ఏప్రిల్ లో నేను ప్రారంభించబోతున్న యూత్ చిత్రం కోసం - ముంబైలో ఉన్న నా కోఆర్డినేటర్ మిత్రుడి సహాయంతో ఆల్రెడీ ముగ్గురు అమ్మాయిల్ని షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకోవటం జరిగింది. కానీ, ఎంత కమర్షియల్ చిత్రమయినప్పటికీ, కొన్ని సాంకేతికపరమయిన కారణాలు / ఇబ్బందుల వల్ల, ఇప్పుడు ఖచ్చితంగా తెలుగు అమ్మాయిలనే హీరోయిన్స్ గా పరిచయం చేయాలనుకుంటున్నాను.
ఈ మధ్యనే నేను పూర్తి చేసిన ఒక చిత్రం లోని హీరోయిన్ ముంబై నుంచి వచ్చిన అమ్మాయే. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యాక, కొన్ని కారణాలవల్ల ప్రొడ్యూసర్ పాటల్ని షూట్ చేయటం ఆలస్యం చేశాడు. అప్పటివరకూ దాదాపు ప్రతి రోజూ టచ్ లో ఉన్న ఆ హీరోయిన్ ఉన్నట్టుండి మాయమైపోయింది!
ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లిందో ఎవ్వరికీ తెలియదు. వాళ్ల పేరెంట్స్‌కి కూడా!
మా వాళ్లు ఆరా తీయగా, తీయగా ఆ అమ్మాయి ఫ్రెండ్స్ లో ఒకరి ద్వారా తెల్సింది ఏంటంటే... ఆ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో న్యూజిలాండ్ వెళ్లిపోయిందని! ఆ చిన్న సమాచారం తప్ప, ఇంక ఎలాంటి కాంటాక్టు లేదు. చివరికి ఆ హీరోయిన్ పేరెంట్స్‌కి కూడా ఈ విషయం మా సినిమావాళ్ల ద్వారానే తెలిసింది. అదీ పరిస్థితి.
అయితే - ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఊహించని సమస్యలు ఇంకెన్నో ఉంటాయి. ఇప్పుడు నేను ప్రారంభించబోతున్న మైక్రోబడ్జెట్ సినిమాకి ఈ తంటాలు వద్దంటే వద్దనుకుంటున్నాను.
ఇదివరకులాగా కాకుండా - ఇప్పుడు హైదరాబాద్ అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పేరెంట్స్ నుంచి కూడా ప్రోత్సాహం ఉంటోంది. "ఛీ, సినిమాల్లోకా?!" వంటి చెత్త ఎక్స్‌ప్రెషన్ నుంచి... "వావ్! సినిమాల్లోకే!!" లాంటి పాజిటివ్ ఎక్స్‌ప్రెషన్ రేంజ్ కి వచ్చింది పరిస్థితి.
అంతే కాదు. ఇటీవల వచ్చిన కొన్ని హిట్ యూత్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లంతా కూడా తెలుగు అమ్మాయిలే కావటం ఒక మంచి పరిణామం. సో, ఏప్రిల్లో నేను షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ యూత్ చిత్రంలో కూడా తెలుగమ్మాయిలే హీరోయిన్లుగా ఉంటారు...
***
(ఆసక్తి ఉన్న తెలుగు అమ్మాయిలు, నా ఫేస్‌బుక్ పేజ్ లో మెసేజ్ పెట్టడం ద్వారా నన్ను డైరెక్టుగా కాంటాక్టు కావచ్చు.)
www.facebook.com/onemano
Email: mchimmani@gmail.com
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani