Sunday, 20 July 2025

మిలియనేర్ కావడం ఎలా?


ఇదేం థర్డ్‌గ్రేడ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ కాదు. నాకు నేను వేసుకొన్న ప్రశ్న. నాకు సమాధానం తెలిసిన ప్రశ్న. 

కట్ చేస్తే -

ఈ భూమ్మీదున్న జనాభాలోని ప్రతి 140 మందిలో ఒక మిలియనేర్ ఉన్నారట! ఇక్కడ మిలియనేర్ అంటే, అమెరికన్ డాలర్స్‌లో మిలియనేర్. 

అంటే, ఈరోజు లెక్కప్రకారం, సుమారు 8.6 కోట్లు. 

గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ఆధారంగా, నోమాడ్ కాపిటలిస్ట్ వంటి సోర్సులు చెప్తున్న ఈ న్యూస్ ఐటమ్ చదివాక, నాకు నిజంగా సిగ్గేసింది. 

ఇదేం లక్షల్లో కాంపిటీషన్ కాదు. జస్ట్ ఒక 140 మందిలో నేనూ ఒక మిలియనేర్ కావాలని ఇప్పటిదాకా ఎందుకు అనుకోలేదు? అలాంటి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఎందుకని చెయ్యలేకపోయాను? కనీసం ఇప్పుడైనా అవ్వాలనుకుంటున్నానా?  

కట్ చేస్తే - 

"నీ దగ్గర ఎంత డబ్బున్నా, నీకు ఎన్ని ఆస్తులున్నా, నువ్వు చచ్చిపోయేలోపు అందులో నువ్వు ఎంత ఖర్చుపెట్టగలిగావన్నది నీ అసలు వాల్యూ. అలా చేయలేనప్పుడు నీకూ, డబ్బులేనివాడికీ పెద్ద తేడా లేదు" అంటాడు రామ్‌గోపాల్ వర్మ. 

ఇది అందరికీ నచ్చకపోవచ్చు. కాని, ఇదే లాజిక్. 

డబ్బు సంపాదించడం వెనుక ఎవరి ఉద్దేశ్యం ఏంటన్నది వారి వ్యక్తిగతం. కాని, సంపాదించడం అనేది మాత్రం ఎవరికైనా తప్పనిసరి. 

ఒకటి వదిలేస్తే నేనూ మిలియనేర్ కావడం పెద్ద కష్టం కాదు. ఆ ఒక్కటి ఎప్పుడు వదిలేస్తానన్నదే నన్ను ఎప్పటికప్పుడు ఆడిస్తున్న చిక్కు ప్రశ్న. 

Money isn’t everything — but without it, your freedom stays a prisoner. Earn with purpose, spend with soul.

- మనోహర్ చిమ్మని

100 Days, 100 Posts. 92/100.    

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani