున్న ఒకే ఒక వ్యక్తి - కరొలినా మారిన్.
స్పెయిన్‌కు చెందిన ఈ వరల్డ్ #1 బ్యాడ్‌మింటన్ ప్లేయర్ కరొలినాకు "గాళ్ నాడల్" అన్న పేరుందన్న విషయం మనం ఇక్కడ గమనించాలి. (వరల్డ్ #4 స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాడల్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను.)
ఎలాంటి హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఫైనల్‌కు చేరుకున్న సింధు, ఒక్కో మ్యాచ్‌నే లక్ష్యంగా తీసుకుంటుంది. అలా తీసుకునే, ఇప్పుడు ఒలంపిక్స్ ఫైనల్లో వరల్డ్ #1 కరొలినాను ఎదుర్కొనేదాకా వచ్చింది.
ఇప్పుడు సింధు ఆడాల్సింది ఇంక ఒక్క మ్యాచే!
అదీ ఫైనల్ .. కొన్ని గంటల్లో ..
కట్ టూ సింధు నేపథ్యం -
హైద్రాబాద్‌లో పుట్టి పెరిగిన సింధు పేరెంట్స్ గుంటూరు జిల్లా మాచర్లకు చెందినవారు. సింధు తండ్రి రమణ కూడా ప్లేయరే. పైగా అర్జున అవార్డు గ్రహీత కూడా కావడం విశేషం. అయితే, రమణ వాలీబాల్ ప్లేయర్.
"తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి సహకారం, ప్రోత్సాహం లేకుండా సింధు ఒలంపిక్స్‌లో ఈ స్థాయికి చేరుకొనేది కాదు" అని స్వయంగా రమణ గారే టివి9 ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
సింధు కోచ్ పుల్లెల గోపిచంద్.
ప్రపంచస్థాయి చాంపియన్‌షిప్స్‌లో మెడల్ గెల్చుకొన్న మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డ్ ఉన్న సింధు, మొన్న 30 మార్చి 2015 రోజున పద్మశ్రీ అవార్డ్ కూడా అందుకుంది.
"నా లక్ష్యం గోల్డ్. దానికోసం నా మనసంతా పెట్టి ఆడతాను" అంటున్న సింధు తన లక్ష్యం చేరుకోవాలనీ, ఇవాళ ఒలంపిక్స్‌లో గోల్డ్ సాధించాలనీ, నేను మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.
ఆ బంగారు క్షణం కోసం ఎదురుచూస్తున్నాను.
గో సింధూ, గెట్ యువర్ గోల్డ్!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani