ఈ టైటిల్‌తో ఇంగ్లిష్‌లో ఒక మంచి బుక్ కూడా ఉంది.ఫిలిప్ కేబుల్ రాశాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవ్వొచ్చు...
కట్ చేస్తే -
ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ దగ్గర ఎప్పుడూ కనీసం ఒక డజన్ మంది రైటర్స్-డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. మన టర్న్ రావడానికి చాలా టైమ్ పడుతుంది. అసలు రాకపోవచ్చు కూడా.
ఫిలిం కెరీర్లో గ్యాప్ అనేది అలాంటి గ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది. ఫెయిల్యూర్ కాదు.
తాజాగా ఒక చిన్న హిట్ ఇచ్చినా, కొంచెం 'బజ్'లో ఉన్నా మళ్ళీ పరిస్థితి వెంటనే మారిపోతుంది.
అది వేరే విషయం.
సో, ఇలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి, పైన చెప్పిన సర్కిల్‌కు బయట ఎవరైనా సినిమా చేయాలనుకుంటే - కొత్తగా ఎవరి ప్రొడ్యూసర్స్‌ను వాళ్లే క్రియేట్ చేసుకోవాలి.
దీన్నే 'ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్' అనొచ్చు మనం.
కట్ చేస్తే -
మారిన కార్పొరేట్ ఫిలిం బిజినెస్ కండిషన్స్‌లో, బడ్జెట్ అనేది అసలు సమస్య కానే కాదు. చిన్న బడ్జెట్లో అయినా - మంచి కంటెంట్‌తో, బిజినెస్ అవగాహనతో సినిమా తీస్తే అసలు నష్టం ఉండదు.
థియేటర్ బిజినెస్, ఓటీటీ రైట్స్, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్ వంటి ఎన్నో ఆదాయ మార్గాల నుంచి భారీ ప్రాఫిట్స్ ఉంటాయి.
ఓవర్‌నైట్‌లో కావల్సినంత ప్రమోషన్. సెలబ్రిటీలతో మీటింగ్స్, పార్టీలు... నిజంగా అది వేరే లోకం.
మారిన బిజినెస్ కండిషన్స్‌లో, సినిమాల్లో ఇన్వెస్ట్ చెయ్యడం కూడా మంచి ఇన్వెస్ట్‌మెంటే. సినీ ఫీల్డు మీద, సినిమాల్లో ఇన్వెస్ట్మెంట్ మీద నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్నవారు తప్ప ఎవరైనా సినిమాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. భారీగా బిగ్ మనీ సంపాదించొచ్చు.
ఒక ఫిలిం ఇన్వెస్టర్‌గా, ఇంకెన్నో ఇతర బిగ్ బిజినెస్ మాగ్నెట్స్ కాంటాక్ట్స్ సంపాదించుకోవచ్చు.
సోషలైజింగ్, పార్టీలు, గ్లిట్టరాటి... ఇవన్నీ మామూలే. ఇంకా, మీ జీవితంలో ఊహించని వ్యక్తులను కలుస్తుంటారు. మీరెన్నడూ కలగనని వ్యక్తులతో పార్టీల్లో పాల్గొంటారు.
ప్రపంచంలో ఏ బిజినెస్‌ను తీసుకున్నా సక్సెస్ రేట్ 10 శాతం మించదు. సినిమా కూడా అంతే. సినిమా ఫీల్డు పట్ల నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు ఇలాంటి స్టాటిస్టిక్స్ ఒప్పుకోడానికి ఈగో అడ్డొస్తుంది. అలాంటివారి గురించి మనకు సమస్య లేదు. ఎందుకంటే వాళ్లని అసలు మనం పట్టించుకోం.
కొంతమంది సినిమాల్లో ఒకవైపు కోట్లు సంపాదిస్తూనే, కొత్తగా సినిమా తీయాలని వచ్చేవాళ్లను డిస్కరేజ్ చేస్తుంటారు. అదొక సైకలాజికల్ టెక్నిక్ అని వాళ్ళకి వాళ్లే ఫీలవుతుంటారు. అలాంటివాళ్ళను కూడా మనం పట్టించుకోం.
హిట్, ఫట్లతో సంబంధం లేకుండా, ఒక మంచి అవగాహనతో సినిమా తీయగలిగితే చాలు. ఎలాంటి నష్టం ఉండదు.
జీరో రిస్క్!
ఇప్పుడు ఫిలిం బిజినెస్ అలాంటి కార్పొరేట్ స్థాయికి ఎదిగింది. ఇది చాలామందికి తెలియదు. తెలుసుకోవాలనుకోరు. అలాంటి మోరన్స్ గురించి కూడా మనకు అవసరం లేదు.
కట్ చేస్తే -
జీరో రిస్క్!
ఇప్పుడు ఫిలిం బిజినెస్ అలాంటి కార్పొరేట్ స్థాయికి ఎదిగింది. ఇది చాలామందికి తెలియదు. తెలుసుకోవాలనుకోరు. అలాంటి మోరన్స్ గురించి కూడా మనకు అవసరం లేదు.
కట్ చేస్తే -
ఇంతకుముందులా నేను మరీ చిన్న బడ్జెట్ సినిమాలను చేయాలనుకోవటం లేదు. ఆ స్టేజీని ఎప్పుడో అధిగమించాను. ఒక్క సినిమా చేసినా, దాని మినిమం హిట్ రేంజ్ ఒక 200 కోట్లుండాలి.
Interested?
Interested?
See you in my office...
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
Good thinking. All the very best.
ReplyDeleteThank you !!
Deleteచిన్న బడ్జెట్ సినిమాలకు కూడా హిట్ రేంజ్ ఒక 200 కోట్లుండే అవకాశం ఉంది కదండీ. ఈమధ్యకాలంలో మనం చాలా లో ప్రొఫైల్ సినిమాలు నామమాత్రపు బడ్జెట్ సహాయంతో ఆట్టే అంచనాలు లేకుండా విడుదలై బ్రహ్మాండమైన విజయాలు సాధించాయి - పేరు, డబ్బూ రెండూ సంపాదించాయి కదా. మంచి కంటెంట్‌తో, బిజినెస్ అవగాహనతో సినిమా తీస్తే అసలు నష్టం ఉండదు అని మీరే అన్నారు. మీరు మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను.
ReplyDeleteThank you.
Delete