ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్న 90 శాతం సినిమాల నిండా కత్తులు, కొడవళ్ళు, గన్స్, ఇంకా కొత్త కొత్త రకాల మారణాయుధాలతో నిజంగా రక్తాన్ని ఏరులు పారిస్తున్నారు. సర్ర్... సర్ర్ మని నరికి పోగులు పెడుతున్న శబ్దాలతో సినిమా హాల్స్ షేక్ అయిపోతున్నాయి.
ఒక్క థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీల్లో కూడా ఈ బ్లడ్‌షెడ్ క్రైమ్ సినిమాలకే వ్యూయర్‌షిప్ ఎక్కువగా ఉంటోంది.
హీరోలు, డైరెక్టర్స్ వారి ఒక్కో సినిమాకు ఈ బ్లడ్‌షెడ్ లెవల్స్‌ని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ఆఖరికి ఇలాంటి సినిమాలు తీసే పోటీ ఎక్కడిదాకా వెళ్ళిందంటే - ఇలాంటి రక్తప్రవాహపు సీన్లల్లో రోజుల పసికందును కూడా చంపడానికి పెట్టి తమాషా చూసే సైకిక్ మైండ్‌సెట్ లెవెల్ దాకా!
ఇలాంటి రక్తపాతం లేని సినిమాల్ని ప్రేక్షకులు తిప్పికొడుతుండటం ఆశ్చర్యం.
ఈమధ్యనే వచ్చిన ఒక సూపర్ నీట్ సినిమాలో కూడా "ప్రొడ్యూసర్-డిస్ట్రిబ్యూటర్స్-బిజినెస్" అవసరాల దృష్ట్యానో, లేదంటే "నేనూ రక్తం ఏరులు పారించగలను" అన్నది చెప్పడానికో గాని, ఆ సినిమాలో కూడా ఒక సీన్లో నరకడాలు, రక్తాలు బాగానే చొప్పించగలిగాడు డైరెక్టర్.
ఆ సినిమా కూడా హిట్ అయింది.
ఇష్టం ఉన్నా లేకపోయినా డైరెక్టర్స్ అందరికీ ఇప్పుడిదే ట్రెండ్.
ట్రెండ్ ఫాలో కాకపోతే వచ్చిన అవకాశం పోతుందన్న భయం! డైరెక్టర్‌గా వెనకబడిపోతున్నా అనుకుంటారేమోనన్న భయం!
గమనించారో లేదో... ఇలాంటి సినిమాల ప్రభావం సమాజంలో చాలా ప్రస్పుటంగా కనిపిస్తోంది. లెక్కలేనన్ని మర్డర్ వారలు రోజూ చూస్తున్నాం. భార్యని భర్త, భర్తని భార్య, తల్లిని కూతురు, తండ్రిని కొడుకు... ఇలా చాలా సింపుల్‌గా చంపేసుకుంటున్నారు. అంతకుముందు ఇవి లేవని కాదు. కాని వీటి సంఖ్య, వేగం ఇప్పుడు చాలా చాలా పెరిగింది.
సినిమాల వల్ల ప్రయోజనం లేదని ఎవరంటారు?

కట్ చేస్తే -
ఈ రక్తప్రవాహాల సినిమాలు ఇంకా చాలా చాలా రావాలి అని నా ఉద్దేశ్యం. అలాంటి సినిమాలను చూసీ చూసీ ప్రేక్షకులకు విసుగొస్తుంది. మొహం మొత్తుతుంది. బోర్ కొడుతుంది.
ఈ రక్తప్రవాహాల సినిమాలు ఇంకా చాలా చాలా రావాలి అని నా ఉద్దేశ్యం. అలాంటి సినిమాలను చూసీ చూసీ ప్రేక్షకులకు విసుగొస్తుంది. మొహం మొత్తుతుంది. బోర్ కొడుతుంది.
అప్పుడు మళ్ళీ కొత్తగా ఫీల్ గుడ్ సినిమాలు, ప్రేమకథలు వరుసపెట్టి రావడం మొదలవుతుంది. ప్రేక్షకులకు కాస్త మామూలు మనుషులవుతారు.
కొత్తవాళ్లతో తీసిన హిందీ సినిమా "సయ్యారా" కేవలం మూడురోజుల్లో 99 కోట్ల కలెక్షన్ చేయడం - రాబోతున్న ప్రేమకథల, ఫీల్ గుడ్ సినిమాల పాజిటివ్ ప్రవాహానికి నాంది అనిపిస్తుంది నాకు.
- మనోహర్ చిమ్మని
100 Days. 100 Posts. 98/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani