నా పాత బ్లాగ్ పోస్టులను ఒక్క నిమిషం అలా బ్రౌజ్ చేస్తోంటే ఇది కనిపించింది:
"Research shows that the more a boy misbehaves in school, the more likely he is to earn a lot of money as an adult!"
నా దృష్టిలో ఇదేదో ఉత్తుత్తి స్టేట్‌మెంట్ కాదు.
నా అనుభవంలో నేను కూడా చూసిన ఒక సత్యం.
దీనికి అనుబంధంగా మరికొన్ని నిజాలు కూడా నేను చెప్పగలను, ఎలాంటి హిపోక్రసీ లేకుండా.
> రోడ్డుమీద వెళ్తూ కనిపించిన ప్రతి రాయికీ, రప్పకూ విచిత్రంగా అలా దండం పెట్టుకుంటూ వెళ్తుంటారు కొంతమంది. అది తప్పు అనటంలేదు. కానీ, వీరి వ్యవహారశైలిగానీ, భాషగానీ అవతలివారికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ కేటగిరీకి చెందిన చాలామంది నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా తెలుసు. వీళ్లల్లో చాలామందికి కాగితం పైన పెన్నుపెట్టి రాయటం రాదు. కానీ వీరందరి దగ్గర డబ్బు పిచ్చిగా ఉంటుంది. పిచ్చిపిచ్చిగా సంపాదిస్తారు!
> అంతర్జాతీయంగా వివిధరంగాల్లో అత్యుత్తమ స్థాయి విజయాల్నిసాధించి బిలియనేర్లు అయినవారిలో 96 శాతం మంది చదువులో గుండు సున్నాలే. లేదా స్కూల్, కాలేజ్ స్థాయిలో "డ్రాప్ అవుట్"లే!
> సినీ ఫీల్డులో కూడా అంతే. అత్యున్నతస్థాయి విజయాలు సాధించి కోట్లు సంపాదించుకున్న ఆర్టిస్టులూ, టెక్నీషియన్లలో అత్యధికభాగం మంది చదువుకు పంగనామాలు పెట్టినవాళ్లే!
కట్ టూ నీతి -
1. చదువుకోనివాడి లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. మొండిగా ఆ ఒక్కదాని గురించే కష్టపడి సాధిస్తాడు.
2. చదువుకున్నవాడికి పది లక్ష్యాలుంటాయి. పది పడవలమీద కాళ్లు పెడతాడు. ఏ ఒక్కటీ సాధించలేడు.
3. చదువుకు, సంపాదనకు అస్సలు సంబంధం లేదు. "నాకేం కావాలి? నేనెంత సంపాదించాలి? దానికోసం నేనేం చేయాలి?" అన్న వెరీ సింపుల్ 'ఫినాన్షియల్ ఇంటలిజెన్స్' చాలు.
పై 1, 2, 3 లను చాలా ఆలస్యంగా రియలైజ్ కావడమంత దురదృష్టం ఇంకొకటి లేదు.
ఇప్పుడు, రియలైజ్ అయిన మరుక్షణం నుంచైనా, వొళ్లు దగ్గరపెట్టుకొని, "మనమేం చేస్తున్నాం, మనకేం కావాలి" అన్న విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటే చాలు.
ఫలితాలు అవే ఫాలో అవుతాయి.
డబ్బు కూడా.

బట్, నో వర్రీ ...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani