Pages

Tuesday, 19 May 2026

నగ్నచిత్రం నుంచి రిచ్ మాంక్ దాకా...


13 సంవత్సరాల 9 నెలలు.
సుమారు 5000 రోజులు. 

సాంకేతికంగా ఆక్సిజన్ నన్ను బ్రతికిస్తోందికావచ్చు. కాని, మానసికంగా నన్ను నిజంగా బ్రతికిస్తున్నది మాత్రం వేరే. 

బ్లాగింగ్.

21 ఆగస్టు, 2012. 
తెలుగు ఎలా టైప్ చెయ్యాలా అని వెతుకుతుంటే లేఖిని కనిపించింది. 

అంతే. 

తెలుగు టైప్ చేస్తోంటే ఎంత ఆనందమేసిందో ఆరోజు.
వెంటనే ఈ బ్లాగ్ క్రియేట్ చేశాను. 

నగ్నచిత్రం. 

థాంక్స్ టూ బ్లాగర్ ప్లాట్‌ఫామ్... ఈ బ్లాగింగ్ నాకు చాలా ఇచ్చింది. 

ప్రపంచవ్యాప్తంగా ఎందరితోనో పరిచయాలు కల్పించింది. ఎన్నో కథలు, కవితలు, ఆర్టికిల్స్, పుస్తకాలు, స్క్రిప్టులు, సినిమా ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పుట్టుకకు స్పూర్తినిచ్చింది. అన్నిటినీ మించి, ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో నాకు ఓదార్పునిచ్చింది. 

వీటిలో ఏ ఒక్కటీ ప్లాన్ చేసింది కాదు. 
ఇవన్నీ నా బ్లాగులో ఏదో ఒకటి నేను రాస్తున్నప్పుడే నా మనసులో మెరిశాయి. 
బ్లాగ్ నాకు చాలా ఇచ్చింది.  

కట్ చేస్తే - 

ఇప్పుడు దీన్ని "The Rich Monk"గా మార్చాను. 

నా ఇంగ్లిష్ రైటింగ్‌ను రిఫ్రెష్ చేసుకొనే పనిలో భాగంగా, ఇప్పుడు ఇదే బ్లాగ్‌లో ఇంగ్లిష్ పోస్టులు కూడా రాస్తున్నాను. ఎప్పుడో మర్చిపోయిన అలవాటుని ఇప్పుడు యాక్టివ్ చేసుకొంటున్నాను. 

కథలూ, ఫిక్షన్ ఇంగ్లిష్‌లో రాస్తున్నాను. ఇంకొన్ని నాన్-సినిమా పనులకు సంబంధించిన ఆలోచనలు కూడా ఉన్నాయి.

అందుకే బ్లాగ్‌లో ఇప్పుడు కొత్తగా ఇంగ్లిష్‌లో రాయడం. 
"The Rich Monk" అని ఇంగ్లిష్‌లో కొత్తగా పేరు పెట్టడం.   

"Sometimes I think of blogging as finger exercises for a violinist; sometimes I think of it as mulching a garden. It is incredibly useful and helpful to my “real” writing." ~Kate Christensen

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani