Pages

Saturday, 23 May 2026

కొటేషన్స్ వేరు, జీవితం వేరు!


లాక్‌డౌన్‌ను మించిన బోధివృక్షం లేదు అనుకున్నాను. 
కాని అది నిజం కాదు. 

వాట్సాప్‌ను మించిన బోధివృక్షం లేదు. 
ఇక ఉండదు. 
కనీసం, నా విషయంలో. 

కట్ చేస్తే - 

తెల్లారి లేస్తే, మా స్నేహితుల వాట్సాప్ గ్రూపులో "స్నేహం" మీద డజన్ల కొద్ది మెసేజెస్ పెట్టే నా అత్యంత దగ్గరి మిత్రుడొకరు, ఒక 20 రోజులైనా నా వాట్సాప్ మెసేజ్ చూసుకోలేదు. రిప్లై ఇవ్వలేదు.

అదేం భయపడాల్సిన మెసేజ్ కూడా కాదు. 

ఇందుకు నేను వాడ్ని తప్పు పట్టను. 

ఎవరి ప్రయారిటీలు వారికుంటాయి. 
ఎవరి హిపోక్రసీలు వారివి. 
ఎవరి భయాలు వారివి. 

మనవాళ్ళు, మన గురించి మొత్తం అర్థం చేసుకున్నవాళ్ళు, అసలు మనం ఏంటో దాపరికం లేకుండా తెలిసినవాళ్ళనుంచే ఇలాంటి మర్యాద కూడా ఒకటి సాధ్యం అన్నది మనం అనుభవించినప్పుడే తెలుస్తుంది.    

అయితే, ఇలాంటివన్నీ పట్టించుకుని పెయిన్ ఫీలవ్వటం అంటే, మనం ఇంకా బచ్చాగాళ్లమని అర్థం. 

ఎక్కడ ఎవరితో ఎంతవరకు అన్నది తెలుసుకోవాలి.
మన పనిలో మనం ముందుకు వెళ్తూనేవుండాలి.

జీవితం చాలా చిన్నది.
వృధా చేసుకునేంత సమయం లేదు.    

ఈసారి మాత్రం ఏదో బూడిదలోంచి లేచి దులుపుకొన్నట్టు కాకుండా... నా మనసు నిజంగానే ఒక చిన్న కుదుపుకు లోనయింది. 

ఇది నాలో ఒక పెద్ద మార్పుకు దారితీయొచ్చు. 
ఒక మహాజ్ఞానోదయమే కావొచ్చు.

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani