Pages

Monday, 15 December 2025

నేను బాపుగారింటికి వెళ్ళినరోజు


బాపుగారి బొమ్మ అంటే మామూలుగా అయితే రెండర్థాలు స్పురిస్తాయి: బాపు గీసిన బొమ్మ, బాపు సినిమా.

ఈ రెండూ కాకుండా, సుమారు 18 ఏళ్ళక్రితం మద్రాసులోని వారి ఇంట్లో బాపుగారిని కలిసినప్పటి సంగతులు ఇప్పుడు నేను రాస్తున్నాను. పాత పోస్టే కొత్తగా రాస్తున్నాను.   

అప్పట్లో నేను రాయదల్చుకున్న ఒక పుస్తకం కోసం కొంతమంది నేను ఎన్నికచేసుకొన్న దర్శకులను కలవటం జరిగింది. ఆ ప్రాసెస్‌లో భాగంగా ఒక మధ్యాహ్నం వారి టైమ్ తీసుకొని బాపుగారి ఇంటికి వెళ్లాను. నాతోపాటు నా మిత్రుడు, కోడైరెక్టర్ వేణుగోపాల్ కూడా వచ్చాడు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి, సాయంత్రం 7 మధ్యలో – సుమారు 3 గంటలపాటు బాపుగారితో మాట్లాడుతూ, వారి ఇంటర్వ్యూను ఆడియో రికార్డు చేశాను.

అసలు బాపుగారితో పక్కపక్కనే ఒకే సోఫా మీద కూర్చొని, వారితో అన్ని గంటలపాటు ముచ్చటించటం, వారి ఇంటర్వ్యూని రికార్డ్ చేయటం అనేది నిజంగా నేను అంతకు ముందు ఎప్పుడూ ఊహించని ఒక గొప్ప అనుభవం. 

బాపుగారు కేవలం ఒక చలనచిత్ర దర్శకుడే కాదు… ఒక అంతర్జాతీయ స్థాయి పెయింటర్, ఇల్లస్ట్రేటర్, కార్టూనిస్ట్, స్టోరీబోర్డ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ ఆర్టిస్ట్, డిజైనర్ కూడా. 

1964 లోనే యునెస్కో స్పాన్సర్ చేసిన ఒక అంతర్జాతీయ సెమినార్లో చిల్డ్రెన్స్ బుక్స్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వగలిగిన మేధావి. వాల్టర్ థామ్సన్, ఎఫిషియెంట్ పబ్లిసిటీస్, ఎఫ్ డి స్టీవార్ట్స్ వంటి అంతర్జాతీయ స్థాయి యాడ్ ఏజెన్సీలకు గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న బహుముఖప్రజ్ఞాశాలి. 1960 ల్లోనే ఫోర్డ్ ఫౌండేషన్‌ తరపున "ది సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌"కు ఆర్ట్ కన్సల్టెంట్‌గా పనిచేశారాయన. 

అదంతా కంప్యూటర్లు, ఇంటర్నెట్టూ, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వంటివి లేని కాలం అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి!

అప్పట్లో పబ్లిష్ అయిన ప్రతి తెలుగు నవలమీద, ప్రతి కథా సంకలనం మీద, వీక్లీల కవర్లపైన, మ్యాగజైన్ల వార్షిక సంచికలమీద… బాపు గారు గీసిన ముఖచిత్రం మాత్రమే ఎక్కువగా ఉండేది. అలాంటి ముఖచిత్రాలు వారు ఎన్ని వందల పుస్తకాలకు వేశారన్నది చెప్పటం కష్టం. 

దర్శకుడిగా బాపు చేసిన దాదాపు 48 సినిమాల్లో 10 హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా కూడా ఉంది. వారి సినిమాలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడ్డాయి. అవార్డులు, రివార్డులు గెల్చుకొన్నాయి.

బాపు గారికి కూడా 2013లో పద్మశ్రీ అవార్డుతో పాటు అంతకు ముందే ఎన్నో అవార్డులు వచ్చాయి.

ఒక దశలో హిందీలో ఒక టాప్ హీరోగా వెలిగిన అనిల్ కపూర్‌ను, తెలుగులో వంశవృక్షం చిత్రం ద్వారా మొట్టమొదటగా వెండితెరకు పరిచయం చేసింది బాపుగారే అవటం ఒక గమ్మత్తైన విశేషం. 

బాపుగారు షూటింగ్‌కు ముందే తాను తీయబోయే ప్రతి షాట్‌నూ స్టోరీబోర్డ్ రూపంలో గీసుకుంటారు. సినిమాల్లో వారి ఫ్రేమ్స్ అన్నీ వారు గీసిన స్టోరీబోర్డులో బొమ్మల్లాగే ఉండటంలో ఎలాటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా వారి సినిమాల్లో హీరోయిన్స్… వారి కళ్ళు, క్లోజప్స్, చీరెకట్టు, నడుము వొంపులు, వాలు జడ, కాళ్ళు, పాదాలు…

వారి చాలా సినిమాల స్టోరీబోర్డులను వారి ఇంట్లోనే చూసిన అతికొద్దిమందిలో నేనూ ఒకన్ని.

అప్పట్లో తెలుగు కాస్త బాగా రాయగలిగిన దాదాపు ప్రతి యువకుడూ, ప్రతి కవీ, ప్రతి రచయితా తమ చేతి వ్రాతను బాపుగారి స్టయిల్లో రాసే ప్రయత్నం చేసేవారంటే అతిశయోక్తికాదు. బాపు రైటింగ్ శైలి ప్రభావం నామీద కూడా బోలెడంత వుంది. 

కట్ చేస్తే –

మద్రాసులో నేను బాపుగారింటికి వెళ్ళినప్పుడు, వారి ఇంట్లో ఆరోజు ఎవరూ లేరనుకొంటాను. ఒకసారి వాళ్ల అబ్బాయి, మరొకసారి స్వయంగా బాపుగారే అందించిన కాఫీ త్రాగటం మర్చిపోలేని జ్ఞాపకం. 

వారి ఇంట్లో కూర్చున్న ఆ 5 గంటలూ నన్ను “మీరు” అని, “మనోహర్ గారు” అని పిలవటం నేను చాలా ఇబ్బందిపడిన విషయం. నాకు తెలిసి, బాపుగారు వారి అసిస్టెంట్స్‌ను కూడా “మీరు” అనే పిలుస్తారట. 

ఇంటర్వ్యూ నడుస్తుండగా, 90 నిమిషాల ఆడియో క్యాసెట్ సరిపోదన్న విషయం ముందే గుర్తించిన నా మిత్రుడు వేణుగోపాల్ బయటకెళ్ళి వేగంగా ఇంకో క్యాసెట్ కొనుక్కొచ్చిన విషయం నాకింకా గుర్తుంది. షెల్ఫుల్లో ఎక్కడో అట్టడబ్బాల్లో ఉన్న ఆ క్యాసెట్లని ఇప్పుడు డిజిటలైజ్ చెయ్యాలనుకుంటున్నాను. నా యూట్యూబ్ చానెల్లో అప్‌లోడ్ చెయ్యాలనుకుంటున్నాను.    

వీటన్నిటినీ మించి బాపుగారికి సంబంధించి నేను చెప్పదల్చుకొన్న మరొక అద్భుత విషయాన్ని గురించి ఇప్పుడు చివరగా చెప్తున్నాను. అది… బాపుగారి “వర్క్‌రూమ్-కమ్-స్టడీరూమ్.”

బాపు గారి వర్క్‌రూమ్ ఒక పెద్ద హాల్ సైజులో ఉంటుంది. దానికి రెండువైపులా ద్వారాలుంటాయి. చుట్టూ వున్న నాలుగు గోడలు పూర్తిగా నిలువెత్తు ర్యాక్స్‌తో ఫిక్స్‌చేసివుంటాయి. వందలాది పుస్తకాలు.

హాల్ మధ్యలో వేర్వేరుచోట్ల కూర్చొని పనిచేసుకోడానికి అక్కడక్కడా రెండు బీన్ బ్యాగులు, చిన్న చిన్న పీటల్లాంటి కుషన్లు. ఎక్కడ కూర్చొంటే అక్కడే ఆర్ట్, రైటింగ్ సెటప్… బ్రష్షులు, పెన్నులు, పెన్సిళ్ళు, ఇంకులు, రంగులు, ప్యాలెట్లు…

అంటే – ఆయన ఎక్కడ కూర్చోవాలనుకొంటే అక్కడే కూర్చొని ఆర్ట్ వేయటమో, రాసుకోవడమో, చదవటమో చేస్తారన్నమాట!

నేనొక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి, ఒక 30 నిమిషాలపాటు స్పెల్‌బౌండ్ అయి చూసిన బాపుగారి వర్క్‌రూమ్-కమ్-స్టడీని ఇన్నేళ్ళ తర్వాత కూడా అడుగు అడుగూ వర్ణించగలను!

సృజనశీలి అయిన ఒక అద్భుత వ్యక్తికి అంతకు మించిన ఆస్తి ఏముంటుంది? 

బాపు గారి దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన మిత్రుడు, డైరెక్టర్ గాంధీ మనోహర్ నిజంగా అదృష్టవంతుడు. 

వెళ్తూ వెళ్తూ ప్రచురణకోసం వారి ఫోటో ఒకటి అడిగాను. తర్వాత, మనసు మార్చుకొని – సిగార్‌తో వున్నదీ, ఆయనే స్వయంగా వేసుకొన్న ‘బాపుగారి బొమ్మ’ కావాలన్నాను. 

“నేను మీకోసం కొత్తగా ఒకటి వేసి మీకు పోస్ట్ చేస్తాను” అని నా అడ్రెస్ తీసుకొన్నారు. మాట ఇచ్చినట్టే సరిగా వారం రోజుల్లో బాపుగారినుంచి పోస్టులో ‘సిగార్‌తో బాపుగారి బొమ్మ’ వచ్చింది!

ఆ బొమ్మ, ప్లస్, వారిదగ్గర నేను అడిగి తీసుకొన్న ‘పెళ్ళిపుస్తకం’ సినిమాలోని ఒక సీన్‌కు వారు వేసుకొన్న మొత్తం స్టోరీబోర్డు కాపీ ఇప్పటికీ ఒక కార్డ్‌బోర్డ్ పెట్టెలో నాదగ్గర భద్రంగా ఉన్నాయి.

వారికి సెలవు చెప్పి బయటికి వస్తోంటే ఇంటిముందు విశాలమైన ఆవరణలో ఒక ఊయల. ఎదురుగానే హీరో మమ్ముట్టి ఇల్లు. గేట్ దాటి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగిచూస్తే – ఇంకా బయటే మాకు చేయి ఊపుతూ బాపు గారు!

ఇన్ని అద్భుత జ్ఞాపకాలనిచ్చిన బాపుగారికి వారి జయంతి సందర్భంగా ఇదే నా వినమ్ర నివాళి. 

- మనోహర్ చిమ్మని  

ఏ రంగంలో అయినా మార్పు అనేది అత్యంత సహజం


ఒక ఫిలిం డైరెక్టర్ సినిమా తీయాలంటే దశాబ్దాలుగా మన దగ్గర ఒక పాత రొటీన్ ఉంది:

ఒక ప్రొడ్యూసర్ దగ్గరికో, హీరో దగ్గరికో వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేసేలా కథ చెప్పటం, ఓకే చేయించుకోవటం... తర్వాత ఆ ప్రొడ్యూసర్ సినిమా తీసినప్పుడు, లేదా ఆ హీరో డేట్స్ ఇచ్చినప్పుడు సినిమా చేయటం... లేదా, అప్పుడూ ఇప్పుడూ అని వాళ్ళు మభ్యపెడుతున్నది నమ్ముతూ సంవత్సరాలకి సంవత్సరాలు వృధాచేసుకోవడం. 

ఇదంతా పాత కథ. పనికిరాని ఒక పాత రొటీన్.  

ఇప్పుడలా కాదు. అంతా కార్పొరేట్ స్టయిల్. 

ఒక డైరెక్టర్ తన ప్రాజెక్ట్ ప్లాన్‌తో, ప్రపంచంలో ఎవ్వరి నుంచైనా, ఏ కార్పొరేట్ ఫండర్ నుంచైనా ఫండింగ్ తెచ్చుకోవచ్చు. డీల్ ప్రకారం వాళ్ళ బెనెఫిట్స్ వాళ్ళకు ఇవ్వొచ్చు. పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్‌తో మనం అనుకున్న సినిమాల్ని మనం తీసుకోవచ్చు.   

నెమ్మదిగా మన దగ్గర కూడా ఇప్పుడు ఈ సిస్టమ్ ప్రారంభమైంది. వేగం పుంజుకొంటోంది. 


- మనోహర్ చిమ్మని           

Sunday, 14 December 2025

I, and I Alone 2.0


I, and I alone, am responsible for everything I think and feel.

Thoughts rise like waves. Emotions pass like weather. But the choice to hold them, feed them, or release them is mine. No one else lives inside my mind. No one else breathes through my heart.

When I blame the world, I give my power away.
When I take responsibility, I return to myself.

Spiritual growth is not about escaping life. It is about owning it fully. Watching the mind. Witnessing emotions without becoming them. Choosing awareness over reaction.

Life will test me. People will trigger me. Situations will shake me. But what I carry within — that is my karma, my creation.

The moment I accept this truth, something softens.

There is no anger left to project.
No fear left to hide behind.

Only clarity.
Only presence.
The power of now.

Responsibility is not a burden. It is liberation.
Because when I own my inner world, I am no longer at war with the outer one.

And in that silence, I find peace.

- Manohar Chimmani 

Saturday, 13 December 2025

I, and I Alone


I, and I alone, am responsible for everything I think and feel.

Not society.
Not my past.
Not the industry, the market, the noise, or the opinions flying around me.

What enters my mind is my choice.
What stays there is my responsibility.

Blaming is easy. Ownership is uncomfortable. But ownership is power. The moment I stop outsourcing my emotions, I stop being weak. I stop waiting. I stop reacting.

Cinema taught me this the hard way. Every frame demands intention. Every decision has consequences. 

The mind is no different. You either direct it, or it directs you.

I don’t control everything that happens to me.
But I control the meaning I assign to it.
I control the stories I tell myself.

And that’s where freedom begins.

When I take full responsibility for my thoughts and feelings, I stop being a victim of circumstances and start becoming the author of my life.

No excuses.
No escape routes.
Just ownership — and forward motion.

- Manohar Chimmani

పెద్ద సినిమాలు, పెద్ద గ్యాంబ్లింగ్!


ఇప్పుడు ఏదీ ఎవ్వరూ వివరించి చెప్పే అవసరం లేదు. ఎవరికి ఎంత మార్కెట్ ఉంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, హిట్ అయినా ఎంత వస్తుంది, ఫట్ అయితే పరిస్థితి ఏంటి... అన్నది జస్ట్ సింపుల్ లాజిక్. 

కాని, ఇవన్నీ పట్టించుకోకుండా ఆడుతున్న గ్యాంబ్లింగ్ పెద్ద సినిమాలు. ఈ పెద్ద సినిమాల అంకెలు బయటికి ప్రొజెక్ట్ చేసుకునేవి వేరు, లోపలి అసలైన అంకెలు వేరు. 

కట్ చేస్తే - 


ఒక స్ట్రాటెజీతో చేస్తే - 
చిన్న సినిమాలకు మినిమమ్ గ్యారంటీ ఉంది.
హిట్ కొడితే 100 కోట్లు! 

Dream big, shoot smart, and make movies that make money.

- మనోహర్ చిమ్మని   

Wednesday, 10 December 2025

Cinema as a Battleground, Creativity as the Inner Light


Cinema is a battleground — not because we fight others,
but because we constantly face our own shadows.

Doubt.
Fear.
Comparison.
Ego.
Exhaustion.

These are the real villains every filmmaker meets long before a frame is shot or a script is locked.

But there is one weapon that never fails you:
Creativity.

Creativity is not just talent.
It is not just imagination.

It is spiritual energy — the soul expressing itself through visuals, sound, story, and emotion.

When your creativity is alive, your spirit becomes sharp.
You stop fighting the world and start transforming it.
The chaos inside becomes clarity.
The noise becomes music.
The struggle becomes a story worth telling.

That’s why cinema is more than a career.
It’s a spiritual journey disguised as work.
Every film you make is a mirror, reflecting who you are becoming.

And the truth is simple:

When your inner light is strong, no battlefield outside can defeat you.
When your creativity is aligned with your soul, every war becomes winnable.

This is the secret of great filmmakers —
not budgets, not contacts, not luck…

But a mind that stays still,
a heart that stays open,
and a creative fire that refuses to die.

Make films.
Make meaning.
Make your inner world stronger than any outer challenge.

Because the real victory in cinema —
and in life —
always begins within.

- Manohar Chimmani 

Tuesday, 9 December 2025

Creativity Is the Weapon


The film industry is not a peaceful garden.
It’s a battleground — loud, chaotic, unpredictable.

Every day, someone is fighting for a role, a script, a chance, a moment of recognition. And more than that, we’re fighting our own inner wars too — doubt, fear, ego, insecurity, comparison. 

But here’s the truth most people forget: 
Creativity is the only energy that keeps us alive in this war.
Not talent.
Not contacts.
Not money.
Creativity.

It sharpens your mind.
It lifts your spirit.
It gives you direction when everything outside feels directionless.
It pulls you out of the darkness you create inside yourself.

When you create — a scene, a shot, a line, a tune — you step out of the battlefield and step into your soul. And in that moment, every war inside you slows down.

Cinema tests us.
Creativity strengthens us.

And when both meet, something magical happens — you stop fighting for survival and start fighting for excellence.

In this industry, wars will come. But if your creativity is alive, focused, and fearless… no battle can break you.

- Manohar Chimmani  

ఉత్తర తెలంగాణలో లొకేషన్ స్కౌటింగ్


ఉత్తర తెలంగాణలో మంచి మంచి వాటర్‌ఫాల్స్, ఫారెస్ట్ లొకేషన్స్, రిసార్ట్స్, అందమైన పల్లెటూళ్ళు, చారిత్రక స్థలాలు, గడీలు వంటి అద్భుతమైన లొకేషన్స్ చాలా ఉన్నాయి. 

కట్ చేస్తే -

ఇప్పుడు నేను చేయబోతున్న రెండు కొత్త సినిమాల కోసం అవసరమైన కొన్ని ప్రత్యేకమైన లొకేషన్ల స్కౌటింగ్‌కి రేపు మా టీంతో వెళ్తున్నాను. 

లోకల్ ఆడిషన్స్, లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ మీటింగ్స్ కూడా ఉన్నాయి. 

గత కొన్నిరోజులుగా నా ఎడమకాలి టిబియా ఫ్రాక్చర్ కొంచెం ఇబ్బంది పెడుతున్నా ఈ ట్రిప్ వెళ్తున్నాను. ఎక్కువ రోజులు నాలుగు గోడల మధ్యే స్టకప్ అయిపోతే క్రియేటివిటీకి అసలు ఊపిరాడదు. 

Cinema is a battleground, but creativity is the weapon that keeps your spirit sharp — in every war, inside or outside. 

- మనోహర్ చిమ్మని 

Monday, 8 December 2025

ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్‌కు గొప్ప అవకాశం!


ఇంతకు ముందు సినిమాలు వేరు. 
ఇప్పటి సినిమాలు వేరు.

Content is king — but money is the ultimate goal.

కట్ చేస్తే - 

మొన్న ఒక గుజరాతీ సినిమా 50 లక్షల్లో తీస్తే 100 కోట్లు వసూలు చేసింది.

ఈమధ్యనే మన తెలుగులో "లిటిల్ హార్ట్స్", "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాలు కూడా కొత్తవాళ్ళతో అతి తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు. ఈ రెండు సినిమాలూ కోట్లల్లో బాగా కలెక్షన్ వర్షం కురిపించాయి.  

ఇప్పుడు పెద్ద సినిమాలు పెద్ద గ్యాంబ్లింగ్. 

ఒక స్ట్రాటెజీతో చేస్తే - 
చిన్న సినిమాలకు మినిమమ్ గ్యారంటీ ఉంది.
హిట్ కొడితే 100 కోట్లు! 

ఇలాంటి టార్గెట్‌తో మేము చేస్తున్న చిన్న బడ్జెట్ సినిమాల కోసం, తక్కువ స్థాయిలోనైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయించగల సమర్థులైన మీడియేటర్స్ కోసం చూస్తున్నాం.

సినిమాల మీద ఆసక్తి, ప్యాషన్ ఉన్న కొత్త ఇన్వెస్టర్లు, ప్రొడ్యూసర్లు, కోప్రొడ్యూసర్స్‌ను మాకు కనెక్ట్ చేసి, సక్సెస్‌ఫుల్‌గా డీల్ క్లోజ్ చేయించగల మీడియటర్స్‌కు మంచి కమిషన్ ఉంటుంది. 

మాతో కాంటాక్ట్ అయిన 72 గంటల్లో డీల్ క్లోజ్ చేయించగలిగితే డబుల్ కమిషన్ ఉంటుంది. 

మా కాంటాక్ట్ నంబర్స్: +91 9989578125, 7702274948.
ముందు మెసేజ్ చెయ్యండి. 
మేమే కాల్ చేస్తాం. 

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.  

- మనోహర్ చిమ్మని  

Saturday, 6 December 2025

మనోహర్ చిమ్మని "రెనెగేడ్ ఫిల్మ్ క్లబ్"


మీకు తెలుసా? 
మొన్న ఒక్క నవంబర్ నెలలోనే తెలుగులో దాదాపు ఒక 40 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకే ఒక్క సినిమా హిట్ అయింది. అది, "రాజు వెడ్స్ రాంబాయి". ఇంకో సినిమా, "ఆంధ్రా కింగ్ తాలూకా"కు బాగుంది అన్న టాక్ వచ్చింది కాని, రావల్సిన కలెక్షన్ రాలేదు.   

సినిమాల హిట్-ఫ్లాప్‌ల విషయంలో పెద్దా చిన్నా ఏం ఉండదు. పోస్ట్ కోవిడ్ రోజుల నుంచి ప్రేక్షకులు కూడా క్రమంగా ఓటీటీలకే పరిమితం అవుతున్నారు. థియేటర్స్‌కు వెళ్ళి సినిమా చూసే ప్రేక్షకులు ఇంకా ఇంకా తగ్గిపోతారు.      

ఈ నేపథ్యంలో -
ఎంత చిన్న బడ్జెట్‌లో సినిమా తీయగలం?
ఎంత మంచి కంటెంట్ ఇవ్వగలం?
ఏ స్థాయి హిట్ ఇవ్వగలం?...
అన్నదే ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ విషయంలో కొత్త చాలెంజ్ అయింది.  

కట్ చేస్తే -  

1992 లోనే, హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రిగ్జ్ ఇదే పద్ధతిలో "ఎల్ మరియాచి" తీశాడు. 

సోషల్ మీడియా లేని కాలంలోనే, 2007లో, నా రెండో సినిమా "అలా" ఈ పద్ధతిలోనే తీశాను. 2011లో ఆర్జీవీ "దొంగల ముఠా" కూడా ఇదే పద్ధతిలో తీశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంకెందరో ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ ఇప్పటికీ ఇదే పద్ధతిలో ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు.  

కట్ చేస్తే -  

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో - పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా - ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెమ్యూనరేషన్ ముందు ఇవ్వటం అనేది అసలు ఉండదు. 

సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు. దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు.

సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ కంట్రిబ్యూషన్ (మనీ/పని) ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉంటుంది.   

ఎందుకంటే - 
ఇండిపెండెంట్ కోపరేటివ్ సినిమాలకు ప్రొడ్యూసర్ ఉండడు. 

సినిమా కోసం అనుకున్న బడ్జెట్‌ను నలుగురయిదుగురు -లేదా- ఒక పదిమంది లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ తలా కొంత షేర్ చేసుకుంటారు.  

సినిమా బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు. మేం పూల్ చేసుకున్న ఆ బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతాం.   

నో కాల్ షీట్స్.
నో టైమింగ్స్.
నో ట్రెడిషనల్ ఫిల్మ్ మేకింగ్ రూల్స్.
అంతా... రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. 

ప్రొడ్యూసర్స్, స్టార్స్ లేని ఇండిపెండెంట్ సినిమాల విషయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ ఒక్క పద్ధతే ఎక్కువగా విజయవంతంగా నడుస్తోంది. 

ఈ కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో ప్లాన్ చేసి తీసే సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. మంచి బిజినెస్ చేస్తాయి. ప్రొవైడెడ్, సరైన స్ట్రాటజీతో చేయగలిగితే. 

కట్ చేస్తే -  

పూర్తిగా న్యూ టాలెంట్‌తో, మొన్నీ మధ్యే నేను షూటింగ్ పూర్తిచేసిన రోడ్-క్రైమ్-డ్రామా "ఎర్ర గులాబి" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. 

ఇప్పుడు తాజాగా నేను చేస్తున్న రెండు ఫీచర్ ఫిలిమ్స్ ఈ పద్ధతిలో చేస్తున్నవే. ఈ రెండు సినిమాల ప్రి-ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పుడు ఏక కాలంలో జరుగుతోంది. 

ఈ సిస్టమ్‌లో నాతో కలిసి మా టీమ్‌లో పనిచేయాలనుకొనే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇన్వెస్టర్లు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.  

Email: okafilmmaker@gmail.com
WhatsApp (text message only): +91 9989578125

అలాగే - సినిమాల పట్ల ఆసక్తి, ప్యాషన్, సీరియస్‌నెస్ ఉన్న న్యూ టాలెంట్ నా వాట్సాప్ చానల్ "MC Renegade Film Club" లో జాయిన్ కావచ్చు.   

నా కొత్త సినిమాల ప్రకటన, ప్రారంభం, షూటింగ్, ప్రోగ్రెస్ లాంటి వివరాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఈ చానెల్లో పోస్ట్ చేస్తుంటాము. ముఖ్యంగా కొత్తవారికి అవకాశాలు, ఆడిషన్స్ వివరాలు ఈ చానెల్లోనే ముందుగా పోస్ట్ చేస్తాము. 

"It's a kind of fun to do the impossible!"
- Walt Disney 

Friday, 5 December 2025

అంతులేని హిపోక్రసీ


ఫిలిం ఇండస్ట్రీలో ఆర్టిస్టులైనా, టెక్నీషియన్స్ అయినా, హీరోలైనా, డైరెక్టర్స్ అయినా, గాయకులయినా, రచయితలైనా... వారి వారి రంగాల్లో వాళ్ళ ప్యాషన్ కోసం పనిచేస్తారు. డబ్బు కోసం పనిచేస్తారు. పేరు కోసం పనిచేస్తారు.  

అంతే తప్ప - ప్రజల కోసమో, ప్రజాసేవకోసమో ఉచితంగా ఎవ్వరూ పనిచేయరు. 

ఇది నిజం. 
అలాగని, ఇది తప్పు కాదు. 

మన అభిరుచిని బట్టి వీళ్ళల్లో కొందరు మనకు బాగా నచ్చుతారు.       

ఒక్క ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు... ఇతర క్రియేటివ్ రంగాల్లోనివారికి కూడా దాదాపు ఇదే వర్తిస్తుంది.  

కట్ చేస్తే -

ఇలాంటి వ్యక్తిగత కళాత్మక జర్నీకి అంతులేని హిపోక్రసీతో మనలో కొందరు ఇంకేదో భారీ రేంజ్ కవరింగ్ ఇస్తారు. 

అదంతా ఒక పెద్ద మాస్ హిస్టీరియా. 

అదొక తృప్తి.
అదొక ఆనందం. 
అంతకంటే ఏం లేదు. 

- మనోహర్ చిమ్మని  

2026 కి... 26 రోజులు!


2025లో అసలు ఏం చేశాం? ఏం సాధించాం?

అసలేమన్నా చేశామా?
పనికొచ్చే పనులేం చేశాం? 
పనికిరాని పనులేం చేశాం? 

శేఖర్ కపూర్, మణిరత్నం చెప్పినట్టు - ఈ ఫీల్డులో పనిచేస్తున్నందుకు - ప్రత్యక్షంగా, పరోక్షంగా - ఎవరెవరితో ఎన్ని మాటలు పడ్డాం, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాం? 

ఎంతమంది నానా కథలు చెప్పి మనకు హ్యాండిచ్చారు? మనం ఎన్నిసార్లు మాట తప్పాం? 

చేసిన తప్పులే చేస్తున్నామా? కొత్త తప్పులు కూడా చేశామా? ఏం నేర్చుకున్నాం?      

తీసుకున్న నిర్ణయాలేంటి? ఎన్నిటికి నిలబడ్డాం? ఎన్ని మార్చుకున్నాం?  

... ఒక అరగంటో, గంటో అంతర్విశ్లేషణ చాలా అవసరం. 

ఆర్థికం.
సాంఘికం.
వ్యక్తిగతం. 

అంతర్విశ్లేషణ చాలా అవసరం. 

కనీసం ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడైనా, మన కోసం మనం ఇలా కొన్ని నిమిషాలైనా కెటాయించుకోవాలి. మనతో మనం "మన సమయం" గడపాలి. 

ఇది అవసరం. 
ఇదే అవసరం.

ఈ విషయంలో క్లారిటీ లేకుండా ఇంకేం చెయ్యలేం. 

- మనోహర్ చిమ్మని 

Thursday, 4 December 2025

Is Writing About Spirituality a Crime?


Sometimes people ask, “Why do you write so much about spirituality? Isn’t it too personal? Too serious? Too much?”

But here’s the truth...

Writing about spirituality is not a crime.
For many of us, it is survival. 

We write about it because the world is noisy.
Because life pulls us in a hundred directions.

Because the mind gets tired, the heart gets confused, and the soul needs a reminder that it still exists.

Spirituality is not preaching.
It is remembering.

Remembering who we are behind the stress, behind the ambition, behind the daily chaos.

Sometimes we write for entertainment.
Sometimes we write for fame.
Sometimes we write for money.

And some of us write to stay awake — to breathe deeper, live slower, and touch that quiet place inside that still feels alive.

Writing about spirituality is not a crime.
It is an offering. 
A mirror.

A hand reaching out in the dark, saying...
“You’re not alone. There is still light in you.” 

And if a few lines can bring peace to even one person — then it’s not just writing.

It’s service.
It’s healing.
It’s truth in words. 

- Manohar Chimmani 

Wednesday, 3 December 2025

విగ్రహాలు పెట్టడం ఒక అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్


ఈ పోస్టుకి, రవీంద్రభారతిలో విగ్రహం గొడవకి సంబంధం లేదు.

కట్ చేస్తే -

అసలు విగ్రహాలు పెట్టడం అన్నది పూర్తిగా ఒక అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్ అని నా అభిప్రాయం. 

పెట్టిన విగ్రహాలన్నీ రోడ్లమీద దుమ్ముకొట్టుకొనిపోయుంటాయి. ఎవ్వడూ అటువైపు చూడడు. పుట్టినరోజో, పోయినరోజో వచ్చినప్పుడు తప్ప. 

అప్పుడు కూడా, విగ్రహం పక్కనే ఫిక్స్‌డ్‌గా పాతేసిన ఇనుప నిచ్చెనల మీదకెక్కి దండలేసి, పూలు గుమ్మరించే పొలిటీషియన్స్ ఫోటోల కోసమే తప్ప, ఇంకెప్పుడూ ఎవ్వరూ అటువైపు చూడరు. 

మనవాళ్ళ ఇంకో పెద్ద మతిలేని పని ఏంటంటే - విగ్రహాల ప్రాముఖ్యతను, అందాన్ని మింగేసే సైజులో ఒక నల్లటి ఇనుప నిచ్చెనను అక్కడ పక్కనే పాతెయ్యడం! 

ఇలాంటి గొప్ప అద్భుతం ఒక్క మన దేశంలోనే అనుకుంటాను మనం చూసేది. 

కట్ చేస్తే -      

విగ్రహం చూస్తే తప్ప గుర్తుకురారు అని ఎలా అనుకుంటాం? విగ్రహం పెట్టుకుంటే తప్ప స్మరించుకున్నట్టు కాదు అని ఎలా అనుకుంటాం?  

ఆయా వ్యక్తులు చేసిన పనులు, సాధించిన గొప్ప లక్ష్యాలే వారిని ప్రజల మనస్సుల్లో చిరస్మరణీయంగా నిలబెడతాయి.       

ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం, దేశాన్ని ఒక అగ్ర రాజ్యం చేయడం కోసం అందరి ఆలోచన, అందరి తపన, అందరి కృషి టాప్ ప్రయారిటీలో ఉండాలి. ఒక జపాన్ లాగా, ఒక చైనా లాగా, ఒక రష్యా లాగా. మిగిలినవన్నీ ఉట్టుట్టి రాజకీయాలే. ఇప్పుడైనా ఎప్పుడైనా.   

ప్రాక్టికల్‌గా పనికొచ్చే పనులు తప్ప, 99% మంది మనవాళ్ళు మిగిలిన అన్ని పనులు చెయ్యడానికి పోటీపడుతుంటారు. 

ఏదీ సాఫీగా ఉండొద్దు. ఏదో ఒకటి గెలకాలి. దారి మళ్ళించాలి. నేపథ్యంలో సొంత ప్రయోజనాలు కూల్‌గా నెరవేర్చుకొంటూవుండాలి. 

మన ఆలోచనావిధానంలో, మన సమాజంలో, మన రాజకీయాల్లో ఒక లేయర్ లేయరే కొట్టుకుపోతే తప్ప... ఇంకో వందేళ్ళయినా... మనం ఇలా ఒక "అభివృద్ధిచెందుతున్న దేశం" చందంగానే వుంటాం.   

- మనోహర్ చిమ్మని        

Tuesday, 2 December 2025

The Renegade Wave Begins


This month, I’m starting something wild, raw, and absolutely uncompromised — a series of no-budget / micro-budget cooperative renegade feature films.

Not theory. Not discussion. Actual films. Back-to-back. 

No call sheets.
No timings.
No outdated rules.

Just pure passion, grit, and the magic of filmmaking.

I’m building this with likeminded, film-passionate people in my team — the kind who don’t wait for permission, funding, or validation. The kind who want to create and keep creating.

The cast and crew will be total newcomers.

Fresh energy. Fresh faces. Fresh madness.

Music will matter.
Beauty will matter.

The vibe, the tone, the raw aesthetic — everything will be crafted to make the screen feel alive.

And let me be honest — 
I make movies to make money…
so I can make more movies. 

That’s the cycle. That’s the mission.

This is renegade.
This is cooperative cinema.
This is a movement.

Updates will follow next week. 
Stay tuned — because this wave is about to hit hard. 

- Manohar Chimmani