దటీజ్ నగ్నచిత్రం!
అయాం ఫుల్లీ ఎడిక్టెడ్ టు బ్లాగింగ్.
నాకు సంబంధించినంతవరకూ - బ్లాగింగ్ అనేది ఒక మెడిటేషన్. ఒక థెరపీ.
చుట్టూ వందమంది ఉన్నా, నేను ఒంటరిగా ఫీలైనప్పుడు, "నేనున్నా నీకోసం" అంటూ నన్ను అక్కున చేర్చుకొనే నా ప్రేయసి.
నా శ్వాస.
నా ఘోష.
కట్ టూ అసలు పాయింట్ -
ప్రస్తుతం నేను చేస్తున్న "నమస్తే హైదరాబాద్" సినిమా పూర్తిచేసి, రిలీజ్ చేసేదాకా ఈ బ్లాగ్ అవసరం కొంతైనా ఉందని నా మిత్రులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా నా టీమ్ ఉవాచ.
వారి లాజిక్కులు వారికున్నాయి.
నేను కాదనలేని లాజిక్కులవి!
సో, ఎలాగైతేనేం ... నా నిర్ణయం మార్చుకొని వెనక్కిరాక తప్పలేదు.
ఇలా వెనక్కి రావడం - మార్కెటింగ్ అవసరాలకోసం, నా అలవాటు కోసం, నాకోసం - ఏదో ఒకటి రాయడం, రాసుకోవడం నాకు చాలా ఆనందమే. కానీ, ఈ జూన్ చివరినుంచే నేను నా కొత్త బ్లాగ్ ఒకటి కొంచెం భారీ సెన్సేషనల్‌గా ప్రారంభించాలనుకొన్నాను. ఆ ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకొన్నాను కూడా.
అయితే, ఇప్పుడా ఆలోచనను కనీసం కొద్దిరోజులయినా వాయిదా వేయక తప్పడంలేదు.
నా కొత్త బ్లాగ్‌ను 4 ఆగస్టు నుంచి ప్రారంభిస్తాను.
అప్పటిదాకా, ఎప్పట్లాగే, ఈ నగ్నచిత్రం ఎంజాయ్ చేస్తుంటాను. విత్ ఆల్ మై లైక్‌మైండెడ్ ...
4 ఆగస్టుకు నేను ప్రారంభించబోతున్న నా కొత్త బ్లాగ్ ఏంటన్నది - దాన్ని లాంచ్ చేయడానికి కొద్దిరోజులముందు చెప్తాను.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani