ఆ మధ్య, నా 'మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్' కాన్సెప్ట్ మీద ప్రత్యేకంగా వేరొక బ్లాగ్‌ని క్రియేట్ చేసి, అందులో కొన్ని పొస్టులు రాశాను. తర్వాత, నా "లెస్ ఫిలాసఫీ" ని అనుసరిస్తూ.. ఒక్క బ్లాగ్‌లోనే ఎన్నయినా రాయొచ్చు. ఏదయినా రాయొచ్చు అని డిసైడ్ అయిపోయి, ఇక ఆ బ్లాగును అలా వదిలేశాను. ఇప్పుడే దాన్ని "అన్ పబ్లిష్" కూడా చేసేశాను.
ఇక, "నగ్నచిత్రం" ఒక్కటే నా బ్లాగ్. నేను ఏం రాసినా దీన్లోనే.
ఇప్పుడు నా మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్ బ్లాగ్ లేదు కాబట్టి, ఆ బ్లాగ్‌లో నేను పంచుకున్న మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన కొన్ని ప్రాధమిక అంశాలతోపాటు, న్యూస్‌నూ, వ్యూస్‌నూ ఇకమీదట ఇదే బ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను.
కట్ టూ మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్ -
ఇప్పుడింక సినిమా ఎవరైనా తీయవచ్చు. ఇదివరకులాగా కోటి, లేదా కోట్ల రూపాయలక్కర లేదు. కొన్ని లక్షలు చాలు. ఇంకా చెప్పాలంటే, కొంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్‌తో కూడిన ఒక చిన్న క్రియేటివ్ టీమ్ చాలు. ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ.. అందరూ అదే టీమ్.
అవును, నమ్మటం కష్టం. కానీ నిజం. ఇప్పుడంతా డిజిటల్ యుగం. ల్యాబ్‌లూ, స్టూడియోలు, ఫిలిం నెగెటివ్‌లూ, ప్రాసెసింగులూ, పడిగాపులూ.. ఆ రోజులు పోయాయి.
కొన్ని లక్షలు చాలు. కేవలం 45 రోజుల్లో ఒక మంచి కమర్షియల్ సినిమా తీయవచ్చు. మరొక 45 రోజుల్లో ఆ సినిమాని ఏ టెన్షన్ లేకుండా రిలీజ్ చేయవచ్చు. మంచి కథ, కథనంతో ప్రేక్షకులను ఒప్పిస్తే చాలు. సినిమాలు ఆడతాయి. లాభం ఊహించనంతగా ఉంటుంది.
2007 లో వచ్చిన "పేరానార్మల్ యాక్టివిటీ" సినిమా ఈ సంచలనానికి నాంది పలికింది. అతి తక్కువ బడ్జెట్లో తీసిన ఆ సినిమా 655,000% రిటర్న్స్ పొందింది! అప్పటినుంచీ మనవాళ్లకు ఎన్ని రకాలుగా చెప్పినా - ఎన్ని ఉదాహరణలు చూపించినా - వినలేదు ఎవ్వరూ. చివరికి ఒక పేరున్న దర్శకుడు చేసి చూపించాకగాని మనవాళ్లకు విషయం అర్థం కాలేదు.
ఇప్పుడిక అంతా అదే దారి. డిజిటల్ ఫిలిం మేకింగ్ -- DSLR ఫిలిం మేకింగ్.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani