Wednesday, 13 August 2025

ఆగిపోతే అది ప్రవాహం కాదు


ఒక సుదీర్ఘ అధ్యాయానికి సంపూర్ణంగా తెర దించేశాను.

ఒకటీ అరా కమిట్మెంట్లు, ఒప్పుకొన్న రెండు ప్రాజెక్టుల్ని వీలైనంత త్వరగా పూర్తిచేయడం/చేయించడం ఒక్కటే మిగిలింది. దాని ట్రాక్‌లో అది ఎలాగూ అయిపోతుంది. 

కట్ చేస్తే - 

జీవితం డల్‌గా ఉండకూడదు...కారణం ఏదైనా కానీ. 

ఒక ప్రవాహంలా ఎప్పుడూ జుమ్మంటూ సాగిపోతూ ఉండాలి. దారిలో ఎన్నెన్నో రాళ్ళూరప్పలూ తగుల్తుంటాయి. ప్రవాహం ఆగదు. వాటి పక్కనుంచో, వాటిని ఎగిరి దూకేస్తూనో ప్రవహిస్తూనే ఉంటుంది. ఎక్కడా చతికిలపడదు. ఆగిపోదు. ఆగిపోతే అది ప్రవాహం కాదు.

జీవితం కూడా అంతే. ఒక ప్రవాహంలా సాగిపోతుండాలి తప్ప, ఎక్కడా ఆగిపోవద్దు. నిశ్చేతనంగా నిలబడిపోవద్దు. 

మన వెంటపడినా మనం వద్దనుకున్నవి, మనకు ఆనందాన్నిచ్చినా మనం పట్టించుకోనివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు దేన్నీ వదలొద్దు.   

జీవితం చాలా చిన్నది. దాన్ని వృధా చేయడమంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. 

Live life to the fullest—love deeply, laugh often, explore endlessly, and leave no room for regrets.

- మనోహర్ చిమ్మని  

Friday, 8 August 2025

బిల్డప్పులు తక్కువ, కంటెంట్ ఎక్కువ... అదే మలయాళం సినిమా!


మలయాళం సినిమా అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది నా హైస్కూలు రోజులు. అప్పట్లో మా వరంగల్ రామా టాకీస్‌లో, నవీన్ టాకీస్‌లో, కాకతీయ 35 ఎం ఎంలో మలయాళం డబ్బింగ్ సినిమాలు మార్నింగ్ షోలు పడేవి.

"ఆమె మధుర రాత్రులు", "సత్రంలో ఒక రాత్రి"... ఇలా ఉండేవి ఆ సినిమాల టైటిల్స్. అవన్నీ "ఏ" సర్టిఫికేట్ సినిమాలు. 

ఎక్కడో ఒకటీ అరా బోల్డ్ సీన్లుండేవి. కొన్నిట్లో నిండా కప్పుకుని వెట్ అయ్యే సీన్లుండేవి. వాటికే హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్‌తో తెగ ఎగ్జయిట్ అయ్యేవాళ్ళు ప్రేక్షకులు. నేను కూడా.

అయితే - ప్రతి సినిమాలో కథ మాత్రం చాలా బాగుండేది. 

అలా ఒకటీ అరా బోల్డ్ సీనో, వెట్ సీనో ఉండే అప్పటి మలయాళం సినిమాలను మన డబ్బింగ్ నిర్మాతలు ఎగబడి కొన్నుక్కొని అప్పట్లో మంచి బిజినెస్ చేశారన్నమాట!    

అప్పటి మలయాళం సినిమాల్లో నాకు బాగా గుర్తున్న ఒకే ఒక్క డైరెక్టర్ పేరు - ఐ వి శశి. ఒక్క మలయాళంలోనే సుమారు 110 సినిమాలు డైరెక్ట్ చేశారు శశి. హీరోయిన్ సీమ అప్పట్లో ఈయన దర్శకత్వలో దాదాపు ఒక 30 సినిమాల్లో నటించింది. తర్వాత వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నారని చదివాను. 

కట్ చేస్తే -

అప్పటికీ ఇప్పటికీ కంటెంట్ విషయంలో మలయాళం సినిమా మారలేదు. 

దీనికి ప్రధాన కారణాలు రెండు:

1. మలయాళ చిత్ర పరిశ్రమ బిజినెస్ పరిథి చాలా చిన్నది. ఎక్కువ బడ్జెట్లు వర్కవుట్ కావు. ఈ నేపథ్యంలో - తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ క్రియేటివిటీ కోసం తపన ఉంటుంది. అదే అక్కడ వర్కవుట్ అయింది, అదే ఇప్పటికీ కొనసాగుతోంది. 

2. మలయాళంలో అత్యధికశాతం మంది కవులు, రచయితలు, ఫిలిం మేకర్స్, ఇతర క్రియేటివ్ రంగాల వారంతా (అప్పట్లో ఎక్కువగా, కొంతవరకు ఇప్పుడు కూడా) కమ్యూనిజం భావజాలం నేపథ్యం ఉన్నవారే. అనవసర భారీతనం, బిల్డప్పులు వంటివాటిని ఈ నేపథ్యం పట్టించుకోదు, ఇష్టపడదు. ఈ ఆలోచనావిధానమే ఎక్కువ శాతం మలయాళ సినిమాల్లో సహజత్వానికి కారణమైంది. ఇప్పటికీ ఈ సహజత్వమే పునాదిగా మలయాళ సినిమా కొనసాగుతోంది.

మొన్నొక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మన తెలుగు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫాక్టరీ) ఒక విషయం బాగా చెప్పారు - మళయాళంలో కోటిరూపాయల్లో బాగా తీయగలిగిన సినిమా మన తెలుగులో తీసేటప్పటికి కనీసం 5 నుంచి 15-20 కోట్లు అవుందని! విశ్వ చెప్పిన మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

అక్కడి టోటల్ సినిమా బడ్జెట్ ఇక్కడ హీరో రెమ్యూనరేషన్‌కు కూడా సరిపోదు. కథ ఏదైనా కానీ - ప్రతి షాట్‌లో, ప్రతి సీన్లో మనవాళ్లకు భారీతనం కావాలి. బిల్డప్పులు కావాలి. అలవాటైన ప్రాణాలు. అవి లేకపోతే ప్రేక్షకులు తిప్పికొడతారని భయం. ఇక బడ్జెట్ 20 కోట్లో, 30 కోట్లో ఎందుక్కాదు? 

దీనికి లేటెస్ట్ ఉదాహరణ - ఆమధ్య వచ్చిన మలయాళం "ప్రేమలు" సినిమా. కేరళ నుంచి మొత్తం టీమ్ వచ్చి హైద్రాబాద్‌లో 2 ఫ్లాట్స్‌లో ఉండి, సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని వెళ్లారు. అంతా కొత్తవాళ్లే. (ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్స్‌లో ఒకరు.) 

ఈ సినిమా మొత్తం బడ్జెట్ 3 కోట్ల లోపే. 
136 కోట్లు వసూలు చేసింది. 

ఇదే సినిమాను కొనుక్కొని మనవాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా సక్సెస్ అయింది.   

అయితే - ఇదే కథను తెలుగులో తీస్తే మనవాళ్ళు కనీసం ఒక 20 కోట్లు ఖచ్చితంగా ఖర్చుచేస్తారని ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలు చూస్తున్న సగటు తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా చెప్తాడు. 

Creativity speaks from the soul, business speaks from the mind. Merging the two with balance is rare—and that’s what makes it powerful.

- మనోహర్ చిమ్మని 

Thursday, 7 August 2025

చిన్న సినిమా ఎందుకు ఆగిపోతుంది?


రాయాలంటే భారతం అవుతుంది కాని, క్లుప్తంగా ఒకటి రెండు పాయింట్స్‌లో చెప్పే ప్రయత్నం చేస్తాను...

ఆర్టిస్టులు, టెక్నీషియన్లను బుక్ చేసుకునేటప్పుడు చాలా స్పష్టంగా మేమివ్వగలిగిన పేమెంట్ గురించి చెప్పి ఒప్పించుకొంటాం. అదనంగా ఒక్క పైసా ఇవ్వటం సాధ్యం కాదు, అన్నీ అందులోనే అని చెప్తాం. ఓకే అంటారు.

ఒక రెండురోజుల షూటింగ్ తర్వాత "కన్వేయన్స్ కావాలి" అని, "ఇంకో అసిస్టెంట్ కావాలి", "ఇది కావాలి, అది కావాలి" అని ఎలాంటి సంకోచం లేకుండా, చాలా నిర్దయగా ఒక్కోటి మొదలవుతుంది.

సినిమా మధ్యలో ఆపలేం. ఒక్కోటీ ఒప్పుకోవాల్సి వచ్చేలా సిచువేషన్స్ క్రియేట్ అవుతాయి.  

బడ్జెట్ కనీసం ఒక 30 శాతం పెరుగుతుంది. 

సినిమా అదే ఆగిపోతుంది. 

ప్రొడ్యూసర్, డైరెక్టర్‌లకు తప్ప దాదాపు ఏ ఒక్కరికీ కొంచెం కూడా పెయిన్ ఉండదు. కర్టెసీకి కూడా మళ్ళీ ఆ ప్రొడ్యూసర్-డైరెక్టర్స్ వైపుకి చూడరు. కనీసం హాయ్ చెప్పరు. 

నేను జస్ట్ శాంపిల్‌గా ఒక చిన్న అంశం చెప్పాను. దీన్నిబట్టి టోటల్ సినిమా అర్థం చేసుకోవచ్చు.       

కట్ చేస్తే - 

అసలు 30 కోట్ల నుంచి 300 కోట్లు, 1000 కోట్లు ఖర్చుపెట్టే భారీ బడ్జెట్ సినిమాల్లో పనిచేసే సిబ్బందికి ఇచ్చే యూనియన్ వేతనాన్ని, కేవలం కోటి నుంచి 4, 5 కోట్ల లోపు చిన్న బడ్జెట్లో చేసే ఇండిపెండెంట్ సినిమాల్లో కూడా ఎలా ఇవ్వగలుగుతారు? ఎలా అడగగలుగుతారు? 

అసలు యూనియన్‌తో సంబంధం లేకుండా, పనిచేయడానికి ఎందరో పనిలేకుండా ఉన్నారు. అలాంటివారికి అవకాశం ఇచ్చి పనిచేయించుకొంటే 30 శాతం బడ్జెట్ తగ్గుతుంది. ఉన్నంతలో మరింత నాణ్యంగా సినిమా చేయడానికి వీలవుతుంది. 

ఇలా రాశానని నేను యూనియన్స్‌కు, సిబ్బందికి వ్యతిరేకం కాదు. కాని, బడ్జెట్ లేని చిన్న సినిమాలనూ, వందల కోట్ల బడ్జెట్ ఉండే పెద్ద సినిమాలనూ ఒకే విధంగా ట్రీట్ చేయడం వల్ల చిన్న సినిమాలు భారీగా నష్టపోతున్నాయన్నది గుర్తించాలి. 

కట్ చేస్తే - 

ఏదో సినిమా తీయాలన్న ప్యాషన్‌తో ఎవరో ఒకరు, లేదా ఓ నలుగురయిదుగురు లైక్-మైండెడ్ వ్యక్తులు కొన్ని డబ్బులు పూల్ చేసుకొని సినిమా చేస్తున్నప్పుడు - వాళ్ళకి ఇష్టమైన టీమ్‌తో వాళ్ళు స్వతంత్రంగా సినిమా చేసుకోగలగాలి.

మీరు ఫలానా క్రాఫ్ట్‌లో "ఖచ్చితంగా యూనియన్ వాళ్లనే తీసుకోవాలని" రూల్స్ పెట్టడం, అలా తీసుకోలేనప్పుడు యూనియన్ వాళ్ళు మధ్యలో వచ్చి సినిమా షూటింగ్స్ ఆపడం ఎంతవరకు సమంజసం? 

చిన్న సినిమాల విషయంలో - ఆల్రెడీ ఇలాంటి లాజిక్ లేని రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఇక మీదట అసలు ఈ రూల్స్‌ను ఎవ్వరూ పాటించరు, పట్టించుకోరు. 

Independent filmmaking is pure freedom — no rules, no brules, just raw vision unleashed. 

- మనోహర్ చిమ్మని

*** 
(మలయాళంలో కోటిరూపాయల్లో తయారవుతున్న అద్భుతమైన సినిమాల్లాంటివి తెలుగులో చేయడానికి 5 నుంచి 30 కోట్లు ఎందుకవుతున్నాయి? రేపు... ఇక్కడే.)   

Tuesday, 5 August 2025

నాకొక బలహీనత ఉంది...


ఏదైనా ఒక కొత్త ఆలోచన నాలో మెరిసి, నన్ను ఇన్‌స్పయిర్ చేసినప్పుడు, దానికి వెంటనే పెద్దగా డబ్బు కూడా అవసరం లేదు అనుకుంటే, దాన్ని నేను వెంటనే అమల్లో పెడతాను. 

అలాంటి ఒక కొత్త ఆలోచనతో, ఒక కొత్త ప్రయోగాత్మక ప్రాజెక్టు కోసం కంటెంట్ రాయడం పూర్తిచేశా ఇప్పుడే. 

పెద్ద స్ట్రెస్-బస్టర్. 

కట్ చేస్తే -  

అనుకున్న స్థాయిలో ఈ పని పూర్తిచేయగలిగితే, ఇది నేననుకున్న ఫలితాన్నిస్తుంది. 

ఈరోజు నుంచి ఒక రెండు వారాలు బాగా కష్టపడాల్సి ఉంది. 

If creatives don’t shake up their routine, they risk fading into it. Do something wildly different—where the magic and madness live.

- మనోహర్ చిమ్మని 

Saturday, 2 August 2025

మనోహర్ చిమ్మని "కోపరేటివ్ ఫిలిం మేకింగ్ క్లబ్!" - 2


మనోహర్ చిమ్మని "కోపరేటివ్ ఫిలిం మేకింగ్ క్లబ్" బేసిక్ బెనిఫిట్స్, రూల్స్, రెగ్యులేషన్స్: 

> అందరిలోనూ టాలెంట్ తప్పకుండా ఉంటుంది. అయితే - మా స్క్రిప్టులో, మా సెటప్‌కు సూటయ్యే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ను మాత్రమే మేం మా ప్రాజెక్టుల్లోకి తీసుకుంటాం. 

> మేమిచ్చే అవకాశమే మీకు పెద్ద రెమ్యూనరేషన్. సో, మేం మీకు రెమ్యూనరేషన్ ఇవ్వము. మీరు మాకు ఒక్క రూపాయి ఇవ్వొద్దు. ఈ విషయంలో రిటెన్ అగ్రిమెంట్ ఉంటుంది. 

> పక్కా కమర్షియల్ సినిమా తీస్తాం, బాగా ప్రమోట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. అది మా లక్ష్యం, మాహెడ్దేక్. అందులో ఎలాంటి సందేహం లేదు. 

> టాలెంట్ ఉన్నవారికి మేం చేసే వెబ్ సీరీస్‌లు, మ్యూజిక్ వీడియోస్, కమర్షియల్ యాడ్స్, డాక్యుమెంటరీస్ మొదలైనవాటిల్లో కూడా అవకాశం రావచ్చు. 

> ఈ క్లబ్ ద్వారా మాతో కలిసి మీరు ఏం చేసినా, అది ఇండస్ట్రీలో మీ తర్వాతి బెటర్ అపార్చునిటీస్‌కు లాంచ్‌ప్యాడ్ కావచ్చు.   

> ఫిలిం ప్రొడక్షన్లో మా ప్రొడ్యూసర్స్‌తో అసోసియేట్ కావాలనుకొనే చిన్న ఇన్వెస్టర్స్ కూడా క్లబ్‌లో చేరొచ్చు. మా ప్రొడ్యూసర్స్‌తో రిటెన్ అగ్రిమెంట్ ఉంటుంది. ప్రొడక్షన్లో మీరు దగ్గరుండి అన్నీ చూసుకోవచ్చు. 

> క్లబ్ మెంబర్స్ అందరికి ఒక ప్రయివేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. కోపరేటివ్ ఫిలిం మేకింగ్, ఫిలిం మేకింగ్ అంశాలపైన ఇంకొకరిని ఇబ్బందిపెట్టకుండా మీ ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు. సమిష్టిగా మీకు మీరే కొత్త అవకాశాలను క్రియేట్ చేసుకోవచ్చు.  

కట్ చేస్తే -

నిన్నటి నా పోస్టులో చెప్పినట్టు - ఆసక్తి ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మీ బయోడేటా, లేటెస్టు సెల్ఫీ, ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఈమెయిల్ ద్వారా వెంటనే పంపించండి: richmonkmail@gmail.com

4 వ తేదీ నుంచి వరుసగా ఆడిషన్స్ ఉంటాయి. 

సినీఫీల్డులో కెరీర్ కోసం నిజంగా అంత సీరియస్‌నెస్, ఇంట్రెస్టు ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కోసమే ఈ కాల్. మిగిలినవాళ్ళు ఎవ్వరూ అనవసరంగా మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఆల్ ద బెస్ట్. 

Filmmaking is a gold mine—if your focus is fire and your team is fierce.

- మనోహర్ చిమ్మని  

Be Your Own Backbone


Dependency is a slow poison. It starts with comfort, grows into habit, and ends in heartbreak or helplessness. Whether in work, relationships, or creative pursuits — relying too much on others can cost you clarity, confidence, and control.

Trust your gut. Own your choices.
Blame is for the weak — leaders take full responsibility.

Let people be who they are.
You’re not here to fix or follow anyone.
You’re here to lead, to grow, to win — on your own terms.

Stand tall. Walk alone, if you must.
That’s where real power begins.

-Manohar Chimmani 

Friday, 1 August 2025

మనోహర్ చిమ్మని "కోపరేటివ్ ఫిలిం మేకింగ్ క్లబ్!"


1992 లోనే, హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రిగ్జ్ ఇదే పద్ధతిలో "ఎల్ మరియాచి" తీశాడు. 

సోషల్ మీడియా లేని కాలంలోనే, 2007లో, నా రెండో సినిమా "అలా" ఈ పధ్ధతిలోనే తీశాను. 2011లో ఆర్జీవీ "దొంగల ముఠా" కూడా ఇదే పద్ధతిలో తీశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంకెందరో ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ ఇప్పటికీ ఇదే పద్ధతిలో ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. 

కట్ చేస్తే -  

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో - పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా... ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెమ్యూనరేషన్ ముందు ఇవ్వటం అనేది అసలు ఉండదు. 

సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు! 
దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు!!

సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ కంట్రిబ్యూషన్ (మనీ/పని) ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉంటుంది.   

ఎందుకంటే - 
దీనికి ప్రొడ్యూసర్ ఉండడు. 
ఇండిపెండెంట్ ఫిలిం అన్నమాట. 

అనుకున్న బడ్జెట్‌ను నలుగురయిదుగురు -లేదా- ఒక పదిమంది లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ తలా కొంత షేర్ చేసుకుంటారు.  

సినిమా బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు. పదికోట్లు కావచ్చు. మేం పూల్ చేసుకున్న ఆ బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతాం.   

నో కాల్ షీట్స్.
నో టైమింగ్స్.
అంతా - రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్.
గెరిల్లా ఫిల్మ్ మేకింగ్. 

ప్రొడ్యూసర్స్, స్టార్స్ లేని ఇండిపెండెంట్ సినిమాల విషయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ ఒక్క పద్ధతే ఎక్కువగా విజయవంతంగా నడుస్తోంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఈ పద్ధతిలో తీసిన ఎన్నో సినిమాలు ఎప్పటికప్పుడు అద్భుత విజయాల్ని రికార్డు చేస్తున్నాయి. 

ఈ కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో ప్లాన్ చేసి తీసే సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. మంచి బిజినెస్ చేస్తాయి... ప్రొవైడెడ్, సరైన స్ట్రాటజీతో చేస్తే! 

కట్ చేస్తే -  

పూర్తిగా న్యూ టాలెంట్‌తో, మొన్నీ మధ్యే నేను షూటింగ్ పూర్తిచేసిన రోడ్-క్రైమ్-డ్రామా "ఎర్ర గులాబి" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. 

ఇప్పుడు తాజాగా నేను చేస్తున్న రెండు ఫీచర్ ఫిలిమ్స్ ఈ పద్ధతిలో చేస్తున్నవే. ఈ రెండు సినిమాల ప్రిప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పుడు ఏక కాలంలో జరుగుతోంది. 

ఈ సిస్టమ్‌లో నాతో కలిసి పనిచేయాలనుకొనే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇన్వెస్టర్లు మీ పూర్తి వివరాలు తెలుపుతూ (bio-data, latest selfie, Insta link) నాకు ఈమెయిల్ చెయ్యండి...

మనోహర్ చిమ్మని "కోపరేటివ్ ఫిలిం మేకింగ్ క్లబ్"లో చేరండి.  

క్లబ్ సభ్యత్వానికి ఎలాంటి ఫీజు ఉండదు. 
కొన్ని బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ మాత్రం ఉంటాయి. 
త్వరలోనే నా కొత్త సినిమాల ప్రకటన, ప్రారంభం, షూటింగ్ ఉంటాయి. 

పూర్తి వివరాలు నా తర్వాతి పోస్టులో. 

"It's a kind of fun to do the impossible!"
- Walt Disney 

- మనోహర్ చిమ్మని 

Thursday, 31 July 2025

మనమేం చేస్తున్నాం, మనకేం కావాలి?


"Research shows that the more a boy misbehaves in school, the more likely he is to earn a lot of money as an adult!"


మూడ్ బాగోలేక నా పాత బ్లాగ్ పోస్టులను బ్రౌజ్ చేస్తోంటే ఇది కనిపించింది. 

నా దృష్టిలో ఇదేదో ఉత్తుత్తి స్టేట్‌మెంట్ కాదు. నా అనుభవంలో నేను కూడా గమనించిన ఒక నిజం. 

కట్ చేస్తే - 

డబ్బు - 3 సూత్రాలు: 

1. చదువుకోనివాడి లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. మొండిగా ఆ ఒక్కదాని గురించే కష్టపడతాడు, సాధిస్తాడు. 

2. చదువుకున్నవాడికి పది లక్ష్యాలుంటాయి. పది పడవలమీద కాళ్లు పెడతాడు. ఏ ఒక్కటీ సాధించలేడు.

3. చదువుకు, సంపాదనకు అస్సలు సంబంధం లేదు. "నాకేం కావాలి? నేనెంత సంపాదించాలి? దానికోసం నేనేం చేయాలి?" అన్న వెరీ సింపుల్ 'ఫినాన్షియల్ ఇంటలిజెన్స్' చాలు. 

పై 1, 2, 3 లను చాలా ఆలస్యంగా రియలైజ్ కావడమంత దురదృష్టం ఇంకొకటి లేదు.  

బట్, నో వర్రీ.

కనీసం, రియలైజ్ అయిన మరుక్షణం నుంచైనా, వొళ్లు దగ్గరపెట్టుకొని, "మనమేం చేస్తున్నాం, మనకేం కావాలి" అన్న విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటే చాలు.

ఫలితాలు అవే ఫాలో అవుతాయి.
డబ్బు కూడా.  

- మనోహర్ చిమ్మని 

Believe in You First


Soulful mentoring doesn’t start with strategies.
It starts with a spark — within you.

The truth? No mentor, no method, no mastermind can help…
until you believe in you.

That quiet, unwavering trust in your own path —
That’s where everything shifts.

Once that’s lit, mentoring becomes magic.
The universe leans in. So does your future.

— Manohar Chimmani  

Tuesday, 29 July 2025

The Turning Point You've Been Waiting For


There comes a moment—quiet, almost unnoticed—when everything shifts.

The pain you carried so long begins to melt. The weight of old battles feels lighter. The doubts? They start to lose their voice.

You’ve reached that turning point.

Not because life suddenly became perfect, but because you’ve changed. The hardship, the heartbreak, the silence—all of it refined you, not ruined you.

Now, the flow has turned in your favor. Things are starting to happen—small, beautiful, good things. Don’t resist them. Don’t doubt them. Just go with the flow. Allow the love. Let in the lightness.

You deserve this chapter. And when you accept that, even more goodness will unfold—gently, naturally, like a river that always knew where it was meant to go.

Let it flow. Let it grow.  

— Manohar Chimmani