Pages

Thursday, 29 May 2025

"స్పిరిట్" లీక్ అయితే ఏంటి?


సందీప్ రెడ్డి వంగా, దీపికా పడుకోన్ విషయంలో జరిగింది ఖచ్చితంగా ఒక చర్చనీయాంశమే. 

డైరెక్టర్స్ ఎంతో నమ్మకంతో హీరోలకు, హీరోయిన్స్‌కు కథలు చెప్తుంటారు. అతను/ఆమె కథ చెప్పిన ప్రతి హీరో/హీరోయిన్ దగ్గర "ఓకే" అవుతుందన్న గ్యారంటీ ఉండదు. కాని, ఇలా డైరెక్టర్స్ కథ చెప్పే ప్రతి ఒక్కరి దగ్గరా వాళ్ళను ఇంప్రెస్ చేసి ఒప్పించుకోడానికి దాదాపు మొత్త స్క్రిప్ట్ చెప్పేస్తుంటారు. 

ఇలా కథ చెప్పడం డైరెక్టర్స్‌కు తప్పనిసరి. అలా వారు చెప్పే కథ కోసం వాళ్ళు ఎంతో సమయం వెచ్చిస్తారు. ఎన్నో వందల రాత్రుల నిద్రను త్యాగం చేస్తారు. ఈ ప్రాసెస్‌లో ఎంతో డబ్బు కూడా ఖర్చవుతుంది. బయటివాళ్లకు తెలీదు కాని, అన్ని యాంగ్లిస్‌లో ఆలోచించి లెక్కకడితే ఈ ఖర్చు కూడా చాలా భారీగా ఉంటుంది. 

ఈ ప్రాసెస్ అంతటి విలువ హీరోలకు, హీరోయిన్స్‌కు బాగా తెలుసు కాబట్టి... కథ ఒప్పుకోకపోయినా ఆ కథని మాత్రం లీక్ చెయ్యరు. 

కాని, దీపిక విషయంలో జరిగింది వేరే. 

పూర్తి అన్-ప్రొఫెషనలిజమ్. 

దీపిక గొంతెమ్మ కోరికలు భరించలేక, ఆమెను సినిమాలోంచి తీసేసి, త్రిప్తి దిమ్రిని తీసుకున్నాడు సందీప్. 

ఎంతయినా ఇది దీపిక స్థాయి టాప్ బాలీవుడ్ హీరోయిన్‌కుపెద్ద అవమానం. భరించడం అంత ఈజీ కాదు. దీపిక తన పి ఆర్ టీమ్ ద్వారా పరోక్షంగా ఒక ఆన్‌లైన్ మ్యాగజైన్లో సందీప్ "స్పిరిట్" కథను ఒక మామూలు చీప్ కథగా లీక్ చేయించిందని తెలుస్తోంది. ఎందుకంటే... అలాంటి సినిమాలో తను చేయకపోవడమే బెటర్ అని తన చుట్టూ వున్న బాలీవుడ్ అనుకోవాలని.      

కాని, ఇక్కడున్నది "సందీప్ రెడ్డి వంగా. గుర్తుపెట్టుకో!" 

"ఇలా నా కథ లీక్ చెయ్యడం ద్వారా అసలు నువ్వేంటో నువ్వే లీక్ చేసుకున్నావు" అని ఎక్స్‌లో ఒక పవర్‌ఫుల్ ట్వీట్ పెట్టాడు. 

అంతే కాదు, "ఈసారి లీక్ చేసినప్పుడు మొత్తం కథ లీక్ చెయ్యి. నాకేం ఫరక్ పడదు" అని ఓపెన్‌గా మరీ ఇజ్జత్ తీస్తూ ట్వీట్ పెట్టాడు సందీప్ వంగా. 

That's Sandeep Vanga.
That's the real spirit of a Film Director. 

కట్ చేస్తే - 

ఇప్పుడు సందీప్-ప్రభాస్ "స్పిరిట్" కథ ఇలా లీక్ అవడం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ సందీప్‌కు.

లీక్ అయిన ఆ కథతోనే పది రెట్ల ఎఫెక్ట్ ఇచ్చే సినిమాను డైరెక్ట్ చేసి మనకు అందిస్తాడు సందీప్. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలను మించిన సినిమా అవుతుంది "స్పిరిట్". 

నాకా నమ్మకముంది.   
మనమే చూస్తాం. 

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 36/100.    

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani