Pages

Tuesday, 15 July 2025

హమ్మయ్య... మినిమలిజమ్ ఎట్ లాస్ట్!


మినిమలిజమ్.
సోషల్ మీడియాతో ప్రారంభం... 

ఎక్స్, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ పేజ్... అన్నీ వదిలేశా. ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటే ఇక. 

నిజంగా ఏదైనా సాధించాలనుకొంటే, ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చాలు.

టైమ్‌పాస్‌కయితే పది కావాలి. 

టైమ్ పాస్ చేసే అంత టైమ్ నాకు లేదు కాబట్టి ఒక్కదానికే లిమిట్ చేసుకున్నాను. 

ఇన్‌స్టాగ్రామ్ చాలు. 

కట్ చేస్తే - 

ఒక 10-12 పోస్టుల తర్వాత, నాకెంతో ప్రియమైన బ్లాగ్‌ని కూడా దాదాపుగా వదిలేయాలనుకొంటున్నాను. ఏదైనా తప్పనిసరిగా రాయాలనుకొన్నప్పుడు ఈ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అవసరం కాబట్టి, అలా ఎప్పుడైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. లేదంటే, ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటి చాలు.  

అలాగని పూర్తిగా బ్లాగింగ్‌నే వదిలెయ్యటం లేదు.

26 నవంబర్ నుంచి నేను ప్రారంభించాలనుకొన్న ఒక కొత్త బ్లాగ్‌ను ఇప్పుడు వెంటనే ప్రారంభిస్తున్నాను. 

- మనోహర్ చిమ్మని

100 Days, 100 Posts. 89/100. 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani