ఓకే... ఏదో ఓ సోర్స్ నుంచి మీకు ఓ కోటి రూపాయలు వచ్చాయనుకుందాం. ఆ సోర్స్ లాటరీ కావొచ్చు. ఎవరో ఒక దూరపు చుట్టం ఠపీమని పోవడం ద్వారా కావొచ్చు. ఓ పెద్ద ధనవంతుని ఏకైక కూతుర్ని ఊహించని పరిస్థితుల్లో పెళ్లిచేసుకోవడం ద్వారా కావొచ్చు. లేదంటే "గ్రాఫిక్ ఎఫెక్టు"లో ఆకాశం నుంచి డైరెక్టుగా మీ బెడ్‌రూంలో పడిపోవడం ద్వారా కావొచ్చు.
మొత్తానికి ఓ కోటి రూపాయలు మీ సొంతమయ్యాయి. వాట్ నెక్‌స్ట్? సరదాగా ఓ ఇమాజినేషన్ గేమ్‌లా ఆలోచించి చూడండి. ఏం చేస్తారు?
ముందు ఏవయినా చిన్న చిన్న అప్పులూ, అడ్జెస్టుమెంట్లూ ఉంటే తీర్చేస్తారు. ఓ చిన్న ఫ్లాట్, ఓ చిన్న కారు కొనుక్కోవచ్చు. ఇంట్లో మీ పిల్లలకు ఇష్టమైన హోం థియేటర్ సిస్టమ్, ఫర్నిచర్, మీ జీవిత భాగస్వామికి ఆమె/అతడు ఊహించని ఓ రేంజ్ గిఫ్టులు వగైరా కొనవచ్చు. ఇంకా ఏం చేస్తారు?
మీరొక్కరో, కుటుంబసభ్య్లతోనో, స్నేహితులతోనో మీకు అత్యంత ఇష్టమైన టూరిస్టు స్పాట్స్‌కు వెళ్లి, ఓ నాలుగు రోజులు ఫుల్‌గా ఎంజాయ్ చేసి రావొచ్చు.
మీకు పిల్లలుంటే వాళ్లకి ఇష్టమైన లేటెస్ట్ ఎలెక్ట్రానిక్ గాడ్గెట్స్ కొన్ని కొనివ్వవచ్చు. ముందు జాగ్రత్తగా (అసలదంటూ ఉంటే మీలో!), కొంత డబ్బుని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. మీలో ఏ మూలో ఉన్న సేవాగుణం బయటికి వచ్చి, ఏదో ఓ చారిటీ సంస్థకు కొంత దానం చేయించవచ్చు. ప్రతిరోజూ మీ స్నేహితులతో పార్టీలు కూడా చేసుకోవచ్చు.
ఇలా, మీరు ఏం చేసినా ఒక నెలరోజులవరకే చేయగలరు. ఆ తర్వాత ప్రతీదీ మొహం మొత్తుతుంది. ఇదంతా ఉట్టి బోర్ అవుతుంది. ఆ తర్వాతేంటి?
ఇదే మిలియన్ డాలర్ కొశ్చన్.
మీకు ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు. ఏదీ అడ్డుకాదు. ఎలాంటి పరిమితులు కూడా లేవు. ఇలాంటి మానసిక స్థితిలో మీరు చేపట్టబోయే మొట్టమొదటి అర్థవంతమైన పని ఏంటి?
"ఈ పని చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కాను" అని మీరు కాన్‌ఫిడెంటుగా అనుకొనే ఆ పని ఏంటి? ఏ ఆర్థిక ఇబ్బందులు లేని స్థితిలో మీ సమయాన్ని ఎలా గడుపుతారు? ఏం సాధించాలనుకొంటారు? ఏ రికార్డులు క్రియేట్ చేయాలనుకొంటారు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాల్ని ఒక తెల్ల కాగితంపైన చాలా స్పష్టంగా రాసుకోండి.
ఈ సమాధానాలన్నింటి సారాంశమే రేపటి మీ లక్ష్యం ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani