డబ్బున్న కులం, డబ్బు లేని కులం.
మిగిందంతా ఉట్టిదే.
పనికిరాని చెత్త. బుల్ షిట్.
కానీ, సినిమా పుట్టినప్పటి నుంచీ మన సినిమాల్లో ఈ పనికిరాని చెత్త చాలా ఉంది. ఎందుకుంది అంటే, సమాజంలో అదే ఉంది, అదే నడుస్తోంది ఇంకా. ఇంకా ఇంకా పెరుగుతోంది చెప్పాలంటే. అలా పెరిగేలా చేసే వ్యవస్థ కూడా ఇంకా ఇంకా ఫ్లరిష్ అవుతోంది.
ఎన్ని వందల ప్రేమకథల సినిమాల్లో కులం లేదు? ఎన్ని వందల పెత్తందారి సినిమా కథల్లో కులం లేదు?
కాని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యుగంలో కూడా ఇంకా కులాలేనా?
వాటిని వదిలిపెట్టి కథలు రాసుకోలేమా?
ఉన్న కులం, లేని కులం... ఈ రెండు కులాలు చాలవా వేలకొద్ది కథలు రాసుకోడానికి?
ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యక్తివికాసానికి ఉపయోగపడే ఎంటర్‌టైన్మెంట్‌ను ఈ కులాల ప్రసక్తి లేకుండా క్రియేట్ చెయ్యలేమా?
కులాల ప్రసక్తిలేని థ్రిల్ చూపించడం సాధ్యం కాదా?
ఎవరో మనదగ్గర కవర్లు తీసుకొని, మనల్నే ఇంటర్రాగేట్ చేసే అవకాశం కల్పించే ఆ కులాల కథలవసరమా మనకు?
ఇకనుంచి సినిమాల్లో ఏఏ పాత్రకు ఏ కులంవాళ్ళు ఉండాలి అన్నది ఈయన్నడిగి స్క్రిప్టురాసుకోవాలేమో!
నేను ఆ సినిమా చూడలేదు. నిజంగా ఆ డైరెక్టర్ చేసింది అంత నేరమైతే యాక్షన్ తీసుకోడానికి వ్యవస్థలున్నాయి.
అక్కడ కులం ప్రసక్తి ఎందుకు? ఎన్ని వందల సినిమాల్లో వేరే కులాల పేర్లతో ఉన్న పాత్రలు ఎన్నెన్ని అఘాయిత్యాలు చెయ్యలేదు? అప్పుడెందుకు ఇలా అడగలేదు?
ప్రశ్నించడం తప్పు కాదు. నీ కంఫర్ట్ జోన్ అని నువ్వు భావించే కొన్ని సెలక్టివ్ ప్లేసెస్‌లో మాత్రమే ప్రశ్నించడం మాత్రం ఖచ్చితంగా తప్పే.
అసలా దబాయింపు, ఆ టోన్ ఏంటి? పెద్ద బ్యానర్లు, పెద్ద స్టార్‌ల ప్రెస్ మీట్లలో ఆ వాయిస్ రాదెందుకు? నంగి నంగి అడగాలావద్దా అన్నట్టు మాట్లాడుతారెందుకు అక్కడ? ఎందుకని కొన్ని సెలక్టివ్ ప్రెస్ మీట్లలోనే ఆ దబాయింపు?
కట్ చేస్తే -
అసలీ సోకాల్డ్ అవుట్‌డేటెడ్ ఫిలిం జర్నలిస్టులను పిలిచి, కవర్లిచ్చి, అలా ఇంటెర్రాగేట్ చేయించుకోకపోతే వచ్చే నష్టం ఏంటి?
సోషల్ మీడియా సరిపోదా? ఇదే కవర్లను ఒక డజన్ మంది యూట్యూబర్స్‌కు ఇవ్వండి. ఇంకో డజన్ మంది ఇన్‌ఫ్లుయెన్సర్లకివ్వండి. ఈ సోకాల్డ్ రొటీన్ అవుట్‌డేటెడ్ ప్రెస్ కంటే మినిమమ్ వంద రెట్ల ప్రమోషన్ బ్రహ్మాండంగా చేస్తారు. చేసి చూపిస్తారు.
ఇంకా ఎక్కడున్నాం మనం?
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 66/100.
100 Days, 100 Posts. 66/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani