నా సినిమా ప్రొఫెషన్ కి సంబంధించి నేను క్రియేట్ చేసుకోదల్చిన నెట్ వర్క్ కోసమనే ప్రత్యేకంగా నగ్నచిత్రం బ్లాగ్ ని ముందు ప్రారంభించాను.
ఈ బ్లాగ్ టైటిల్ ని కావాలనే అలా పెట్టాను. నా టార్గెట్ సినిమావాళ్లే కాబట్టి ఈ టైటిల్ ఓకే అనుకున్నాను.
ఒక రకంగా ఇదో మార్కెటింగ్ జిమ్మిక్.
తర్వాత, ఇదే బ్లాగ్ ని నా మెయిన్ బ్లాగ్ గా చేసుకుని అన్నీ దీంట్లోనే రాయటం ప్రారంభించాను.
"చాలా మంది విజిట్ చేస్తున్నారు .. అంతా బానే ఉంది" అని సైట్ విజిట్ మీటర్ చూస్తూ అనుకుంటుండగా ఓ కాల్ వచ్చింది. ఆది నాకు అత్యంత ప్రియమైన నా విద్యార్థి నుంచి. మా మాటల్లో బ్లాగ్ టాపిక్ కూడా వచ్చింది.
సారాంశం ఏంటంటే - అమ్మాయిలు, స్త్రీలు, మగవాళ్లలో కూడా కొందరు అసలు ఈ బ్లాగ్ లింక్ మీద క్లిక్ చేయటానికి కూడా ఇష్టపడటం లేదని!
కారణం - బ్లాగ్ టైటిల్ "నగ్నచిత్రం" కావటం.
నిజానికి ఈ బ్లాగ్ లో అసభ్యకరమైనది ఏదీ లేదు. ఇందులో నేను రాస్తున్న నగ్నత్వం శరీరానికి సంబంధించింది కాదు. హిపోక్రసీ లేని నిజాలు! అయినా సరే, కొందరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అలాగని వాళ్లని తప్పు పట్టాల్సిన పని లేదు. మన కండిషనింగ్ అలాంటిది.
కట్ టూ 2016 -
మళ్ళీ జస్ట్ నిన్న రాత్రే ఒక పాఠకురాలు సింపుల్‌గా ఒకమాటన్నారు: "బ్లాగ్ టైటిల్ మార్చరాదా.." అని! ఇదేమాటను, మొన్ననే మరొక పెద్దాయన తన కామెంట్స్‌లో కాస్త మొహమాటంగా వెలిబుచ్చారు.
ఆలోచించాను.
ఇప్పుడెలాగూ నేనీ బ్లాగ్‌లో ఒక్క సినిమాల గురించే రాయడంలేదు. నాకిష్టమైన ప్రతీదీ రాస్తున్నాను. ఇంకా చాలా రాయబోతున్నాను. నాకున్న ఎన్నో వ్యాపకాల్లో సినిమాలు కేవలం ఒక చిన్న భాగం.
సినిమాలే జీవితం కాదు.
అలాంటప్పుడు ఒక్క సినిమాలకోసం, సినిమాలకు సంబంధించిన ఈ టైటిల్ కోసం, ఎందుకు నేను అనవసరంగా ఓ 25% పాఠకుల్ని పోగొట్టుకోవాలి?
కోటిరూపాయల కొశ్చన్!
టెక్నికల్‌గా కొంత శ్రమే నాకు. ఒక బ్లాగ్‌ను పూర్తిగా ఇంకో బ్లాగ్‌లోకి "ఇంపోర్ట్" చేసుకొని, అంతా మళ్ళీ యథాతథంగా ఉంచడం అనేది.
ఆ పని నెమ్మదిగా చేస్తాను.
ప్రస్తుతానికి యు ఆర్ ఎల్ అదే ఉంటుంది కాని, టైటిల్ ఒక్కటే మార్చేస్తున్నాను, ఇప్పుడే! మిగిలిన టెక్నికల్ పనంతా కొంచెం నెమ్మదిగా చేస్తాను.
ఒక జ్ఞాపకంగా, ఈ బ్లాగ్‌లోని కొన్ని సెలెక్టెడ్ సినిమా బ్లాగ్ పొస్టులతో కొద్దిరోజుల తర్వాత, "నగ్నచిత్రం" పేరుతో ఒక పుస్తకం తప్పక పబ్లిష్ చేస్తాను. ముఖ్యంగా ఈ టైటిల్ మార్చడం ఇష్టంలేని పాఠకులకోసం.
ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి దుమ్మురేపుతున్న ఈ జమానాలో బ్లాగింగ్ అనేది కొంత అవుట్‌డేట్ అయినమాట నిజమే. కానీ, రైటర్స్‌కు ఈ బ్లాగింగ్ ఇచ్చే కిక్కే వేరు. కిక్ విషయం ఎలా ఉన్నా, రాయడం అన్న ఒక మంచి అలవాటును రైటర్స్ మర్చిపోలేరు.
సో, నేను నా బ్లాగింగ్ కంటిన్యూ చేస్తాను.
మరి ఈ బ్లాగ్‌కు ఇప్పుడు కొత్త టైటిల్ ఏంటంటారా?
ఒక రచయిత బ్లాగ్ కి తన పేరుని మించిన మంచి టైటిల్ ఇంకేముంటుంది .. ?! :)

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani