Friday, 22 May 2026

దీని కోసం అన్నీ వొదులుకోవాల్సిన పనిలేదు


ప్రేమలో కాని, స్నేహంలో కాని, ప్రొఫెషన్‌లో కాని... మన వెంటపడుతున్న వ్యక్తులను, అవకాశాలను వద్దనుకుంటాం. మనల్ని వద్దనుకున్న వ్యక్తుల కోసం, మనకు రాని అవకాశాల కోసం, ఇంకేదో మనకే స్పష్టత లేనివాటికోసం అదేపనిగా ప్రయత్నిస్తుంటాం.  

మనిషి జీవితంలో ఇది అతి పెద్ద గ్యాంబ్లింగ్.

కట్ చేస్తే -

మనిషి అంతరంగాన్ని కలగాపులగం చేసే ఇలాంటి ఆలోచనల నుంచి, ఇలాంటి ఒక ఖచ్చితమైన గమ్యం లేని జీవనశైలి నుంచి దూరంగా వెళ్ళటం కోసమే... స్పిరిచువాలిటీ.

స్పిరిచువాలిటీ కోసం అన్నీ వొదులుకోవాల్సిన పనిలేదు. అలా వొదులుకోవాలన్న నియమం కూడా ఏం లేదు. 

మనకోసం మనం.
మన లోపల మనం. 
మనం మనంగా మనం.

జీవితాన్ని జీవించటం.
జీవితానికి గౌరవమివ్వటం.
చాలా అవసరం. 
తప్పనిసరి కూడా. 

ఎందుకంటే - 
జీవితం ఒక్కటే.
సమయం కూడా చాలా తక్కువ.

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani